ఎం.కరుణానిధి
వికీపీడియా నుండి
|
|
నియోజకవర్గము | చేపాక్ |
---|---|
|
|
జననం | జూన్ 3 1924 తిరుక్కువలై, తమిళనాడు |
రాజకీయ పార్టీ | డి.ఎం.కె |
సంతానము | 4 కొడుకులు, 2 కూతుళ్ళు |
నివాసము | చెన్నై |
As of మే 31, 2006 Source: Government of Tamil Nadu |
ఎం.కెగా మరియు డా.కళైనార్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి (తమిళం: மு.கருணாநிதி) M.K ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు[1] మరియు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.[2] కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు 2006-ప్రస్తుతం). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.[3] 2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి ఈ.వి.రామస్వామి నాయకర్ అనుయాయి.