పి.యశోదారెడ్డి
వికీపీడియా నుండి
పాకాల యశోదారెడ్డి ప్రముఖ రచయిత్రి.
యశోదారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులుగా పనిచేసి, పదవీ విరమణ చేసింది. ఆమె ధర్మశాల, ఎచ్చమ్మ కథలు తదితర కథాసంపుటులను వెలువరించింది. తెలంగాణ సజీవ భాషను ఆమె తన రచనల్లో వాడి పలువురి మన్ననలు పొందింది. ఆమె రాసిన కవితాసంపుటి కూడా వెలువడింది. పలు సాహిత్య విమర్శనా గ్రంథాలు రాసింది. తెలుగు ప్రాచీన సాహిత్యంపై ఆమె చేసిన ప్రసంగాలు పండితుల మన్ననలు పొందాయి. ఆకాశవాణిలో తెలంగాణ మాండలికంలో ప్రసంగం చేసిన తొలి రచయితగా ఆమె పేరు పొందింది. ఆమె ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది.
యశోదారెడ్డి 2007 అక్టోబర్ 7 న హైదరాబాదులో మరణించింది. ఆమె భర్త ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి.