పలాస కాశిబుగ్గ
వికీపీడియా నుండి
పలాస శ్రీకాకుళం జిల్లాకి అనాదిగ వాణిజ్య కేంద్రం. జిల్లా కి రెండవ రాజకీయ కేంద్రం అని చెప్పవచ్చు. ఉత్తర శ్రీకాకుళానికి రాజధాని వంటిది. పలాస జీడిపప్పు గురించి వినని వారు ఆంధ్ర రాష్త్రమున బహు కద్దు అని చెప్పటము అతిశయోక్తి కాదు. నిజానికి పలాస జీడిపప్పు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా వారికి కూడ సుపరిచితం. పలాస రైల్వే స్టేషను శ్రీకాకుళం జిల్లాకంతటికి పెద్ద స్టేషను. ఇది ఖుర్దా డివిజన్ లొ అతి ఎక్కువ లాభాలు సముపార్జించిన స్టేషను.
పలాస మరియు కాశీబుగ్గలిని జంట పట్టణాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎరుగుదురు. అనేక సంవత్సరాలుగ నగర పంచాయితిగా వున్న ఈ పట్టణాలు ఈ మధ్యనే ఉమ్మడి మున్సిపాలిటిగా అవతరించాయి. అనేక తర్జన భర్జనల పిదప మున్సిపాలిటిని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిగా వ్యవహరిస్తున్నారు. పాలబుగ్గ అన్న పేరుకి కొంత వూతమొచ్చినప్పటికి, ఆ పేరు నిలదొక్కుకొలేక పోయింది. నిజానికి కాశీబుగ్గకి ఆ పేరు రావడానికి ఒక కారణం వున్నది, పల్లి వీధి అవతల వున్న గుడిలో ఒక బుగ్గ వున్నదని అందున నీరు కాశీ నుంచి వచ్చునని నానుడి.
ప్రధాన భాష తెలుగు అయ్యినప్పటికి ఒరియా కూడా బాగా ప్రాచుర్యంలో వుంది. తెలుగు బడులతో సమానంగా ఒరియా బడులు కూడ వున్నవి. పలాస సొంపేట శాసనసభ పరిధిలో వుంటే కాశీబుగ్గ టెక్కలి శాసనసభ పరిధిలో వుంది.ఈ విధముగా రెండు నియొజకవర్గముల కోలాహలము ఒకే పట్టణంలో చూడవచ్చు. కొన్ని కాశీబుగ్గ పొస్టల్ వీధులు సొంపేట శాసనసభ పరిధిలో వున్నై, ఎన్నికల సమయమున ఈ వీధులవారికి రెండు నియొజకవర్గములవారి హోరు పరిపాటి. ఈ పలాస పది సంవత్సరముల ముందు ఒక పెద్ద గ్రామము.జీడిపరిశ్రమ ఇక్కడ బాగా వ్రుద్దిచెంది..జనాభా పెరగడమువలన పట్నము వాతావరణము నెలకొని ఉండేది.1995 వరకూ ఇది గ్రామపంచాయతీ గా పరిగణించబడేది. తరువాత దీన్ని 22-11-1996 తేదీన నగరపంచాయతీగా ఏర్పాటుచేసారు. ఆదాయవనరులు పెరగడము వలన, జనభా పెరుగుదల ద్రుస్టి లో పెట్టుకొని చుట్టుప్రక్క గ్రామాలు కొన్నింటిని కలిపి 2002 లో మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసారు. అప్పట్లో 21వార్డులుండేవి. ప్రస్తుతము 2007 నవంబర్ నాటికి :
జనాభ = 59,899 (2001 సెన్సెస్ ప్రకారము 49,899.) వార్డులు = 25. పని = జీడి పరిశ్రమ సుమారు 160 ప్రోసెసింగు యూనిట్స్ కలవు, సుమారు 15,000 కూలీలు.