See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
జాతీయములు-1 - వికీపీడియా

జాతీయములు-1

వికీపీడియా నుండి

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



  అ, ఆ, ఇ, ఈ    అక్షరాలతో మొదలయ్యే జాతీయములు.

విషయ సూచిక

[మార్చు]

[మార్చు] అన్నం, నీళ్లు పట్టించుకోకుండా

ప్రతిరోజూ చేసే దినచర్యలోని విషయాలేవీ పట్టించుకోకుండా ఏదో ఒక్క విషయాన్నే పట్టుకుని, అదే ధ్యాసలో ఉండడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. సాధారణంగా ఏ మనిషైనా ఎంత కష్టపడి ఏకాగ్రతతో పనిచేస్తున్నా ఏదో ఒక సమయానికి ఎంతోకొంత తినడమో, తాగడమో చేస్తుంటాడు. అలా ఆహారం స్వీకరించడానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా సమయాన్నంతటినీ అనుకున్నపనికే వెచ్చిస్తున్నాడని ఒక వ్యక్తి కార్యదీక్ష గురించి చెప్పేందుకు ఈ జాతీయ ప్రయోగాన్ని చేయడం కనిపిస్తోంది. 'తిండి, నీళ్లు మాని కష్టపడి సంపాదించి పిల్లలను పైకి తెచ్చాడాయన' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] అందిపుచ్చుకోవడం

అలవరచుకోవడం అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒకరి నుంచి మరొకరు ఏదైనా అలవాటు చేసుకుంటున్న సందర్భంలో లేదా నేర్చుకుంటున్న సందర్భంలో కూడా అప్పుడప్పుడు ఈ జాతీయం ప్రయోగించడం కనిపిస్తుంది. 'ప్రతిపక్షాలు సైతం ఈ విషయంలో పాలకపక్షం సంస్కృతినే అందిపుచ్చుకుంటున్నాయి' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] అగ్నిస్నాతుడు

పవిత్రుడు అని అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మాములుగా అయితే అగ్నితో స్నానం చేసినవాడు అనేది అర్థం. పూర్వకాలం ప్రచారంలో ఉన్న అగ్నిపరీక్షలాంటివాటి నేపథ్యంలో ఈ జాతీయం ఆవిర్భవించింది. 'ఆయన అగ్నిస్నాతుడు. అలాంటిలాంటివాడు కాదుసుమా!' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని వాడడం కనిపిస్తుంది.

[మార్చు] అరివీర భయంకరుడు

అరివీరుడు అంటే వీరుడైన శత్రువు అని అర్థం. అలాంటి బలమైన శత్రువులకు అంతకంటే బలమైనవాడు ఎదురైతే వాడిముందు ఆ వీరులైన శత్రువులంతా నశించిపోవలసిందే. ఈ భావం ఆధారంగానే గొప్ప గొప్ప శత్రువులను, మహాబలవంతులైనవారిని మించిన బలవంతుడు, అత్యంత సమర్ధుడు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'వాడి జోలికి వెళ్లొద్దు, వాడసలే అరివీర భయంకరుడు సుమా!' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] అడ్డుకట్ట వేయడం

అదుపు చేయడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఒక ప్రవాహాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడం అందరికీ తెలిసిందే. ఆ అడ్డుకట్టతో నీటి ప్రవాహాన్ని అదుపుచేసినట్లే ఒకరు మరొకరిని అదుపులో పెట్టే సందర్భాల్లో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. 'వాడి దూకుడుతనానికి వాళ్ల నాన్న అడ్డుకట్ట వేసి ఓ మంచి పని చేశాడు' అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] అధఃపాతాళానికి చేరటం

దిగజారిపోవడం, పతనమవ్వటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాతాళం ఎక్కడో అడుగున ఉంటుంది. అంత అట్టడుగుకు చేరటమంటే ఇక కనిపించకుండా పోవటమనే ఓ భావన ఉంది. ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఉండాల్సినవారు తప్పులుచేసి నైతికంగా విలువను కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనుపిస్తుంది. "నిన్నటి ఆయన ప్రవర్తన ఆయనను అధఃపాతాళానికి చేర్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.


[మార్చు] అడ్డదారులు తొక్కడం

అక్రమ పద్ధతులను అనుసరించడం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. మనిషి ఒక గమ్యాన్ని చేరుకోవడానికి ఒకదారి నిర్దేశితమై ఉంటుంది. ఆ దారిలో పదిమంది నడుస్తూ ఒక క్రమపద్ధతిని అనుసరిస్తే అంతా సక్రమంగా ఉంటుంది. అలా కాక అందులో ఎవరైనా స్వార్థబుద్ధితో ప్రవర్తించి అందరికంటే ముందుగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరడానికిగాను నిర్దేశించిన మార్గంలో కాక వెళ్లకూడని విధంగా అడ్డదోవలో వెళ్లినప్పుడు అతడు లక్ష్యాన్ని చేరవచ్చేమోకానీ ఆ అడ్డదోవలో వెళ్లినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంటుంది. ఎవరి ఇళ్ల మధ్య నుంచి వెళ్లడమో, లేదా మరెవరి పొలం మధ్యనుంచో వెళ్లడమో చేస్తే ఆయా వ్యక్తులకు అసౌకర్యం కలగవచ్చు. ఎదుటివారి అసౌకర్యాలను లెక్కించక తన లాభం కోసం ప్రయత్నించడం పదిమందినీ బాధిస్తుంది కూడా. ఇలాంటి భావన ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. 'అడ్డదారులు తొక్కి, ఎంతమందినో బాధించి సంపాదించాడు.ఇప్పుడు పట్టుబడి జైలుపాలయ్యాడు' అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది.

[మార్చు] అక్కన్న మాదన్నలు

ఒకరికొకరు విడిపోని వారు. తానీషా కొలువులోని అక్కన్న మాదన్నలులా అని అర్థము.

[మార్చు] అక్షింతలు వేయు

ఆశీర్వదించు

[మార్చు] అగ్గి బుక్కు

ఇది తెలంగాణా గ్రామీణ ప్రాంతంలో వినిపించే జాతీయం. కోపంతో ఉడికి పోవటం అనేది దీని అర్థం. నిప్పులు కక్కడం లాంటి రూపాల్లో ఇతర ప్రాంతాల్లో వినిపిస్తుంటుంది. అగ్గి అంటే అగ్ని అని బుక్కు అంటే బొక్కటం అని అర్థం. 'నీవు చేసిన పనికి పటేల్‌ అగ్గి బుక్కుతున్నాడు' అనే లాంటి సందర్భాలు ఉన్నాయి.

[మార్చు] అగ్గిదాగి పోవడం

తహతహలాడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తీరని కోరికలు మనిషిలో, మనసులో అగ్నిలాగా బాధ పెడుతూ ఉంటాయి. ఈ భావన ఆధారంగా ఈ జాతీయం అవతరించింది. 'మధ్య నిషేధం అమలు కారణంగా జనాలలో సారా అగ్గి దాగి పోయినట్టయింది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] అగ్రతాంబూలం

మొదటి స్థానము ఇవ్వు, అందరి కంటే ఎక్కువగా గౌరవించు। కృష్ణున్ని దర్మరాజు మయసభలో "అగ్రతాంబూలం" ఇచ్చి సత్కరించినాడు।

[మార్చు] అచ్చటా, ముచ్చటా

ముద్దూ మురిపము

[మార్చు] అచ్చిక, బుచ్చిక

కలుపుకోలుతనము

[మార్చు] అచ్చు, ముచ్చు

దొంగ దొర

[మార్చు] అచ్చేసిన ఆంబోతులా

ఊరిమీదకు జులాయిగా (ఏ పనీ పాట లేకుండా) తిరగడానికి వదిలేసినట్లు.


