ఈద్గాహ్

వికీపీడియా నుండి

ఈద్ గాహ్ లేదా ఈద్గాహ్ ఒక గాలి బయట మైదాన స్థలంలో మస్జిద్, సాధారణంగా ఇది ఊరి బయట వుంటుంది. దీనిని ఈద్ (పండుగ), గాహ్ (ప్రదేశం), ఈద్ సమయాన సలాహ్ (నమాజు) లేదా ఈద్ నమాజ్ చేయుటకు ఉపయోగిస్తారు.[1]

మహమ్మదు ప్రవక్త దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చారు.sawa ఈద్ నమాజ్ ఊరి బయట చదివే రివాజు. ఈద్ నమాజ్ ఊరి బయట చదవడం సున్నహ్ కూడానూ.[2]

ప్రప్రథమ ఈద్ గాహ్ మదీనా నగరపు పొలిమేరల్లో యుండేది, ఇది మస్జిద్-ఎ-నబవి నుండి దాదాపు 1000 అంగల దూరంలో వుండేది.[3],[4]

[మార్చు] ఈద్ గాహ్ మరియు ఈద్ సలాహ్ (నమాజ్) సమస్యలు వాటికి సూచనలు

  • సున్నహ్ ప్రకారం ఈద్ నమాజ్ లేదా ఈద్ ప్రార్థనలు పట్టణాలలో లేదా నగరాలలో చేయుటకన్నా ఊరి పొలిమేరల్లో చేయుట మిక్కిలి పుణ్యకార్యం. [5]
  • మస్జిద్ లలో ఈద్ ప్రార్థనలు చేస్తే అవి పరిపూర్ణాలే కాని ఈద్ గాహ్ (సాధారణంగా ఊరి పొలిమేరల్లో ఉంటాయి) లో చేయడం సున్నహ్. ఇలా చేయకపోవడం సున్నహ్ కు వ్యతిరేకమౌతుంది. [6]
  • ఈద్ ప్రార్థనలు ఊరి పొలిమేరల్లోని సామూహిక ప్రార్థనలు. ఒక వేళ పట్టణాల్లో నగరాల్లో ఇలాంటి సౌకర్యం లేకపోతే అవసరానుగుణంగా ఒక ప్రత్యేకమైన మైదానం ఏర్పాటు చేసుకోవాలి. మస్జిద్ లోకూడా ప్రార్థనలు చేసుకోవచ్చు. కాని మైదానాల్లో సామూహిక ప్రార్థనలు ఉత్తమం.[7]
  • ఈద్ గాహ్ లో ఈద్ ప్రార్థనలు చేయడం 'సున్నత్-ఎ-ముఅక్కదా'. ముసలివాళ్ళకు మస్జిద్ లోనే ప్రార్థనలు చేసుకోవచ్చు. [8]

[మార్చు] మూలాలు

  1. Performance of Eid Salah in Eidgah (Open Field)
  2. Eidgah
  3. (Mariful Hadîth, Vol. 3, P.399)
  4. Performance of Eid Salah in Eidgah (Open Field)
  5. (Fatwa Darul Uloom, Vol 5, P. 208)
  6. (Fatwa Darul Uloom, Vol. 5, P.2261)
  7. (Ahsanul Fatwa, Vol. 4, P. 119)
  8. (Fatwa Rahimiyah, Vol. 1, P.276)
ఇతర భాషలు