రాంనరేష్ శర్వాన్
వికీపీడియా నుండి
రాంనరేష్ శర్వాన్ | ||||
బొమ్మ:Cricket no pic.png |
||||
West Indies | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
బౌలింగ్ శైలి | రైట్-ఆర్మ్ లెగ్‌బ్రేక్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 67 | 124 | ||
పరుగులు | 4303 | 4099 | ||
బ్యాటింగ్ సగటు | 38.76 | 44.55 | ||
100లు/50లు | 9/26 | 3/26 | ||
అత్యుత్తమ స్కోరు | 261* | 115* | ||
Overs | 316 | 81 | ||
Wickets | 23 | 12 | ||
Bowling average | 0 | 39.33 | ||
5 wickets in innings | 0 | 0 | ||
10 wickets in match | 0 | n/a | ||
Best bowling | 4/37 | 3/31 | ||
Catches/stumpings | 46/- | 34/- | ||
1980, జూన్ 23న జన్మించిన రాంనరేష్ శర్వాన్ (Ramnaresh Ronnie Sarwan) వెస్ట్‌ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు భారతీయ-గుయానా సంతతికి చెందినవాడు. 2000 మేలో బార్బడస్ లో పాకిస్తాన్ పై మొదటి టెస్ట్ ఆడినప్పటినుంచి క్రమంతప్పకుండా ఇతడు వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్సులోనే 84 పరుగులు సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు.
విషయ సూచిక |
[మార్చు] టెస్ట్ క్రికెట్
2000లో పాకిస్తాన్‌పై తొలి టెస్టు మ్యాచ్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన శర్వాన్ ఇప్పటి వరకు 67 టెస్టులలో 4303 పరుగులు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 261(నాటౌట్). టెస్టులలో 9 సెంచరీలు మరియు 26 అర్థసెంచరీలు కూడా సాధించాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్సులో 84 పరుగులు చేసిన శర్వాన్ 2001 మార్చిలో దక్షిణాఫ్రికాపై 91 పరుగులవద్ద రనౌట్ అయి తొలి శతకాన్ని జారవిడుచుకున్నాడు. 2002 అక్టోబర్ లో భారత్ పై చెన్నైలో 78 పరుగులు చేసి సెంచరీ సాధించే మరో అవకాశాన్ని వదులుకున్నాడు. ఇలా 4 పర్యాయాలు 75పైగా పరుగులు చేసి ఔటై చివరికి ఢాకాలో బంగ్లాదేశ్ పై తొలి శతకాన్ని నమోదుచేశాడు. 2004 జూన్ లో బంగ్లాదేశ్ పైనే 261(నాటౌట్) పరుగులు సాధించి తన అత్యుత్తమ స్కోరును మెరుగుపర్చుకున్నాడు. అప్పుడప్పుడు బౌలింగ్ చేసే శర్వాన్ టెస్టులలో 23 వికెట్లు కూడా పడగొట్టినాడు.
[మార్చు] వన్డే క్రికెట్
శర్వాన్ ఇప్పటివరకు 124 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 4099 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు మరియు 26 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 115 నాటౌట్. వన్డేలలో 12 వికెట్లు కూడా సాధించాడు.
[మార్చు] ప్రపంచ కప్ క్రికెట్
శర్వాన్ వెస్ట్‌ఇండీస్ జట్టు తరఫున 2003 మరియు 2007 ప్రపంచ కప్ క్రికెట్‌లో పాల్గొన్నాడు.
[మార్చు] వెస్ట్‌ఇండీస్ కెప్టెన్‌గా
వెస్ట్‌ఇండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రిటైర్‌మెంట్ అనంతరం 2007, ఏప్రిల్ 29న శర్వాన్‌కు నాయకత్వ భాద్యతలు అప్పగించబడింది.
[మార్చు] రికార్డులు
2006, జూన్ 23న తన 26 పుట్టినరోజు నాడు ఒకే ఓవర్‌లో భారత్ పై ఆడుతూ [మునాఫ్ పటేల్]] వేసిన ఆరు బంతులను కూడా బౌండరీ దాటించి ఈ ఘనత సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. (ఈ ఘనత పొందిన తొలి క్రికెటర్ భారత్‌కు చెందిన సందీప్ పాటిల్).
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
కార్ల్ హూపర్ · రిడ్లీ జాకబ్స్ · చందర్‌పాల్ · పెడ్రో కొల్లిన్స్ · కాలిమోర్ · మెర్విన్ డిల్లాన్ · వాస్బెర్ట్ డ్రేక్స్ · క్రిస్ గేల్స్ · వేవెల్ హిండ్స్ · బ్రియాన్ లారా · జెర్మైన్ లాసన్ · నిక్సన్ మెక్ లీన్ · రికార్డో పొవెల్ · మార్లన్ శామ్యూల్స్ · రాంనరేష్ శర్వాణ్ |
|
|
---|---|
బ్రియాన్ లారా · ఇయాన్ బ్రాడ్ షా · డ్వేనే బ్రేవొ · చందర్‌పాల్ · కాలిమోర్ · క్రిస్ గేల్ · డారెన్ పొవెల్ · కీరొన్ పొలాక్ · దినేష్ రాందిన్ · మార్లన్ శామ్యూల్స్ · రాంనరేష్ శర్వాణ్ · సిమ్మన్స్ · డ్వేనే స్మిత్ · డేవన్ స్మిత్ · జెరోమ్ టేలర్ |