పల్లెటూళ్ళలో బళ్ళు లాగడానికి వాడే ఎడ్లు 'జెల్లకొట్టడం వలన' సంతానోత్పత్తికి పనికిరావు. ఒకటి రెండు గిత్తలను అలా కాకుండా యద అయిన ఆవులను 'దాటించడం కోసం' ఉంచుతారు. దానిని ఆంబోతు లేదా ఆబోతు అంటారు. ఒకో సారి దానికి 'అచ్చు' వేయడం, అనగా వంటిమీద కాల్చిన ముద్ర వేయడం, కూడా జరిగేది. ఈ ఆబోతుకు బాగా మేయడం, బలిసి వూరంతా తిరగడం, యద అయిన ఆవులను 'దాటడం' - ఇదే పని. దానికి అంతా భయపడతారు కూడాను. దానికి బళ్ళు లాగడం, నాగలి దున్నడం వంటి పనులు ఉండవు. కనుక పనీ పాటా లేకుండా తిరిగేవాడిని "అచ్చేసిన ఆంబోతు" లేదా "అచ్చోసిన ఆంబోతు" అని అంటారు.

[మార్చు] అట్టుడికినట్టు

అందరికి చర్చనీయాంశం కావడం.

[మార్చు] అడపాదడపా

అప్పుడప్పుడు

[మార్చు] అడకత్తెరలో వక్కలా

[మార్చు] అడవి ఉసిరి, సముద్రపు ఉప్పు కలిసినట్లు

ఎక్కడెక్కడివారో ఒకచోట కలుసుకోవడము

[మార్చు] అడవి కాచిన వెన్నెల

ఎంతో విలువైన వస్తువు వృధా అయిపోతున్నదనే అర్ధంలో వాడతారు.

[మార్చు] అటుకులు తిన్నట్టు

[మార్చు] అరటి వలిచి పెట్టినట్టు

చక్కగా విడమరచి అర్ధమయ్యేలా చెప్పడం. అసలు అరటిపండు తినడమే చాలా సులభం. అది కూడా వలిచి పెడితే ఇంక తినేవాడికి ఏ మాత్రం కష్టం ఉండదు. అలాగే అరటిపండు వలిచిపెట్టినట్లు చెప్పితే వినేవాడికి అర్ధం కాకపోవడం జరగదు.

[మార్చు] అడుగులకు మడుగులొత్తు

చాల వినయం,మర్యాదగా ప్రవర్తించడం.

[మార్చు] అడుగు గులాము

పాద దాసుడు

[మార్చు] అడగనివానిదే పాపము

'అడగనివాడు పాపాత్ముడు' అని కూడా అంటారు. ఈ జాతీయం ప్రయోగం ఇలా ఉంటుంది.

ఒక వూళ్ళో ఒక మంచి ఆసామి ఉన్నాడు అనుకోండి. ఆయన అడిగినవాడికల్లా అప్పులో, దానాలో, సలహాలో దండిగా ఇచ్చేవాడు. అంటే అడగనివాడికి ఏమీ ముట్టి ఉండదు. మిగిలినవాళ్ళు పుణ్యం చేసుకొన్నారు గనుక కష్టపడకుండా లాభం పొంది ఉంటారు. అడగనివాడు పాపాత్ముడు గనుక సులభంగా ప్రయోజనం పొందే అవకాశం జారవిడుచుకొన్నాడు.


(ఈ జాతీయం 'అడిగినవాడిని, అడగనివాడిని' గురించి చెప్పడానికి వాడరు. ఆ 'ఆసామి' గురించి చెప్పడానికి వాడుతారు. బహుశా ఈపాటికి ఆ ఆసామి ఆస్తి అంతా కరిగిపోయి, దయనీయ స్థితిలో ఉండి ఉంటాడు.)

[మార్చు] అడవి మృగాల్లాగ

విచక్షణా రహితంగా అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. అడవిలో ఉండే జంతుజాలానికి మనిషికి ఉన్నట్టు విచక్షణ అనేది ఉండదు. జంతువు ఎలాపడితే అలా ప్రవర్తిస్తుంటుంది. ఆ మృగాల్లాగ ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు 'ఎందుకలా అడవి మృగాల్లాగ ప్రవర్తిస్తారు' అనేలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] అడ్డగఱ్రలు

[మార్చు] అడ్డగాలు

[మార్చు] అడ్డుపుల్లలు

ఆటంకపరచడం.

[మార్చు] అడ్డూ అదుపూ లేకుండా

నిరాటంకంగా

[మార్చు] అడ్డాదిడ్డాలు

అదుపులేకుండ.

