వికీపీడియా నుండి
పక్షులు
శిలాజ విస్తృతి: జురాసిక్ యుగం ఆఖరు - ప్రస్తుతము
|
Superb Fairy-wren, Malurus cyaneus, juvenile
|
శాస్త్రీయ వర్గీకరణ |
|
|
Orders
|
సుమారు రెండు డజన్లు - క్రింద విభాగముచూడండి.
|
పక్షులు (Birds) రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (Ornithology) అంటారు.
[మార్చు] సామాన్య లక్షణాలు
- పక్షులు అంతరోష్ణ లేదా ఉష్ణ రక్త జీవులు.
- ఎగరడానికి అనుకూలంగా ఉండడానికి దేహం సాధారణంగా కదురు ఆకారంలో ఉండి కుదించినట్లు అమరి ఉంటుంది. వాయుగోణులు ఉండటం వల్ల తేలికగా ఉంటుంది. పూర్వాంగాలు రెక్కలుగా మార్పుచెంది ఉంటాయి. చరమాంగాలు పెద్దవిగా ఉండి జీవి దేహం బరువును మోయడానికి తోడ్పడతాయి. ఆహార సంగ్రహణ, ఈదడం, చెట్టు కొమ్మలను పట్టుకోవడం మొదలయిన వాటికి చరమాంగాలు ఉపయోగపడతాయి.
External anatomy of a bird: 1 Beak, 2 Head, 3 Iris, 4 Pupil, 5 Mantle, 6 Lesser coverts, 7 Scapulars, 8 Median coverts, 9 Tertials, 10 Rump, 11 Primaries, 12 Vent, 13 Thigh, 14 Tibio-tarsal articulation, 15 Tarsus, 16 Feet, 17 Tibia, 18 Belly, 19 Flanks, 20 Breast, 21 Throat, 22 Wattle
- శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. ఇవి బాహ్య అస్థిపంజరంలో భాగంగా ఉంటాయి. ఇవి నాలుగు రకాలు. అవి: 1.కాటోర్ ఈకలు, 2. పైలోప్లూమ్ లు, 3. క్విల్ ఈకలు, 4. డేన్ ఈకలు.
- వీటిలో ఒకే ఒక గ్రంధి (తైల గ్రంధి లేదా ప్రీన్ గ్రంధి) తోకపై ఉంటుంది. ఇది క్విల్ ఈకలపై మైనపు పూతను ఏర్పరుస్తాయి.
- పక్షుల అస్థిపంజరంలోని ఎముకలు వాతలాస్థులు. అస్థి మజ్జ ఉండదు. మోనో కాండైలిక్ కపాలం ఉంటుంది. విషమ గర్తి కశేరుకాలు ఉంటాయి. పర్శుకలు ద్విశిరోభాగంతో ఉంటాయి. కొన్ని కశేరుకాలు కలియడం వల్ల సంయుక్త త్రికం (Synsacrum) ఏర్పడుతుంది. ఉరోస్థి ఉదర మధ్య భాగంలో కెరైనా ఉండి ఉడ్డయక కండరాలు అతుక్కోవడానికి తోడ్పడుతుంది. అంసఫలకం (Scapula) పట్టాకత్తి ఆకారపు ఎముక. జత్రుకలు రెండూ కలిసి ఫర్కులా లేదా విష్ బోన్ ఏర్పడుతుంది.
- కండర వ్యవస్థ వైహాయన జీవనానికి అనుకూలంగా రూపాంతరం చెందింది. రెక్కల విధినిర్వహణలో తోడ్పడే కండరాలను ఉడ్డయక కండరాలు (Flight muscles) అంటారు.
- ఆహారవాహిక అన్నాశయంగా విస్తరించి ఆహార పదార్ధాల నిల్వకు తోడ్పడుతుంది.
- నాలుగు గదుల గుండె ఉంటుంది. సిరాసరణి, మూలమహాధమనులు ఉండవు. కుడి దైహిక చాపం ఉంటుంది.
