యల్లాయపాళెం
వికీపీడియా నుండి
యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము.
విషయ సూచిక |
[మార్చు] పుట్టుక
ఆ రోజు వాతావరణం కొద్దిగా మబ్బులు పట్టి వుంది. ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా, 'ఆ, ఈ మబ్బులు కాసేపే' అంటూ రోజూ లాగే పశువులు తోలుకుని అడవిలోకి బయలుదేరాడు. వాతావరణం బావుందేమో! తెలీకుండానే పశువులతో పాటుగా చాలా దూరం వచ్చేశాడు. దారిలో చిన్న వాగు, వాగు కి అవతల వృక్షాలు, పచ్చటి ప్రాంతం చూసి నెమ్మదిగా వాగు దాటి అక్కడికి చేరాడు. ఇక ముందుకు కదలాలనిపించలేదు. అక్కడ పశువులని మేతకి వదలి, తను కూడా తనతో పాటే తెచ్చుకున్న చద్దన్నం తిని, వాగు లోని నీళ్ళు తాగాడు. ఇక్కడ నీళ్ళకి ఇంత రుచి ఎలా వచ్చిందో అని ఆలోచిస్తూ ఓ చెట్టు కింద నిద్ర లోకి జారి పోయాడు.
ముసురు పట్టిన మబ్బు ఇంకాస్త తీవ్ర రూపం దాల్చింది. ఒక్క సారి గా పెద్ద వర్షం. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి మేల్కొన్న అతను పశువులని హడావిడి గా తోలుకుంటూ కాస్త ఎత్తైన ప్రదేశం చేరాడు. సరేలే, ఈ వాన తగ్గాక, ఇక ఇంటికి వెల్లిపోదాం అనుకుంటున్నాడు. వర్షం తగ్గక పోగా ఇంకాస్త భీకరంగా మారింది. ఈ రాత్రికి ఇక ఇక్కడే, ఒక్కడినే ఎలానో అనుకుంటూ చాలా సేపటికి నిద్ర లోకి జారుకున్నాడు. రాత్రంతా కుండపోత గా కురిసిన వాన తెల్లవారేసరికి మందగించింది.
దాంతో పశువులను తోలుకుని తిరుగుముఖం పట్టాడు. తీరా వాగు దగ్గరికి వచ్చేసరికి... నిన్నటి దాకా ప్రశాంతంగా వున్న పిల్ల వాగు ఉగ్ర నాగు లాగా వుంది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. అది ఎప్పటికి తగ్గుతుందో తెలీని పరిస్ఠితి? అతనికేం తెలుసు, అక్కడే ఇంకొద్ది రోజులు గడపాలని... అలా వాగు మామూలు పరిస్ఠితి కి వచ్చేవరకు, ఆ ప్రాంతం లో నే ఫలాలు తింటూ, పశువుల పాలు తాగుతూ కొద్దిరోజులు గడిపాడు. ఆశ్చర్యకరమేమిటంటే, ఆ ప్రాంతం లో మేత తిన్నాక పశువులు అంతకుముందెన్నడూ లేనట్లు గా విపరీతంగా పాలివ్వడం ప్రారంభించాయి. అతనికి కూడా అక్కడ వున్నన్ని రోజులు తిండి కి ఇబ్బంది కాలేదు.
కొద్దిరోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరిన అతను ఈ విషయాలన్నీ తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చెప్పాడు. దాంతో వారందరికీ కూడా ఆ ప్రాంతం చూడాలని అనిపించడంతో అందరూ కలిసి ఆ ప్రాంతం వచ్చి అంత మంచి ప్రాంతం వదలివెళ్ళడం ఇష్టం లేక అక్కడే స్ఠిర పడి పోయారు. ఇలా వారంతా స్థిర పడడానికి కారకుడైన 'ఎల్లయ్య' పేరుతో ఆ ప్రాంతం 'ఎల్లయ్య పాలెం' క్రమేణా 'యల్లాయపాళెం' గా ప్రసిద్ధి పొందింది.