[మార్చు] అదవద

[మార్చు] అత్తమీద చూపులు, అంగటి మీద చేతులు

[మార్చు] అదను పదను

సరియైన సమయము

[మార్చు] అదరు బెదరు

భయపడటము

[మార్చు] అద్దములో నీడకి ఆశపడు

[మార్చు] అద్దమరేయి

అర్థరాత్రి

[మార్చు] అనగి, పెనగి

కలసిమెలసి ఉండటము

[మార్చు] అనాఘ్రాత పుష్పము

వాసన చూడని పుష్పము అనుభవించని వస్తువు

[మార్చు] అన్నమో రామచంద్రా అను

అలో లక్ష్మణా అను అని కూడా ఉంది దీనిని ఆకలితో బాధపడుట కు సమానార్దముగా చెప్పుదురు

[మార్చు] అన్నెము, పున్నెము

అన్యాయము, న్యాయము తెలీకుండుట

[మార్చు] అన్ని ఉన్న విస్తరి

చక్కగా అణిగి మణిగి ఉండువారు

[మార్చు] అప్పు సప్పులు

[మార్చు] అమ్మయ్య

[మార్చు] అమ్మలక్కలు

చుట్టు పక్కల పరిచయమున్న అడవాళ్ళు. ("'అమ్మ"'లు + "'అక్క"'లు)

[మార్చు] అమీతుమీ

అటో, ఇటో / నువ్వో నేనో . సందిగ్ధతను పోగొట్టి విషయాన్ని అటో ఇటో తేల్చేసుకోవడమనే అర్థంలో ఈ పదాన్ని వాడతారు. హిందీ లేదా బెంగాలీ నుండి చేరిన మాటగా అనిపిస్తుంది.

ఉదా: నేనెంతగా అడుగుతున్నా బాసు ఏ విషయమూ తేల్చడం లేదు. ఇక లాభంలేదు, ఇవ్వాళ అమీ తుమీ తేల్చుకోవాల్సిందే.

[మార్చు] అయిదు పది సేయు

[మార్చు] అయ్యలవారి నట్టిల్లు

[మార్చు] అరణ్యరోదన

[మార్చు] అరికాలి మంట నడినెత్తికెక్కు

కోపము ఎక్కువగు

[మార్చు] అరచేతిలో వైకుంఠము చూపు

[మార్చు] అరచేతిలో ప్రాణములుంచుకొను

[మార్చు] అరచేతి మాణిక్యము

ముంజేతి కంకణము నకు సమానార్దము

[మార్చు] అరవ చాకిరి

[మార్చు] అర్రులు చాచు

[మార్చు] అల్లారు ముద్దు

[మార్చు] అల్లిబెల్లి మాటలు

కల్లబొల్లి పలుకులు

[మార్చు] అల్లోనేరేడు

రాజ జంబూ వృక్షము (నేరేడు చెట్టు) సంగీత విశేషము బాలక్రీడా విశేషము

[మార్చు] అవాకులు, చవాకులు

అడ్డాదిడ్డపు మాటలు నోటికి వచ్చినట్లు మాటలాడుట సాధారణంగా "అవాకులు, చవాకులు పేలుట" అని ఉపయోగిస్తారు

[మార్చు] అహరహం జపించడం

నిరంతరం ఒకే విషయాన్ని మాట్లాడడం, పదేపదే చెప్పిందే చెబుతూ ఉండడం అనేలాంటి అర్థాలతో ఈ జాతీయం కనిపిస్తుంది. కొంతమంది ఎదురైన ప్రతివారి దగ్గర తమకు కావలసిన దాన్ని గురించి విసుగూ విరామం లేకుండా చెబుతుంటారు. అలాంటి పరిస్థితులలో 'వాడు అహరహం జపించే ఆ విషయాన్ని గురించి కాస్త మీరైనా పట్టించుకోండి' అనేలాంటి ప్రయోగాలు ఉన్నాయి.

[మార్చు] అం

[మార్చు] అం అనిన ఢం అననేరడు

అం అంటే ఢం రాదుఅని కూడా దీన్ని వాడతారు. అంటే కొంచెం కూడా చదువు రాదు అనే అర్థంలో వాడతారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదు అనే జాతీయం కూడా ఇదే సందర్భం లో వాడతారు.

[మార్చు] అంకకాడు

కలహ ప్రియుడు

[మార్చు] అంకాపొంకాలు

కోపము, విరోధము, తీవ్రము

[మార్చు] అంకురార్పణము

అంకురము అనగా మొలక. మొలకెత్తించుట. అంకురార్పణము అనగా ప్రారంభ మని భావము. ఏదేని శుభకార్యము చేయునపుడు మొదలుపెట్టుటకు దీనిని ఉపయోగిస్తారు. తిరుమలలో బ్రహ్మోత్సవములుకు అంకురార్పణము చేయుట అనునది ఈ జాతియానికి చాలా ప్రముఖ ఉపయోగము

[మార్చు] అంగడి పెట్టు

అంగడి అనగా దుకాణము లేదా కొట్టు. ఏదన్నా విషయాన్ని అనవసరంగా నలుగురితో చెప్పడాన్ని/బహిరంగపరచడాన్ని అంగడి పెట్టడం, లేదా దుకాణం పెట్టడం అని అంటారు.

[మార్చు] అంగలార్చు

అతిగా ఆశపడటం. ఎక్కువగా ప్రతికూలార్ధంలో వాడతారు.

[మార్చు] అంచుక ఇంచుక

ఏదో కొద్ది గొప్ప

[మార్చు] అంజనమున మాటలాడనేల?

దీనికి ముంజేతి కంకణమునకు అద్దమేల? సమానార్దముగా చెప్పుకొనవచ్చు

[మార్చు] అండ దండ

ఆదుకొను దిక్కు। "నాకండా దండా నీవేనయ్యా" "భద్రాచలం కొండా.... కావాలా నీకండా దండా....." అను చిరంజీవి పాట గుర్తు రావడంలేదూ!

[మార్చు] అంతు పంతు

ఆదీ అంతమూ అని అర్థము। అంతూ పొంతూ లేకుండా సాగిపోతున్న మన టీ వీ సీరియల్లు లాగా అన్నమాట :-)

[మార్చు] అందని ద్రాక్ష

[మార్చు] అందచందములు

[మార్చు] అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

వీలు ఐతే అధికారం చేయడం లేకపోతే కాళ్ళు పట్టుకోవడం.

[మార్చు] అందె వేసిన చేయి

భాగా అనుభవము ఉన్న: అతను సంగీతంలో అందె వేసిన చేయి

[మార్చు]

[మార్చు] ఆర్చటం తీర్చటం

కష్టాలను పోగొట్టడం, కాపాడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలోఉంది. కష్టాల వల్ల కలిగే బాధను సమసింపజేసి ఊరట కలిగించి చేయూతనిచ్చే సమయంలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. "ఇన్నాళ్ళూ నా కష్టాలను ఆర్చేదెవరో తీర్చేదెవరోనని మదనపడ్డాను. ఇన్నాళ్ళకు ఈయన కనిపించాడు" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] ఆదమరిచివుండు

అజాగ్రత్తగా ఉండడమనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. తీసుకోవలసిన జాగ్రత్తలను సరిగా తీసుకోకుండా కొన్నిటిని మరిచిపోవడం, లేదా దానివల్ల ప్రమాదం రాదులే అనుకోవడం లాంటి స్థితిని ఇది సూచిస్తుంది. కొంత మంది భాషాపండితులు ఇది పరభాషా ప్రభావంతో వచ్చిందని, 'యాద్‌' అనే పదం ఆదగా అయిందని, ఆ తర్వాత మరిచిపోవడం అనేది చేరి జాతీయంగా మారిందని చెపుతారు. 'ఏ కొద్దిగా ఆదమరిచినా ఆ విషయంలో ప్రమాదం జరిగివుండేది. అలా కానందునే బతికిపోయాము' అనేలాంటి సందర్భాల్లో దీని ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] ఆటలు సాగలేదు

అనుకున్నది జరగలేదు అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. "మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, అందరికీ ఉపాధి చూపిస్తానని ఇతరత్రా వాగ్దానాలు చేసినా అవి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోయాయి. ప్రతిపక్షపార్టీ అభ్యర్థి నిజాయితీ ముందు అతని ఆటలు సాగలేదు" అనే సందర్భాల్లో ఈ జాతీయం వాడుకలో ఉంది.

