ఆయుధం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఆయుధాలు (Weapons) ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.[1][2] ఇవే ఆయుధాలు మనల్ని మరియు ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న కత్తి నుండి క్లిష్టమైన రాకెట్ వరకు వివిధరకాలుగా ఉన్నాయి.
[మార్చు] ఆయుధాలలో రకాలు
- వ్యక్తిగత ఆయుధాలు: ఇవి ఎక్కువగా ఒక్కరు మాత్రమే ఉపయోగించగలిగేవి. కత్తి, తుపాకీ మొ.
- వాహనాలపై ఆయుధాలు: వివిధ రకాల వాహనాలు ఈ రకమైన ఆయుధాలు ఉపయోగించడానికి సహాయపడతాయి. ఉదా: కారు, విమానం, ఓడ, టాంకరు, మొ.
- జీవసంబంధ ఆయుధాలు: వివిధ రకాల వ్యాధికారక జీవులను ఆయుధాలుగా ఉపయోగించడం.
- రసాయన ఆయుధాలు: వివిధ రకాల రసాయన పదార్ధాలను విషప్రయోగం లేదా జీవక్రియల ద్వారా చంపడానికి ఉపయోగించడం.
- అణు ఆయుధాలు: రేడియో ధార్మిక పదార్ధాలను ఆయుధాలుగా ఉపయోగించడం.