See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ - వికీపీడియా

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ

వికీపీడియా నుండి

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర లో వివిధ యుగాలు, ఆయా సమయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర పూర్వయుగము క్రీ.పూ.1500 వరకు

  • క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది.
  • క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము - ఈ కాలంలో చిన్నన పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.
  • క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పసువులను పెంచేవారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు.
  • క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.
  • క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది.
(పై విభజనను ఇంకా సవరించవలసి ఉన్నది)

[మార్చు] పూర్వ యుగము క్రీ.పూ 2000 - క్రీ.పూ 500

  • క్రీ.పూ. 2,000 - 1,500 కాలం - ఇండో-యూరోపియన్ జాతులు వాయువ్య సరిహద్దులగుండా భారత ఉపఖండంలో ప్రవేశించారు.
  • క్రీ.పూ. 1,500 - 1,000 కాలం - ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులను గురించి మదటిసారిగా ప్రస్తావన
  • క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం. మొదటినుండీ ఆంధ్రదేశంలో విస్తరణ - ఉత్తర, దక్షిణ దేశాల మధ్య అధికమైన సంబంధం
  • క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
  • క్రీ.పూ. 500 - అపస్తంబ సూత్రాలు (గోదావరి ముఖద్వారంలో)
  • క్రీ.పూ. 700 - 300 ఉత్తరాన మగధ కేంద్రంగా మహా జనపదాల పాలన. నందవంశం ఇందులోదే - క్రీ.పూ.450 మహాపద్మనందుడు కళింగపై దండయాత్ర చేశాడు.

[మార్చు] మౌర్యకాలము క్రీ.పూ.322 - 184

  • క్రీ.పూ. 300 - మెగస్తనీసు చంద్రగుప్తుని ఆస్తానంలో ఉన్న యాత్రికుడు. ఆంధ్రుల గురించి ఇలా వ్రాశాడు - "ఆంధ్రులకు 30 నగర దుర్గాలు, 10 వేల పదాతి సైన్యం, 2వేల గుర్రపు దళం, వేయి ఏనుగులు ఉన్నాయి"
  • క్రీ.పూ. 310 - చంద్రగుప్తుని కాలంలో ఆంధ్ర దేశం మౌర్య సామ్రాజ్యంలో భాగమయ్యింది.
  • క్రీ.పూ. 272 - క్రీ.పూ.232 - అశోకుని పాలన. అశొకుని 13వ శిలాశాసనం ప్రకారం ఆంధ్రులు "రాజవిషయం"లో ఉన్నారు. అశోకుని ఎర్రగుడిపాడు శాసనం
  • క్రీ.పూ.255 - అశోకుని కళింగ దండయాత్ర
  • క్రీ.పూ.400 - 200 - బౌద్ధమతం ఆంధ్రదేశంలో అంతటా ఉచ్ఛదశలో ఉంది. ఆంధ్రుల ఏకీకరణకు మార్గం సానుకూలమయ్యంది.

[మార్చు] సాతవాహనులు - క్రీ.పూ.200 - క్రీ.శ.200

  • క్రీ.పూ. 221? 230? 271? - శాతవాహన రాజ్య స్థాపన
  • క్రీ.పూ. 185 - ఖారవేలుని హతీగుంఫ శాసనము
  • క్రీ.పూ. 208 - 198 - కన్హ
  • క్రీ.పూ. 197 - 179 - మొదటి శాతకర్ణి
  • క్రీ.పూ. 187 - మగధలో శుంగ వంశం స్థాపన (మౌర్య సామ్రాజ్యం అంతం)
  • క్రీ.పూ. 179 - 161 - పూర్ణోత్సుంగ
  • క్రీ.పూ. 152 - 98 - 2వ శాతకర్ణి
  • క్రీ.పూ. 58 - విక్రమ శకం ఆరంభం
  • క్రీ.పూ. 38 - 30 - కుంతల శాతకర్ణి. ఇతని కాలంలోనే గుణాఢ్యుడు బృహత్కధను రచించాడు.
  • క్రీ.పూ. 30 - 6 - 1వ పులొమావి.
  • క్రీ.శ. 19 - 24 - శాతవాహన హాలుడు - గాధాసప్తశతి
  • క్రీ.శ.78 - శాలివాహన శకం ఆరంభం
  • క్రీ.శ. 78 - 102 - గౌతమీపుత్ర శాతకర్ణి
  • క్రీ.శ. 100 - ఉత్తరాదిన కనిష్కుని రాజ్యం. అశ్వఘోషుడు మహాయాననం ప్రాంభించాడు.
  • క్రీ.శ. 130 వాసిష్ఠీపుత్ర పులొమావి
  • క్రీ.శ. 174 - 203 యజ్ఞశ్రీ శాతకర్ణి
  • క్రీ.శ. 200 - ఆచార్య నాగార్జునుడు - మహాయానం వికాసం.
  • క్రీ.శ. 218? - శాతవాహన రాజ్య పతనం

[మార్చు] కళింగులు

మాఠరులు
  • 400 - 435 : శంకరవర్మ, శక్తివర్మ, ప్రభంజనవర్మ, అనంతశక్తివర్మ - పిష్ఠపురం రాజధానిగా
వాసిష్ఠులు
  • వీరి రాజధాని దేవపురి (శృంగవరపుకోట వద్ద దేవాడ)
  • 300 - 375 : గుణవర్మ
  • 375 - 400 : మహారాజప్రభంజనవర్మ
  • 400 - 450 : అనంతవర్మ
ఇతరులు
  • 500? : పృథ్వీమూల మహారాజు(వంశం తెలియదు). తండ్రి ప్రభాకర మహారాజు. తాత మూలమహారాజు. వీరి రాజధాని గుణపాశపురం (రాజోలు వద్ద అదుర్రు) - గోదావరినుండి కొండవీటివరకు వరి రాజ్యం ఉండవచ్చును
కళింగ గంగులు
  • 490 - 500 : ఇంద్రవర్మ. కళింగ గంగుల పాలన ఆరంభం. రాజధాని దంతపురం (శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపైనున్న దంతవక్తృనికోట)
  • 560 : మహాసామంతవర్మ - "జయశ్రీనివాసుడు" -
  • 576 : హస్తివర్మ - "రణభీత"
  • 553-570 : రెండవ ఇంద్రవర్మ - రా్ధానిని దంతపురం నుండి కళింగనగరానికి (ముఖలింగం) మార్చాడు.
  • తరువాత అంతఃకలహాలు. క్రమంగా చాళుక్యులు కళింగదేశాన్ని ఆక్రమించారు.

[మార్చు] ఇక్ష్వాకులు 210 - 260? - 300?

  • క్రీ.శ. 225 - శాతవాహనుల పతనం - ఇక్ష్వాకుల విజృంభణ - శ్రీపర్వతం (విజయపురి, నాగార్జునకొండ) రాజధానిగా
  • 225 - 245 : శ్రీఛాంతమూల
  • 245 - 265 : వీరపురుషదత్త
  • 265 - 290 : ఎహువల ఛాంతమూల
  • 290 -300 : రుద్రపురుషదత్త
  • 300 : పల్లవుల (సింహవర్మ) ఆక్రమణతో ఇక్ష్వాకుల పాలన అంతం.
  • ఈ కాలంలో వైదిక మతానికి ప్రాధాన్యత పెరిగింది. కాని బౌద్ధం కూడా ఉచ్ఛదశలో ఉంది. ప్రాకృతం వాడుక మెల్లగా తగ్గుముఖం పట్టింది.

[మార్చు] బృహత్పలాయనులు 300 - 350?