[మార్చు] ఆదరాబాదరా

హడావుడి పడటం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. "కళాశాలకు సమయం మించిపోయిందని ఆదరాబాదరాగా తయారై వెళ్లాడు" అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది.

[మార్చు] ఆవంత

అత్యల్పం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొంచెం అని చెప్పటానికి దీన్ని ప్రయోగిస్తుంటారు. ఇక్కడ ఆవు.., అంత.. అనే పదాలు కలవటం జరిగింది, అంటే ఆవగింజ అని అర్ధం. ప్రమాణంలో ఆవగింజ చాలా చిన్నది. అంతకొద్దిపాటిది అని చెప్పడానికి 'ఆవగింజంత పని కూడా నీవల్ల కాలేకపోయింది' అనే లాంటి సందర్భాలలో దీని ప్రయోగిస్తుంటారు.

[మార్చు] ఆకాశానికెత్తటం

అతిగా పొగడటం అనే అర్ధంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. అలంకారాలలో అతిశయోక్తి అలంకారం ఒకటుంది. దానికి ఉదాహరణగా నగరంలోని సౌధాగ్రాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని చెబుతారు. ఎంత ఎత్తుకట్టినా సౌధాలు ఆకాశాన్ని తాకటం అనేది జరిగే పనికాదు. అంటే ఇక్కడ విషయాన్ని అతిగా వర్ణించి చెప్పడం కనిపిస్తుంది. ఇలాంటిదే ఈ జాతీయం కూడా. గోరంతలను కొండంతలు చేసి ఎవరినైనా అతిగా పొగడుతున్నప్పుడు 'మరీ అంతగా ఆకాశానికెత్తొద్దులే' అనే లాంటి ప్రయోగం కనిపిస్తుంది.

[మార్చు] ఆకాశపంచాంగము

పుక్కిటి పురాణము లేనిపోని గాలి ప్రచారములు

[మార్చు] ఆకాశరామన్న ఆర్జీలు

సంతకం లేకుండా వ్రాయు ఉత్తరాలు

[మార్చు] ఆకాశచిత్రము

ఆకాశమున గీయబడిన బొమ్మ

[మార్చు] ఆకు అలము

ఆకులు మొదలగున్నవి "నాకు ఆకులు అలములు వేసి పెట్టినారు , ఆ అడవిలో భోజనము"।

[మార్చు] ఆకు చాటు పిందెలలాగా

ఆకు చాటు నున్న పిందెలు, ఎండ వాన తగలకుండ సున్నితముగా ఉంటాయి। అలా ఒకరి రక్షణలో ఉన్న అమాయకపు, సున్నితపు వారిని ఆకు చాటు పిందెలలాగా అని అంటారు।

[మార్చు] ఆగవేగము/ఆఘమేఘాల మీద

అతి వేగము

[మార్చు] ఆటవిడుపు

విశ్రాంతి దినము ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాశ్యకో పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అందురు।

[మార్చు] ఆటు, పోటు

సముద్రములో వచ్చునవి జీవితములో కష్టాలను ఆటుపోటులతో పోల్చడము సర్వసాధారణము।

[మార్చు] ఆటపాటలు

ఆటలు, పాటలు ఉల్లాసకరమైన క్రీడలు

[మార్చు] ఆటలో అరటిపండు

చిన్నపిల్లలు ఆదుకొనునప్పుడు దెబ్బ తగిలిననూ, బాధపడక అరటిపండు తొక్కినట్లు భావించెదరే కాని ఏడవరు। ఇదే ఉద్దేశ్యములో దీనిని తరచుగా ఉపయోగించెదరు। ఇప్పుడు ఎవరన్నా సరిగ్గా ఆడకపోయినా ఆటలో అరటిపండు అని ఉపయోగిస్తున్నారు।

[మార్చు] ఆడుచు, పాడుచు

శ్రమ తెలవకుండా సంతోషంగా హాయిగా చేసే పని.