- ఊపిరితిత్తులు స్పంజికాయుతంగా ఉంటాయి. ఇవి 9 వాయుగోణులను కలిగి ఉంటాయి. పక్షులలో స్వరపేటిక వల్ల కాక ఉబ్బిన వాయునాళం ప్రాధమిక శ్వాసనాళికలకు మధ్య గల శబ్దిని (Syrynx) ద్వారా శబ్దం ఉత్పత్తి అవుతుంది.
- మూత్రపిండాలు అంత్యవృక్కాలు. మూడు లంబికలను కలిగి ఉంటాయి. మూత్రాశయం ఉండదు. యూరిక్ ఆమ్లం విసర్జక పదార్ధం.
[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత
- పక్షులు మానవులకు ముఖ్యమైన ఆహారము. వీటిలో ముఖ్యమైనవి కోడి మరియు కోడి గుడ్లు. ఇవే కాకుండా బాతు, టర్కీ కోడి, ఈము మొదలైన పక్షుల మాంసం కూడా తినబడేవి. పురాతన కాలంలో పక్షుల్ని వేటాడేవారు,[1] దీనిమూలంగా కొన్ని పక్షి జాతులు అంతరించిపోయాయి.[2]
- పక్షుల ఈకలు దుస్తులు, పరుపులు తయారుచేయడంలో, కొన్ని రకాల ఎరువుల తయారీలో ఉపయోగపడతాయి.
- చిలుక, మైనా మొదలైన రంగురంగుల అందమైన పక్షులను పెంచుకుంటారు. ఈ రకమైన వ్యాపారం కోసం కొన్ని అరుదైన పక్షులు స్మగ్లింగ్ చేయబడి అంతరించిపోయాయి.[3]
- కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడానికి ఉపయోగించారు. పావురాలను వార్తాహరులుగా 1వ శతాబ్దంలో ఉపయోగించేవారు. కొన్ని రకాల పక్షులను వేటకోసం, చేపల్ని పట్టడానికి వాడేవారు.[4]
- జంతువులలో ప్రయోగాల కోసం ఎకువగా కోళ్ళు, పావురాలను ఉపయోగిస్తారు. ఇవి ముఖ్యంగా జీవ శాస్త్రం, మానసిక శాస్త్రంలో వాడతారు.
- ఉపవిభాగం 1: ఆర్కియార్నిథిస్ ఉ. ఆర్కియోప్టెరిక్స్
- ఉపవిభాగం 2: నియార్నిథిస్
- అధిక్రమం 1: ఒడంటేనేతే ఉ. ఇక్తియార్నిస్
- అధిక్రమం 2: పేలియోనేతే ఉ. ఈము, నిప్పుకోడి, కివి
- అధిక్రమం 3: ఇంపిన్నే ఉ. పెంగ్విన్
- అధిక్రమం 4: నియోగ్నేతే లేదా కారినేటే
- Anseriformes, బాతు, హంస
- Galliformes, కోడి, గిన్నికోడి, నెమలి, టర్కీ
- Gaviiformes, loons
- Podicipediformes, grebes
- Procellariiformes, albatrosses, petrels, and allies
- Sphenisciformes, పెంగ్విన్
- Pelecaniformes, పెలికాన్ and allies
- Ciconiiformes, storks and allies
- Phoenicopteriformes, flamingos
- Falconiformes, falcons, గద్ద, hawks and allies
- Gruiformes, కొంగలు and allies
- Charadriiformes, gulls, button-quail, plovers and allies
- Pteroclidiformes, sandgrouse
- Columbiformes, పావురాలు
- Psittaciformes, చిలుకలు, ప్రేమ పక్షులు
- Cuculiformes, కోకిల, turacos, hoatzin
- Strigiformes, గుడ్లగూబ
- Caprimulgiformes, nightjars and allies
- Apodiformes, swifts and hummingbirds
- Coraciiformes, లకుముకి
- Piciformes, వడ్రంగి పిట్ట and allies
- Trogoniformes, trogons
- Coliiformes, mousebirds
- Passeriformes, పిచ్చుక, కాకి, పాలపిట్ట, మైనా