బరాక్ ఒబామా
వికీపీడియా నుండి
బరాక్ హుస్సేన్ ఒబామా (జననం: ఆగస్టు 4, 1961) 2008వ సంవత్సరపు అమెరికా ప్రెసిడెంటు ఎన్నికలలో డెమాక్రటిక్ పార్టీకి చెందిన పోటీ అభ్యర్థి. ఇల్లినాయ్ రాష్ట్రానికి చెందిన సెనెటరు. ఆఫ్రికా-అమెరికా జాతికి చెందిన సెనెటర్లలో 5వ వాడు.
ఒబామా హవాయి రాష్ట్రంలోని హొనలులు అనే పట్టణంలో జన్మించారు, తల్లి అమెరికా మరియు తండ్రి కెన్యా దేశానికి చెందిన వారు. బాల్యం ఎక్కువగా హవాయి రాష్ట్రంలోనే గడచింది. ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు ఇండోనేషియాలోని జకార్తా నగరంలో తల్లి మరియు పెంపుడు తండ్రితో నివసించాడు. కొలంబియా విశ్వవిద్యాలయం మరియు హార్వార్డ్ నందు విద్యనభ్యసించి సామాజిక కార్యకర్తగా, విశ్వవిద్యాలయంలో బోధకుడిగా మరియు చట్టం హక్కుల లాయరుగా పనిచేసారు.