పంతుల జోగారావు
వికీపీడియా నుండి
పంతుల జోగారావు తెలుగు కథకులు. వీరు అక్టోబరు 12, 1949లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. ప్రస్తుతం సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పనిచేస్తున్నారు. వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
జోగారావు గారి మొదటి కథ 'బహుమతి' 1966లో ఆంధ్రప్రభలో ప్రచురించబడినది. వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన 'గోవుమాలచ్చిమికి కోటి దండాలు', ఆంధ్రపత్రికలో ప్రచురించిన 'మసి మరకలు', ఆంధ్రభూమిలో ప్రచురించిన 'ఊరికి నిప్పంటుకుంది', 'బొమ్మ', 'చింతలుతీరని చీకట్లు', 'శిక్ష', 'అభ్యంతరం లేదు' మొదలైన కథలకు బహుమతులు లభించి మంచి గుర్తింపు తీసుకొని వచ్చాయి.
జోగారావు గారు చతురలో ప్రచురించిన 'విషగుళిక', 'అపురూపం' నవలలు గుర్తించబడ్డాయి. వీరి కథ నరమేధం జరుగుతుందిని కె.వి.ఎల్.నరసింహారావు హిందీలొ అనువదించి నరమేధ్ పేరుతో సారిక పత్రికలో ప్రచురించారు. వీరి కథల సంపుటి 'అపురూపం' 1998లో డా.సి.నారాయణరెడ్డి గారిచే ఆవిష్కరించబడింది.
[మార్చు] మూలాలు
- కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.