[మార్చు] ఆదమరచి నిద్రించు

గాఢంగా నిద్రించు ఎటువంటి ఆలోచనలూ లేకుండా నిద్రించు తన రక్షణగురించిన చింత కూడా లేకుండా నిద్రించు

[మార్చు] ఆదరా, బాదరా

హడావిడి

[మార్చు] ఆనుపాను

పుట్టుపూర్వోత్తరం గుట్టుమట్లు

[మార్చు] ఆపసోపాలు

అలసట చెందినవారికి ఇది ఉపయోగిస్తారు

[మార్చు] ఆరంభశూరత్వంబు

ఆంధ్రులు ఆరంభశూరత్వము అనే అపవాదు తెలిసినదే కదా!

[మార్చు] ఆర్చు పేర్చు

విజృంభించు

[మార్చు] ఆర్చు, తీర్చు

ఓదార్చు

[మార్చు] ఆరితేరు

మిక్కిలి నైపుణ్యం సంపాదించడం.

[మార్చు] ఆరు నూరైనా, నూరు ఆరైనా

ఎట్టిపరిస్థితుల్లోనైనా

[మార్చు] ఆవులించిన పేగులు లెక్కపెట్టు

ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేవాడంటే చాలా తెలివి గలవాడనీ, చురుకైనవాడనీ అర్ధం

[మార్చు] ఆడిందే ఆటగా

ఇష్టానుసారంగా అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ప్రతి ఆటకు కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయి. అవేవీ పట్టనట్టు తాను ఎలా ఆడితే అదే అసలైన ఆట అంటూ కొంతమంది వాదించి గెలిచే ప్రయత్నం చేస్తుంటారు. ఇదే తీరులో ఏ వ్యవహారంలోనైనా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే... అంటే తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటే 'ఆయన ఆడిందే ఆటగా ఇన్నాళ్లూ సాగింది లెండి' అనడం కనిపిస్తుంది.

[మార్చు]

[మార్చు] ఇల్లు-ఇరవాటు

ఇది తెలంగాణ ప్రాంతంలో వినిపించే జాతీయం. తెలుగుభాషలో పురుగుపుట్ర లాంటి జాతీయాలు ఉన్నట్లుగానే ఇదికూడా ఉంది. ఇంటిలోకి కావలసిన అంటే గృహసంబంధమైనవన్నీ అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. 'ఆయనకేం ఇల్లూ ఇరవాటు అంతా మంచిగానే ఉన్నాయి" అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది.

[మార్చు] ఇల్లలకంగానే పండుగకాదు

పూర్వకాలం నాటి గృహాలలో నాపరాళ్ళను వాడేవారు కాదు. అందుకని ఇంట్లో నేల శుభ్రంగా ఉండాలంటే పేడతో ఇల్లు అలికేవారు. ఇల్లు అలకడం అనేది విడిరోజుల్లో ఎలా ఉన్నా పండుగ లొస్తున్నాయనుకున్నప్పుడు తప్పనిసరిగా చేసేవారు. అలకటం, ఆతరువాత చక్కగా ముగ్గులు పెట్టటం, అనంతరం గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం లాంటి అలంకరణలతో ఇంటికి పండుగ శోభ వచ్చేది. అప్పుడు ఏ పండుగ అయితే ఆ పండుగను ఆచారం ప్రకారం జరుపుకొనేవారు. ఆనాటి ఈ తీరును ఆధారంగా చేసుకొని ఈ జాతీయం అవతరించింది. కేవలం ఇల్లు ఒక్కటి అలికి కూర్చుంటే పండుగ ఎలా పూర్తికాదో అలానే ఏదో ఒక చిన్నపని చేసి ఇక అంతా అయిపోయిందిలే అనుకోవటం కూడా సమంజసంకాదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. 'ఎన్నికలలో నిలబడగానే సరిపోలేదు. ఇల్లలకంగానే పండుగకాదు అన్నట్టు రేపు గెలిచినప్పుడు కదా అసలు విషయం తేలేది' అనేలాంటి ప్రయోగాలున్నాయి.