- ఇలా... యల్లాయపాళెం- కాకతీయ రాజులు , తిక్కన కాలంలో 13-14 శతాబ్దంలో ఏర్పడింది అని గ్రామస్థులు ఊరి పుట్టుక గురించి చెప్పుకునే విషయాలలో ఇది ఒకటి.
[మార్చు] చరిత్ర
- 1946 ముoదు
నెల్లూరు జిల్లాలోని మేటి గ్రామాలలో ఒకటి. ఊళ్ళో పంట రెడ్లు ఎక్కువ. వీరు భూస్వాములూ వ్యవసాయదారులూ కూడా. వీరు కాక దేవాంగులూ(చేనేత పనివారు), ముస్లిం లు, బలిజ వారు, హరిజనులు, ఇతర చేతి వృత్తుల వారు ఉండేవారు. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు ఈ గ్రామం కేంద్రంగా ఉండేది. అప్పటికే చాలాకాలంగా పంచాయతీ బోర్డు ఉండేది. దీని ఆధ్వర్యంలో కిరోసిన్ లైట్లు, పెట్రో మాక్స్ లైట్లు వీధిలో ఏర్పాటు చేసారు. రేడియో గూడా ఉండేది. ఊళ్ళో ఒక శివాలయం, మహలక్షమ్మ గుడి ఉంది.
- 1946 తర్వాత
చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ మేటి గ్రామం గానే వెలుగొందుతోంది. గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందిస్తున్నారు. గ్రామస్థుల సహకారం తో మంచి పాఠశాలలు, గ్రంథాలయం ఏర్పాటయ్యాయి.
[మార్చు] గ్రామం లోని వివిధ ప్రాంతాలు
గ్రామములోని వివిద ప్రాంతాలను గ్రామవాసుల పిలుపులలో ఈ విదంగా పలుకుతారు -
చావిడి సెంటర్, మిషను వీధి, గొల్లపాళెం(యాదవ పాళెం), దేవాంగ పాళెం, బజారు, తూర్పు వీధి, హరిజన వాడ, అరుంధతీయ వాడ, పొగతోట, కుమ్మరిపాళెం(రామ మందిరం వీధి), హౌసు, గిరిజన కాలనీ.
- వాడుక పదాలు ప్రాంతాలు
చావిడి, బొడ్డు బావి, పుట్టా వారి మిట్ట, కమారాయి (కంభం రాతి) సెంటర్,మిట్టతోట, గంగబాయి తోట, మిషను వీధి, జారుడు అట్టెడ, మలిదేవి, లోతుకాలవ, మాంజేలు
[మార్చు] గ్రామములో సౌకర్యాలు
- 1-5 తరగతుల వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలదు.
- 6-10 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలదు.
- తేజ్ నికేతన్ కాన్వెంట్.
- అంగన్ వాడి బడి.
- బలహీన, వెనుకబడిన వర్గాల పిల్లలకు వసతి గృహాలు.
- పంచాయితీ కార్యాలయం.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
- పశువుల ఆస్పత్రి.
- పోస్ట్ ఆఫీస్.
- టెలిఫోన్ ఎక్స్ఛేంజ్.
- పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం.
- వ్యవసాయదారుల సహకార సంఘం.
- ఆంధ్రా బ్యాంక్.
- జిల్లా గ్రంథాలయం.
- బాపూజీ విజ్ఞాన కేంద్రం.
- కంప్యూటర్ మరియు కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు
[మార్చు] దేవాలయాలు
- మహలక్ష్మమ్మ గుడి.
- కంభం రాతి ఆంజనేయ స్వామి గుడి
- సాయి బాబా గుడి.
- కుమ్మరివీధి రామ మందిరం
- గంగమ్మ గుడి
- బ్రహ్మం గారి గుడి.
- మసీదు.
- శివాలయం.
- తూర్పు వీధి రామ మందిరం.
- శివబాబా ఆలయం(ఓం శాంతి)
- చర్ఛి.
- చెన్నకేశవ స్వామి ఆలయం.
