వికీపీడియా నుండి
1951, జనవరి 29 న జన్మించిన ఆండీ రాబర్ట్స్ (Anderson Montgomery Everton 'Andy' Roberts) వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఫాస్ట్ బౌలర్ అయిన ఇతడు ఒకే టెస్ట్ ఇన్నింగ్సులో 7 వికెట్లను రెండు సార్లు సాధించాడు. 970 దశకం రెండో భాగం నుంచి 1980 దశకం తొలి భాగం వరకు వెస్ట్‌ఇండీస్ కు ప్రాతినిద్యం వహించిన ప్రముఖ చతుర్దయంలో ఇతడు ఒకడు. మిగితా ముగ్గురు మైకెల్ హోల్డింగ్, జోయెల్ గార్నర్ మరియు కొలిన్ క్రాఫ్ట్. వెస్ట్‌ఇండీస్ విజయం సాధించిన 1975 మరియు 1979 ప్రపంచ కప్ క్రికెట్‌కు ఇతడు ప్రాతినిద్యం వహించాడు. ఫైనల్లో భారత్ చేతిలో భంగపడిన 1983 ప్రపంచ కప్‌లో కూడ ఆడినాడు.
రాబర్ట్స్ 47 టెస్టులు ఆడి 202 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 11 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను 2 సార్లు సాధించాడు. టెస్టులలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 54 పరుగులకు 7 వికెట్లు. వన్డేలలో 56 మ్యాచ్‌లు ఆడి 87 వికెట్లు పడగొట్టినాడు. వన్డేలలో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.