  • 300 - 325 :కృష్ణానది ఉత్తరాన బృహత్పలాయనుల పాలన - రాజధాని "కూడూరా". మనకు తెలిసిన ఒకేఒకరాజు జయవర్మ.
  • కృష్ణానది దక్షిణాన పల్లవుల రాజ్యం ఉంది
  • ఈ కాలంలో బౌద్ధమతం క్షీణదశలో ఉంది. వైదికమతం విజృంభించసాగింది.

[మార్చు] అనందగోత్రులు 295 - 620

[మార్చు] శాలంకాయనులు 320 - 420

  • వీరి రాజధాని వేంగి.
  • 320 : హస్తివర్మ రాజ్య స్థాపన
  • 345 : సముద్రగుప్తుని దక్షిణదేశ దండయాత్ర
  • 350 - 385 : నందివర్మ
  • 400 - 420 : ఆచండవర్మ
  • 420 - 450? - విజయనందివర్మ

[మార్చు] విష్ణుకుండినులు 375 - 555 (440 - 623?)

  • విష్ణుకుండినుల రాజధాని అమరపురి లేదా ఇంద్రపాలనగరం. (సత్తెనపల్లి తాలూకా వేల్పూరు)
  • 375 - 400 : ఇంద్రవర్మ
  • 400 - 425 : విక్రమహేంద్రవర్మ
  • 425 - 465 : గోవిందవర్మ
  • 465 - 515 : 1వ మాధవ వర్మ - అందరిలో ముఖ్యుడు. రాజ్యాన్ని విస్తరింపజేశాడు. పల్లవులతో యుద్ధం తరువాత తన రాజధానిని వేంగి సమీపంలోని దెందులూరుకు మార్చాడు.
  • 515 - 525 : విక్రమేంద్రవర్మ
  • 525 - 555 : ఇంద్రవర్మ, విక్రమేంద్ర భట్టారక వర్మ
  • 574 - 623 : మాధవ వర్మ
  •  ? : మంచన్న భట్టారక
రణదుర్జయులు
  • రణదుర్జయుడు విష్ణుకుండి మాధవవర్మ సమకాలికుడు.

[మార్చు] పల్లవులు 260 - 400 - 550

  • 280 - 310 : సింహవర్మ
  • 310 - 335 : శివస్కందవర్మ
  • 335 - 350 : విష్ణుగోప
  • 350 - 370 : కుమారవిష్ణు
  • 370 - 385 : 2వ స్కందవర్మ
  • 385 - 400 : వీరవర్మ
  • 400 - 436 : 3వ విజయస్కందవర్మ (పాలక్కడ)
పాలక్కడ శాఖ
  • 430? - 550? యువ మహారాజు విష్ణుగోప, సింహవర్మ, విష్ణుగోప
  • 550 - 570 : సింహవర్మ
  • 570 - 600 : సింహవిష్ణు
  • 600 - 630 : మహేంద్రవర్మ
కాంచీపురి శాఖ
  • 435 - 480 : 2వ సింహవర్మ
  • 480 - 490 : 4వ స్కందవర్మ
  • 495 - 500 : నందివర్మ
  • 500 - 520 : 2వ కుమార విష్ణు
  • 520 - 530 : బుద్ధవర్మ
  • 530 - 550 : 3వ కుమార విష్ణు

