రోహన్ కన్హాయ్
వికీపీడియా నుండి
1935, డిసెంబర్ 26 నాడు జన్మించిన రోహన్ కన్హాయ్ (Rohan Bholalall Kanhai) వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1950 దశకం చివరిలో ప్రవేశించి 1960 దశబ్దంలోను, 1970 దశాబ్దపు తొలి భాగంలోను అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహించాడు.భారతసంతతికి చెందిన వెస్ట్‌ఇండీస్ క్రికెట్ ఆటగాళ్ళలో ప్రముఖుడు. వెస్ట్‌ఇండీస్ తరఫున దొగ్గజాలైన గార్‌ఫీల్డ్ సోబర్స్, రాయ్ ఫ్రెడరిక్, లాన్స్ గిబ్స్, కాళీచరణ్ మొదలగు క్రికెటర్లతో కల్సి జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. 1957లో ఇంగ్లాండుపై తన టెస్ట్ జీవితాన్ని ఆరంగేట్రం చేసినాడు. మొత్తం 79 టెస్టులు ఆడి 47.53 సగటుతో 6227 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు 28 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 256 పరుగులు. దీన్ని భారత్ పై కోల్‌కతలో సాధించాడు.
వన్డేలలో అతను 7 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 164 పరుగులు చేసినాడు. 1975లో జరిగిన తొలి ప్రపంచ కప్ పోటీలలో కూడా అతను ప్రాతినిధ్యం వహించాడు.
భారత ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన కుమారుడికి రోహన్ కహాయ్ పేరు మీదుగా రోహన్ గవాస్కర్ అని పేరు పెట్టాడు [1].
[మార్చు] మూలాలు
- ↑ "Famous son steps out of shade" by Scott Heinrich, BBC Sport website, 18 January, 2004, retrieved 2 December, 2005.
|
|
---|---|
క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · కీత్ బోయిస్ · రాయ్ ఫ్రెడరిక్ · లాన్స్ గిబ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · వాన్బర్న్ హోల్డర్ · బెర్నార్డ్ జూలియెన్ · ఆల్విన్ కాళీచరణ్ · రోహన్ కన్హాయ్ · డెరిక్ ముర్రే (వికెట్ కీపర్) · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |