తెలుగు వాక్యము
వికీపీడియా నుండి
విషయమును అర్థవంతముగాను, సంపూర్ణము గాను స్పష్టముగాను భావప్రకటనమును కలిగించెడి పదముల సముదాయమును వాక్యము అందురు. వాక్యములో మూడు ప్రధానమైన భాగములు ఉండును.
[మార్చు] భాగాలు
- కర్త : ఒక పనిని చేయువారు.
- కర్మ: ఆ పని యొక్క ఫలితములను అనుభవించునది.
- క్రియ: పనిని తెలియజేయు పదము.
[మార్చు] రకాలు
- సంపూర్ణ వాక్యము: సమాపక క్రియలో పూర్తి అగునట్టి వాక్యమును సంపూర్ణ వాక్యము లేదా సామాన్య వాక్యము అందురు. ఉదా: కల్యాణమండపములో వివాహము జరుగుతున్నది.
- అసంపూర్ణ వాక్యము: అసమాపక క్రియలలో వాడిన వాక్యమును అసంపూర్ణ వాక్యము అందురు. ఉదా: నేను దేవాలయమునకు వెళ్ళి,
- అవాంతర వాక్యము: ఒక సంపూర్ణము కాని వాక్యమును, ప్రసంగమున మధ్యలో వచ్చెడి వాక్యమును అవాంతర వాక్యము అందురు. ఉదా: తగిన ఇంధనము లేనిచో విమానము ఎగురలేదు.
- సంశ్లిష్ట వాక్యము: సంపూర్ణ వాక్యములను, అవాంతర వాక్యములను కలిగియుండి పూర్తి అర్ధము నిచ్చు వాక్యమును సంశ్లిష్ట వాక్యము అందురు. ఉదా: నీవు సక్రమముగా పోటీకి వచ్చి ప్రశ్నలకు శ్రద్ధగా సమాధానములు వ్రాయగలవు.
[మార్చు] మూలాలు
- తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.