[మార్చు] పూర్వమధ్య యుగము

[మార్చు] మహాపల్లవులు

[మార్చు] రేనాటి చో(డు)ళులు

[మార్చు] చాళుక్యులు

[మార్చు] రాష్ట్రకూటులు

[మార్చు] తూర్పు చాళుక్యులు 624 - 1076

  • 624 - తూర్పు చాళుక్యుల వేంగి రాజ్యం ఆరంభం
  • 624 - 641 : కుబ్జ విష్ణువర్ధనుడు
  • 636 : చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్ (యువాన్ చువాంగ్) ఆంధ్ర దేశం పర్యటన - వేంగి, ధరణకోట, శ్రీశైలం అతని వర్ణనలలో ఉన్నాయి.
  • 641 - 673 : జయసింహుడు
  • 675 - 682 : 2వ విష్ణువర్ధనుడు
  • 682 - 706 : మంగి యువరాజు
  • 706 - 718 : 2వ జయసింహుడు
  • 718 - 755 (775?) : 3వ విష్ణువర్ధనుడు
  • 755- 772 : విజయాదిత్య భట్టారకుడు
  • 772 - 807 : 4వ విష్ణువర్ధనుడు
  • 807 - 846 : నరేంద్ర మృగరాజు (2వ విజయాదిత్యుడు)
  • 834 - 836 : రాష్ట్రకూటులతోను, గంగులతోను యుద్ధాలు - (108 యుద్ధాలలో విజయం సాధించి 108 శివాలయాలు నిర్మించాడట?)
  • 848 - 848 : కలివిష్ణువర్ధనుడు
  • 848 - 892 : గుణగ విజయాదిత్యుడు
  • 892 - 921 : చాళుక్య భీముడు
  • 921 - 921 : 4వ విజయాదిత్యుడు
  • 921 - 927 : అమ్మరాజు
  • 927 : బేత విజయాదిత్యుడు
  • 928 - 934 : యుద్ధమల్లుడు చాళుక్యలనుండి బెజవాడ ప్రాంతాన్ని ఆక్రమించాడు
  • 934 - 945 : 2వ చాళుక్య భీముడు యుద్ధమల్లుడిని జయించాడు
  • 972 - 973 : పశ్చిమాంధ్రలో రాష్ట్రకూటుల పతనం. బాదామి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని వశం చేసుకొన్నారు.
  • 972 - 999 : ఈ సమయంలో తూర్పు చాళుక్యులు, దక్షిణాదినుండి వచ్చిన చోళులు కలిసిపోయారు. వారిని చాళుక్యచోళులు అంటారు. పశ్చిమ చాళుక్యులకు, చాళుక్యచోళులకు యుద్ధాలు ఆరంభమయ్యాయి. వేంగి దేశం క్రమంగా బలహీనపడింది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర (కళింగ) ప్రాంతం గంగుల పాలనలోనే ఉంది.

[మార్చు] పూర్వగాంగులు 498 - 894

  • తూర్పు చాళుక్యుల రాజ్యం కృష్ణా, గోదావరి ప్రాంతాలకే పరిమితమైంది. ఉత్తరాదిన కళింగ రాజ్యం గంగుల పాలనలో ఉంది.
  • 498 - 624 : (వివరాలు తెలియడంలేదు)
  • 624 - : 3వ ఇంద్రవర్మ (దానార్ణవుని కొడుకు)
  • 681? - దేవేంద్రవర్మ (గుణార్ణవుని కొడుకు)
  • 749 ? : దేవేంద్రవర్మ (అనంతవర్మ కొడుకు)
  • 895 : పూర్వ గాంగుల ప్రస్తావన లేదు.
  • 895 - 995 : వివరాలు లభించడం లేదు
  • 995 తరువాత వచ్చిన పాలకులు కూడా గంగ వంశానికి చెందిన వారమనే చెప్పుకొన్నారు కాని, వారికి, పూర్వగాంగులకు ఉన్న సంబంధాలు తెలియడంలేదు. బహుశా పూర్వ గాంగులను జయించిన క్రొత్త వంశం కావచ్చును.

