పూరీ మఠం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
పూరి మఠము జగద్గురువులు ఆది శంకరులచే స్థాపించబడిన నాలుగు మఠములలో ఒకటి. దీనినే పూర్వామ్నాయ మఠము అని, గోవర్ధన మఠమని కూడా అంటారు. ఇది దేశానికి తూర్పు తీరాన గల పూరీ పట్టణంలో ఉన్నది.
[మార్చు] మఠ విశేషాలు
ఈ మఠం భోగవార సాంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన','అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.
- మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ).
- పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు).
- పీఠశక్తి వృషలాదేవి(సుభద్ర).
- మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు.
- మహోదధి ఈ మఠ తీర్థము.
ఈ మఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు. భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం. ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ మఠం యొక్క మహావాక్యము. ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ,వంగ,కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు. ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.