అనుమానాస్పదం
వికీపీడియా నుండి
అనుమానాస్పదం (2007) | |
దర్శకత్వం | వంశీ |
---|---|
నిర్మాణం | సతీష్ తాటి,జై ఆర్నాల |
రచన | ఆకెళ్ళ వంశీకృష్ణ |
తారాగణం | ఆర్యన్ రాజేష్, హంసా నందిని, వనితా రెడ్డి, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌రెడ్డి, జీవా, సుభాష్, మూలవిరాట్, దేవీచరణ్, బి.వి.చంద్రశేఖర్ |
సంగీతం | ఇళయరాజా |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి |
ఛాయాగ్రహణం | పీ.జి. విందా |
నిర్మాణ సంస్థ | ఇ.ఎ.పి.టి. |
భాష | తెలుగు |
[మార్చు] కధాగమనం
"విఠల్ దాసు అనే వ్యక్తికి నిత్యమంగళం అడవుల్లో వీరప్పన్ దాచిన నిధి గురించి తెలుస్తుంది. అతడు కొంతమందికి డబ్బు ఇచ్చి ఆ నిధిని వెతికేందుకు పంపిస్తాడు. వారిలో బాసు అనబడే బావరాజు సూర్యనారాయణ{ఆర్యన్ రాజేష్}, ఒక లేడీ డాక్టర్ {హంసానందిని}, ఒక మాజీ ఫారెస్టు ఆఫీసర్ తంగవేలు {జయప్రకాష్ రెడ్డి}, బాంబులు డిటెక్ట్ చేసే వ్యక్తి, బాంబులను నిర్వీర్యం చేసేందుకు కామిని అనే ఆమె, వేస్ట్ అని పిలువబడే వంట వాడు, రాబర్ట్ అనే వ్యక్తి, రాజు అనే డ్రైవర్ ఉంటారు. వీళ్ళంతా నిత్యమంగళం అడవికి చేరే దారిలో వీరప్పన్లా మీసాలు పెంచిన వ్యక్తి లిఫ్ట్ అడుగుతాడు. ప్రయాణంలో వీరప్పన్ చావలేదనీ బ్రతికే ఉన్నాడనీ అతడు వీళ్ళకు చెపుతాడు. ఎలాగోలా తిప్పలు పడి మొత్తానికి నిధిని సాదించి వెనుకకు బయలుదేరుతారు. తిరుగు ప్రయాణంలో ఒక్కొక్కరుగా అందరూ చనిపోతుంటారు. వీరప్పనే అందరినీ చంపుతున్నాడని అనుకుంటుంటారు. చివరకు బాసు, లేడీ డాక్టర్, కామిని మిగులుతారు. తమ వాళ్ళను చంపిన వ్యక్తి బాసుకు దొరుకుతాడు వాళ్ళిద్దరూ కొట్టుకొనే సమయంలో కామిని వాడిని చంపేస్తుంది. హంతకుడిని చంపేసాని ఆనందపడుతుంటె కామినిని చంపేస్తారెవరో. తరువాత బాసును డాక్టరును చంపేందుకు వచ్చిన వాడిని పట్టుకొంటాడు బాసు. అప్పుడే తెలుస్తుంది వాడు వాళ్ళ గ్రూపులో మొదటగా హతమైన రాబర్ట్ అని. కామినిని ప్రేమించి అందరినీ చంపి డబ్బుతో పారిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. వాడిని చంపి డాక్టరుతో బాసు వెనుకకు వచ్చేస్తాడు.
[మార్చు] విశేషాలు
వంశీ సినిమాల్లో కనిపించే బిగువు ఈ సినిమాలో కనిపించక పోవడంతో సినిమా ఆర్ధికంగా పెద్ద విజయం సాదించలేక పోయింది. చాలా కాలనికి వంశీ ఇళయరాజాల కాంబినేషనులో వచ్చిన పాటలు బాగున్నాయి. నేపద్య సంగీతం సినిమాకు ఒక ఎసెట్.