[మార్చు] చాళుక్య చోళులు 980 - 1076

  • 985 : రాజరాజచోళుడు చోళసింహాసనాన్ని అధిష్టించాడు.
  • 998 - 999 : వేంగి వ్యవహారాలలో రాజరాజచోళుడి జోక్యం అధికమయ్యింది. అంతఃకలహాలలో తమకు అనుకూలమైనవారికి రాజ్యం లభించేట్లు చేశాడు. తన కుమార్తెను విమలాదిత్యుడికిచ్చి పెళ్ళి చేశాడు.
  • 1000 - 1018 : శక్తివర్మ, విమలాదిత్యుడు, రాజాధిరాజు
  • 1006 : (పశ్చిమ)చాళుక్య రాజు సత్యాశ్రయునికి చోళులతో పోరు. తూర్పు చాళుక్యులు (చాళుక్యచోళులు) మధ్యలో ఇరుక్కున్నారు.
  • 1022 : రాజరాజనరేంద్రుని పట్టాభిషేకం. ఈ రాజరాజనరేంద్రుడు కవిపోషకుడు. ఇతని భార్య అమ్మంగిదేవి. నన్నయ ఇతని ఆస్థానంలో ఉన్నాడు. ("సారంగధర"నాటకం ద్వారా ప్రసిద్ధుడైన రాజరాజు వేరు. అతను నర్మదా తీరంలో రాజు. అతని భార్యలు రత్నాంగి, చిత్రాంగి. ఈ కధ బమ్మెరపోతన కొడుకు కేసన్న వ్రాసిన నవనాధచరిత్రలో ఉంది. అయితే ఆ రాజు ఈ రాజు ఒకరేననే అభిప్రాయం తెలుగునాట బహుళంగా ఉంది.[1])
  • 1031 : రాజరాజనరేంద్రునిపై దాయాది విజయాదిత్యుని తిరుగుబాటు. వారి అణచివేత.
  • 1060 :చోళులకు, (పశ్చిమ)చాళుక్యులకు యుద్ధాలు
  • 1061 : ఉత్తరాన్నుండి వస్తున్న అవరోధాలను ఎదుర్కోవడానికి రాజరాజు రాజమహేంద్రవరం నుండి పాలించాడు. విజయాదిత్యుడు అదను చూసుకొని ఇతరరాజుల సాయంతో వేంగి సింహాసనం ఆక్రమించాడు.
  • 1068 : రాజరాజు తన చోళ బంధువుల సహాయంతో బెజవాడ వద్ద జరిగిన యుద్ధంలో విజయాదిత్యుని జయించి క్షమించాడు.
  • 1068 -1070 : రాజాధిరాజు, వీరరాజేంద్ర, అధిరాజేంద్ర
  • 1070 : తిరుగుబాటులో అధిరాజేంద్రుని మరణం. చాళుక్యచోళుల పాలన అంతం
  • 1076 : విజయాదిత్యుడి మరణం. కులోత్తుంగ చోళుడు వేంగి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని తెలుగు, తమిళ దేశాలకు అధిపతి అయ్యాడు.

[మార్చు] కాకతీయులు

[మార్చు] అర్వాచీన గాంగులు

[మార్చు] ఉత్తరమధ్య యుగము

[మార్చు] ముసునూరి నాయకులు

[మార్చు] ఓఢ్ర గజపతులు

[మార్చు] రేచెర్ల వెలమలు

[మార్చు] కొండవీటి రాజ్యము

[మార్చు] రాజమహేంద్రవర రాజ్యము

[మార్చు] బహమనీ రాజ్యము

[మార్చు] విజయనగర సామ్రాజ్యము

[మార్చు] ఆధునిక యుగము

[మార్చు] అరవీటి వంశము

[మార్చు] గోలకొండ రాజ్యము

[మార్చు] నిజాము రాజ్యము

[మార్చు] బ్రిటిషు రాజ్యము

[మార్చు] స్వాతంత్ర్యోద్యమము

[మార్చు] ఆంధ్రోద్యమములు

[మార్చు] విశాలాంధ్ర

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. Andhra Chronolgy - Sir V.rAmesam

[మార్చు] వనరులు

  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • Sir V Ramesam (retired Judge of Madras High Court)- Andra Chronology (90-1800 A.C.) - Published 1946 - Andra Chronology


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -


aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -