కందం
వికీపీడియా నుండి
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు
|
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
విషయ సూచిక |
[మార్చు] కందం
తెలుగు పద్యాలలో అత్యంత అందమైన పద్యంగా కందాన్ని పేర్కొంటారు. ఈ పద్యపు లక్షణాలు చూడటానికి కష్టంగా కనిపించినా ఇందులోని గణాలన్నీ నాలుగుమాత్రల గణాలు కావడం వలన, ఈ పద్యం నడక సులువుగా పట్టుబడుతుంది. సుమతీ శతకములోని పద్యాలన్నీ కందపద్యాలే.
[మార్చు] ఉదాహరణ 1
- నడువకుమీ తెరువొక్కట
- గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
- ముడువకుమీ పరధనముల
- నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
[మార్చు] లక్షణములు
- పాదాలు: 4
- కందపద్యంలో అన్నీ నాలుగు మాత్రల గణాలే ఉంటాయి. గగ, భ, జ, స, నల ఇవీ ఆ గణాలు
- 1,3 పాదాలలో గణాల సంఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,3 పాదాలలో 1,3 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాలలో 2,4 గణాలు జ గణం కారాదు
- 2,4 పాదాల్లో మూడో గణం (యతికి ముందు వచ్చేది) జ కాని, నల కానీ అయి ఉండాలి
- 2,4 పాదాలలో చివరి అక్షరం గురువు. అంటే చివరి గణం గగ లేదా స అయి ఉండాలి
- పద్యం లఘువుతో మొదలైతే అన్ని పాదాలు లఘువుతో మొదలవ్వాలి. గురువుతో మొదలైతే అన్నీ గురువుతో మొదలుకావాలి
- యతి
- 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ నాలుగవ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి కుదరాలి
- ప్రాస
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
[మార్చు] ఉదాహరణ 2
- భూతలనాథుడు రాముడు
- ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
- ఘాతన్ భాగ్యోపేతన్
- సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్
పై పద్యానికి గణములు లెక్కిస్తే
భ గణము భ గణము భ గణము
గగ గణము గగ గణము జ గణము నల గణము స గణము
గగ గణము గగ గణము గగ గణము
గగ గణము స గణము నల గణము స గణము గగ గణము
భ గణము = UII { గురువు, లఘువు, లఘువు }
గగ గణము = UU { గురువు, గురువు }
జ గణము = IUI {లఘువు,గురువు, లఘువు }
నల గణము = IIII {లఘువు, లఘువు, లఘువు, లఘువు }
స గణము = IIU {లఘువు, లఘువు, గురువు}