జిమ్మీ ఆడమ్స్
వికీపీడియా నుండి
జిమ్మీ ఆడమ్స్ | ||||
బొమ్మ:Cricket no pic.png |
||||
West Indies | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | ఎడమచేతి బ్యాట్స్‌మన్ | |||
బౌలింగ్ శైలి | స్లో లెఫ్ట్ ఆర్మ్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 54 | 127 | ||
పరుగులు | 3012 | 2204 | ||
బ్యాటింగ్ సగటు | 41.26 | 28.62 | ||
100లు/50లు | 6/14 | 0/14 | ||
అత్యుత్తమ స్కోరు | 208* | 82 | ||
Overs | 475 | 309 | ||
Wickets | 27 | 43 | ||
Bowling average | 49.48 | 34.86 | ||
5 wickets in innings | 1 | 1 | ||
10 wickets in match | 0 | n/a | ||
Best bowling | 5/17 | 5/37 | ||
Catches/stumpings | 48/- | 68/5 | ||
1968, జనవరి 9న జన్మించిన జిమ్మీ ఆడమ్స్ (James Clive Jimmy Adams) వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు కెప్టెన్. ఎడమచేతి బ్యాటింగ్ మరియు ఎడమచేతితో బౌలింగ్ చేయగల ఆడమ్స్ మంచి ఫీల్డర్ కూడా.ఆవసమైనప్పుడు వికెట్ కీపర్ విధులను కూడా నిర్వర్తించాడు. 1992లో దక్షిణాఫ్రికాపై బ్రిడ్జిటౌన్ లో తొలి టెస్ట్ ఆడినాడు.
విషయ సూచిక |
[మార్చు] టెస్ట్ క్రికెట్
ఆడమ్స్ టెస్టులలో ఆరంగేట్రం చేసిన వెంటనే తన ప్రతిభను చూపడం ప్రారంభించాడు. తన తొలి 12 టెస్టులలోనే 87 సగటుతో 1132 పరుగులు సాధించాడు. ఇలాంటి రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డొనాల్డ్ బ్రాడ్‌మెన్ కు తప్ప ఎవరికీ లేకపోవడం విశేషం. 1995లో ఇంగ్లాండు పర్యటనలో గాయపడటంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. 2000లో బ్రియాన్ లారా నుంచి వెస్ట్‌ఇండీస్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. స్వయంగా జట్టులో స్థానం కోసం పోరాడుతున్న సమయంలో కెప్టెన్‌గా కూడా బాద్యతలు చేపట్టడంతో దేనికీ న్యాయం చేయలేకపోయాడు. ఆస్ట్రేలియాతో సీరీస్ 5-0 తేడాతో చిత్తుగా ఓడి కెప్టెన్‌గానే కాకుండా తాను స్వయంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తరువాత కార్ల్ హూపర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
1992 నుంచి 2001 వరకు మొత్తం 54 టెస్టులు ఆడి 41.26 సగటుతో 3012 పరుగులు సాధించాడు. అందులో 6 సెంచరీలు మరియు 14 అర్థసెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్‌లో అతడి అత్యధిక స్కోరు 208 (నాటౌట్). టెస్టులలో 27 వికెట్లు కూడా సాధించాడు.
[మార్చు] వన్డే క్రికెట్
1992లో పాకిస్తాన్ పై తొలి వన్డే ఆడినప్పటి నుంచి 2001లో ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ లో చివరి వన్డే ఆడే వరకు మొత్తం 127 మ్యాచ్‌లలో 28.62 సగటుతో 2204 పరుగులు సాధించాడు. అందులో 14 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు ఆస్ట్రేలియాపై సాధించిన 82 పరుగులు. వన్డేలలో 43 వికెట్లు కూడా సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ పాకిస్తాన్ పై అడిలైడ్ లో సాధించిన 37 పరుగులకు 5 వికెట్లు.
[మార్చు] జట్టు కెప్టెన్‌గా
జిమ్మీ ఆడమ్స్ 15 టెస్టులకు నాయకత్వం వహించాడు. అందులో నాలిగింటిలో విజయం సాధించగా, 8 టెస్టులలో పరాజయం పొందినాడు. మిగితా 3 టెస్టులు డ్రాగా ముగిసాయి. వన్డేలలో 26 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి పదింటిని గెలిపించగా, 14 వన్డేలలో పరాజయం లభించింది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు.
[మార్చు] ప్రపంచ కప్ క్రికెట్
జిమ్మీ ఆడమ్స్ 1996 మరియు 1999 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో వెస్ట్‌ఇండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
[మార్చు] బయటి లింకులు
- Cricinfo player profile of Jimmy Adams
- Jimmy Adams Management
- HowSTAT! statistical profile of Jimmy Adams
|
|
---|---|
బ్రియాన్ లారా (కెప్టెన్) · జిమ్మీ ఆడమ్స్ · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · హెండర్సన్ బ్రియాన్ · షెర్వింగ్ కాంప్‌బెల్ · చందర్‌పాల్ · మెర్విన్ డిల్లాన్ · రిడ్లీ జాకబ్స్ · రియాన్ కింగ్ · నెహెమై పెర్రీ · రికార్డో పోవెల్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ · స్టూవర్ట్ విలయమ్స్ |