ఔత్సాహిక శాస్త్రజ్ఞులు
వికీపీడియా నుండి
ఔత్సాహికులు (Amateurs) అనగా ఏదైనా రంగంలో విషయాన్ని 'ప్రధాన వృత్తి'గా కాక 'అదనపు ప్రవృత్తి'గా ఆచరించేవారు. ఇందుకు భిన్నంగా అదే వృత్తిగా స్వీకరించినవారిని 'ప్రొఫెషనల్స్'(Professionals) అంటారు. ఈ పదాలు అన్ని రంగాలకూ వర్తిస్తాయి. కాని ఫొటోగ్రఫీ, విజ్ఞానశాస్త్రం, రేడియో వంటి విషయాల్లో ఈ మాటను ఎక్కువగా వాడుతాము. ఇదే పదం ఆధారంగా ఒక విజ్ఞాన శాస్త్ర రంగంలో నూతనంగా ప్రవేశించిన, అంతగా అనుభవంలేని, కాని చాలా ఉత్సాహం కలిగిన వారిని ఔత్సాహిక శాస్త్రజ్ఞులు అనవచ్చును.
ఔత్సాహికులు అంటే ఎవరు? అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయా అభిప్రాయాలకు కొన్ని మినహాయింపులూ ఉంటాయి. [1]
- ఔత్సాహికులు ఒక రంగంలోకి క్రొత్తగా వచ్చి ఉంటారు. (కాని ఒక రంగంలో చాలా కాలం పనిచేసే ఔత్సాహికులు ఉంటారు)
- వారికి అంతగా అనుభవం, జ్ఞానం ఉండకపోవచ్చును. (ఇది కూడా అన్నిసందర్భాలలో నిజం కాదు. ప్రొఫెషనల్స్ కంటే నిష్ణాతులైన ఔత్సాహికులు ఉంటూ ఉంటారు.)
- వారి వద్ద పరికరాలు అంతంత మాత్రమే ఉంటాయి. (కాని కొందరు ఔత్సాహికులు ప్రొఫెషనల్స్ కంటే, పరొశోధనాశాలలకంటే మంచి పరికరాలు సాధిస్తారు)
కనుక ఒక రంగాన్ని ప్రధాన వృత్తిగా ఆచరించనివారిని ఔత్సాహికులు అనడం ఉచితం.
[మార్చు] ప్రముఖ ఔత్సాహిక ఖగోళ శాస్త్రజ్ఞులు
- జాన్ డాబ్సన్ యొక్క డాబ్సోనియన్ టెలీస్కోపు . ఈ టెక్నీక్ వల్ల పెద్ద పెద్ద టెలీస్కొపు ల నిర్మాణము ముందంజ వేసింది.
- విలియమ్ డి. ఫెర్రిస్ అనేక తోకచుక్కలను కనుగొనెను
- డేవిడ్ హెచ్. లేవి ఒక సహధ్యాయి తో పాటుషూమేకర్ లెవీ 9 నుగొనెను.
- లెస్లీ పెల్టీయె అనేక తోక చుక్కలను కనుగొనెను. వివిధ నక్షత్రాలను గమనించెను.
- ఐజాక్ రాబర్ట్స్ మొదటి సారి ఖగోళ శాస్త్రానికి ఫొటొగ్రాఫీ ని ఉపయోగించెను.
[మార్చు] మూలాలు
- ↑ ఇది ఎక్కడో చదివిన విషయం. కాని గుర్తులేదు. ఆధారాలు ఎవరైనా సమకూరిస్తే కృతజ్ఞతలు