చిరంజీవులు (సినిమా)
వికీపీడియా నుండి
చిరంజీవులు (1956) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున , గుమ్మడి |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | వినోదా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
ఒక పల్లెటూర్లో మోహన్ (యన్.టి.ఆర్), రాధ (జమున) ఇరుగు పొరుగున నివసించే పిల్లలు. చిన్ననాటి నుంచి వారిద్దరి మధ్య చెలిమి మొగ్గ తొడిగింది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు. మోహన్ తండ్రి మిఠాయిబండి నడిపేవాడు. కాలక్రమేనా వారిద్దరు పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికీ పెళ్ళి కూడా నిశ్చయమవుతుంది. అయితే అంతకుముందే వారిద్దరూ కలిసి తిరునాళ్ళకు వెళతారు. అక్కడ డాక్టర్ కృష్ణ (గుమ్మడి) రాధను చూస్తాడు.
పెళ్ళికోసం బంగారు వస్తువులు కొనడానికి వెళ్ళిన మోహన్ దురదృష్టవశాత్తూ కంటిచూపుకు దూరమవుతాడు. కొంతకాలం డాక్టరు దగ్గర వుండాల్సి వస్తుంది. సకాలంలో మోహన్ ఇంటికి రాకపోవడం వల్ల అతన్ని మోసగాడుగా భావించి రాధకు డాక్టరుతో పెళ్ళి జరిగే ఏర్పాటు చేస్తారు.
మోహన్ ఇంటికి తిరిగి వచ్చి రాధకు పెళ్ళి జరిగిపోయిందని తెలిసి బాధపడతాడు. తిరిగి టౌనుకు వెళ్ళిన మోహన్ కు డాక్టర్ కృష్ణ ఆశ్రయమిచ్చి అతనికి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. రాధకు అతన్ని పరిచయం చేయగా ఆమె మోహన్ ను చూసి నిర్ఘాంతపోతుంది.
చూపువచ్చిన మోహన్ పల్లెటూరికి తిరిగి వెళతాడు. అతన్ని వెతుక్కుంటూ రాధ కూడా వెళుతుంది. వారిద్దరూ చిన్ననాడు నిర్మించుకొన్న పొదరిల్లు వద్ద ప్రాణాలు విడుస్తారు.
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక అందాక | మల్లాది | ఘంటసాల | ఘంటసాల |
కనుపాప కరవైన కనులెందుకో, తనవారె పరులైన బ్రతుకెందుకో | మల్లాది | ఘంటసాల | ఘంటసాల పి.లీల |
చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు | మల్లాది | ఘంటసాల | ఘంటసాల పి.లీల |
మనసు నీదే మమత నాదే నాదానవే నే నీవాడనే | మల్లాది | ఘంటసాల | ఘంటసాల |
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎడబాసి మాయమయేవా | మల్లాది | ఘంటసాల | ఘంటసాల |
[మార్చు] మూలాలు
- ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.