[మార్చు] ఇంటిదొంగ

ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నది ఓ సామెత. అలాగే ఇంటిదొంగ కన్నుండగానే... గుడ్డుమాయం చేస్తాడని కూడా అంటారు. అంటే అన్ని విషయాలు బాగా తెల్సిన సొంతవ్యక్తే నమ్మకద్రోహాన్ని తలపెట్టిన పరిస్థితుల్లో ఇలా ఈ జాతీయాన్ని ప్రయోగించటం వాడుకలో ఉంది. కుటుంబ సభ్యుల్లోని ఒకవ్యక్తి తన ఇంటిలోనే దొంగతనం చేస్తే పట్టుకోవటం ఎంత కష్టమవుతుందో అలాగే బాగా నమ్మించి మోసం చేసిన వ్యక్తిని కూడా అంతతొందరగా పట్టుకోవడం సాధ్యంకాదనే భావనను ప్రతిబింబిస్తోంది.

[మార్చు] ఇంటిదీపం

ఇల్లాలు అనే అర్థంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. ఎవరి ఇంటికైనా దీపకాంతుల కళకళలలాంటి ఆనందాల రవళులను సంతరించిపెట్టగలిగేది ఇల్లాలే. గృహస్థాశ్రమ ధర్మవిశిష్ఠతను చాటిచెప్పడం కూడా ఈ జాతీయం వెనుక దాగివున్న భావనగా కనిపిస్తుంది. దాంపత్యంలో ఇల్లాలి పాత్ర గొప్పదనాన్ని వెలువరిస్తుందీ జాతీయం. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు లాంటి ప్రయోగాలు చేయడం కనిపిస్తుంది.

[మార్చు] ఇంగువ కట్టిన గుడ్డ

గతవైభవ చిహ్నం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. వంటకాలలో ఇంగువను వాడుతుంటారు. ఈ ఇంగువ వాసన ఘాటుగానే ఉంటుంది. దాన్ని ఉంచిన గుడ్డకు దాని వాసన అంటుతుంది. ఇంగువ అయిపోయినా కూడా అది కట్టిన గుడ్డలో ఇంగువ ఉన్నట్లుగానే అనిపించేలా చాలాకాలంపాటు వాసన వస్తుంటుంది. ఈ భావన ఆధారంగా గతంలో ఎంతో వైభవంగా ఉండి ప్రస్తుతం ఆ వైభవానికి సంబంధించిన విషయాలు ఏవీ లేకపోయినా ఆ వైభవాల స్మృతులు చెప్పుకుంటూ ఉన్న సందర్భంలో ఈ జాతీయం వాడుకలో కనిపిస్తుంది.

[మార్చు] ఇంద్రుడు, చంద్రుడు

విపరీతంగా పొగడడం అనే అర్ధంలో ఈ జాతీయం వాడుకలో ఉంది. భోగాలను అనుభవించడంలో ఇంద్రుడికి, అందంగా ఉండడంలో చంద్రుడికి ఎవరూ సాటి లేరని అతిశయోక్తులు చెప్పుకోవడం లోకంలో ఉంది. ఈ భావం ఆధారంగానే ఎవరినైనా బాగా పొగడదల్చుకున్నప్పుడు మీకేంటి, భోగభాగ్యాలను అనుభవించడంలో ఇంద్రుడి లాంటివారు, అందం, ఆకారంలో చంద్రుడంతటి వారు అని పొగిడినంతగా... ఉన్నవీ లేనివీ కల్పించి ఎవరినైనా పొగుడుతున్న సందర్భంలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది.

[మార్చు] ఇనుపగజ్జెలతల్లి

దరిద్రదేవత

[మార్చు] ఇల్లు గుల్ల చేయు

ఇంటిలో ఉన్న ఆస్థి మొత్తం నాశనం చేయుట

[మార్చు] ఇసుక తక్కెడ, పేడ తక్కెడ

[మార్చు] ఇసుక చల్లినా రాలని జనం

[మార్చు] ఇం

[మార్చు] ఇంచు మించు

సుమారుగా

[మార్చు] ఇంటిల్లపాది

ఇంటిలోని అందరూ

[మార్చు] ఇంపు సొంపులు

[మార్చు]

[మార్చు] ఈకకు ఈక, తోకకు తోక

ఏ పార్టుకు ఆ పార్టు విడతీయుట

[మార్చు] ఈడు జోడు

సరి, సమానము


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -