దేనా బ్యాంకు
వికీపీడియా నుండి
భారతదేశంలో ప్రముఖ బ్యాంకులలో దేనా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1938, మే 26 న దేవ్‌కరణ్ నాన్జీ కుటుంబం చే స్థాపించబడింది. ప్రారంభంలో దీని పేరు దేవ్‌కరణ్ నాన్జీ బ్యాంకింగ్ కంపెనీ లిమిటెడ్. 1939 డిసెంబర్ లో పబ్లిక్ కంపెనీ గా మారిన తర్వాత దీని పేరు దేవ్‌కరణ్ నాన్జీ పదాల లోని ప్రారంభ అక్షరాల నుంచి దేనా పేరుతో దేనా బ్యాంకు లిమిటెడ్ గా మార్పు చెందింది. 1969 లో ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేసిన 14 బ్యాంకులలో ఇది కూడా ఉంది. జాతీయం చేయబడిన తర్వాత దీని పేరులో లిమిటెడ్ తొలగిపోయి దేనా బ్యాంకుగా మారింది. ప్రస్తుతం దేశంలో మంచి మార్కెట్ షేర్లు కల్గియున్న బ్యాంకులలో ఇది ఒకటి.