కారు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కారు అనే పదం మోటార్ కార్కు వాడుకపదం. కారునే ఆటోమొబైల్ అని కూడా అంటారు. ఆటోమొబైల్ అనే పదానికి అర్థం తనకుతానుగా కదిలే వాహనం అని. ఈ పదానికి మూలాలు గ్రీకు భాషలోని ఆటో (తనకుతాను) మరియు లాటిన్ భాషలోని మొబిలిస్ (కదులుట) అనే రెండు పదాలతో ముడిపడి ఉన్నాయి. కారు మోటారుతో నడిచే చక్రాలు కలిగిన వాహనం. నిర్వచనాల ప్రకారం ఆటోమొబైల్లు ఒకటి నుండి ఎనిమిది మంది కూర్చొనడానికి వీలుగా ఉండి 4 చక్రాల సహాయంతో మానవుల రవాణాకు మాత్రమే ఉపయోగపడే ఒక వాహనం. [1] కాని, చాలా రకాల వాహనాలు చాలా పనులకొరకు ఉపయోగించబడుతున్నాయి, కనుక ఆటోమొబైల్‌కు పై నిర్వచనం కొన్ని సార్లు వర్తించకపోవచ్చు.
2002 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 590 మిలియన్ పాసింజర్ కార్లు (అనగా ప్రతీ 11 మందిలో ఒక కారు) ఉన్నాయి.[2]
[మార్చు] చరిత్ర
- ప్రధాన వ్యాసం: ఆటోమొబైల్ చరిత్ర
1769లో మొట్టమొదటి తనకుతాను నడిచే వాహనాన్ని కనుగొన్నట్టుగా నికోలస్-జోసెఫ్ కగ్నాట్‌ను పేర్కొంటారు, కాని కొంతమంది ఈయన తయారు చేసిన మూడు చక్రాల వాహనం అసలు నడవలేదని చెప్తారు. మరికొంతమంది ఫెర్డినాడ్ వెర్బీస్ట్ అనే ఆయన ఆవిరితో నడిచే కారును 1672 లో కనుగొన్నట్టు చెప్తారు.[3][4] ఏదేమైనా గాని స్విస్ దేశానికి చెందిన ఫ్రంకోయిస్ ఐసాక్ డె రివాజ్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల మిశ్రమంతో నడిచే మొట్టమొదటి 'ఇంటర్నల్ కంబషన్ ఇంజన్' కలిగిన వాహనాన్ని రూపొందించాడు. కాని ఆ డిసైన్ అంత విజయవంతమవలేదు.[5]
1881 నవంబర్‌లో ఫ్రాన్స్ దేశానికి చెందిన గస్టావె ట్రావె పారిస్‌లో జరిగిన 'ఇంటర్నేషనల్ ఎక్సిబిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటి'లో నడిచే మూడు చక్రాల వాహనాన్ని ప్రదర్శించాడు. [6]
[మార్చు] మూలాలు
- ↑ (1976) Pocket Oxford Dictionary. London: Oxford University Press. ISBN 0-19-861113-7.
- ↑ WorldMapper - passenger cars.
- ↑ SA MOTORING HISTORY - TIME LINE. Government of South Australia.
- ↑ Setright, L. J. K. (2004). Drive On!: A Social History of the Motor Car. Granta Books. ISBN 1-86207-698-7.
- ↑ Ralph Stein (1967). The Automobile Book. Paul Hamlyn Ltd.
- ↑ Wakefield, Ernest H. (1994). History of the Electric Automobile. Society of Automotive Engineers, Inc.. ISBN 1-56091-299-5.