- గ్రామ పొలిమేరలలో గ్రామ దేవతలు
[మార్చు] వ్యవసాయం
ఒకప్పుడు వరి, చెరకు ప్రధాన పంటలు గా ఉండేవి. ప్రస్తుతం రొయ్యల సాగు కూడా ప్రధాన పాత్ర పొషిస్తోంది. అక్కడక్కడా ప్రత్తి కూడా సాగవుతోంది.
[మార్చు] రవాణా సౌకర్యాలు
మొదట్లో మోటారు వాహనాలు అంతగా అభివృద్ది చెందని కాలంలో ప్రజలు దగ్గర్లోని రాజుపాలెం, బుచ్చిరెడ్డిపాలెము లకు కాలి నడకన పొలాల వెంబడి వెళ్ళి పోయే వారు. కొద్దిగా స్థితి మంతులైతే బండ్లు కట్టించుకునే వారు. చాలా కొద్ది మంది కి మాత్రమే గుర్రపు బగ్గీలుండేవి. ఆ రోజుల్లో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం కావడం తో మేలు జాతి ఎద్దులు, పశువులను కొనుక్కుని వందల కి.మీ. దూరం వాటిని తోలుకుంటూ కాలినడకనే వచ్చేసేవారు.
1980-85 ప్రాంతం లో అనికేపల్లి బస్సు, అగ్గిపెట్టె బస్సు అని ఉండేవి. వీటిని ప్రైవేటు వారు నడిపేవారు. వీటిని నడిపిన డ్రైవర్లకి ఆ పేర్లే ఇంటి పేర్లుగా మారిపోయాయి. (ఉదా:అనికేపల్లి శీనయ్య)
తర్వాతి కాలంలో గ్రామస్తుల కోరిక మేరకు RTC కూడా ఒక బస్సు నడపడం ప్రారంభించింది. దీనిని డేవుడ్ బస్సు (Day-Out) గా వ్యవహరించే వారు. ఇది బుచ్చి కి, రాజుపాళెం మీదుగా నెల్లూరు, ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు నడిచేది.
తర్వాత 90 ల ప్రాంతం లో జరిగిన శ్రీ రామ సేతు (మలిదేవి బ్రిడ్జి) నిర్మాణం తో పాటూరు, గుమ్మళ్ళదిబ్బ ల మీదు గా బస్సులు నడపడానికి వీలు కుదిరింది. ఈ మార్గం లో RTC రెండు బస్సులు నడిపేది. వీటి ని Flight, Cheeta లు గా వ్యవహరించేవారు. Flight బుచ్చి నండి అయ్యప్ప గుడి వరకు, Cheeta రాజుపాళెం నుండి ఆమంచర్ల వరకు నడిచేవి. తర్వాత కొద్ది కాలం లో నే ఈ మార్గం లో 3-4 ప్రైవేటు బస్సు లు కూడా నడవడం ప్రారంభించాయి.
ప్రస్తుతం అనేక ఆటోలు కూడా అందుబాటు లో ఉన్నాయి.
[మార్చు] గ్రామ సర్పంచులు
- ప్రస్తుత సర్పంచ్ - దేవిరెడ్డి శ్రీలక్ష్మి
- గత సర్పంచులు - బడుగు శ్రీనివాసులు, గండవరపు బాలక్రిష్ణారెడ్డి
[మార్చు] గ్రామం నుంచి ప్రముఖులు
- నేదురుమల్లి రాజ్యలక్ష్మి గారు (ఎమ్.ఎల్.ఏ)
- చింతా మోహన్ గారు (ఎమ్.పి)
........
[మార్చు] ఇరుగు పొరుగు గ్రామాలు
రెడ్దిగుంట(2 కి.మీ.), రామచంద్రా పురం(దాసరి పాళెం) (1.5 కి.మీ.), తాటాకుల దిన్నె(2 కి.మీ.),మిక్కిలిం పేట(4 కి.మీ.), గ్రామనత్తం(4 కి.మీ.), పల్లెపాళెం(1 కి.మీ.), పాటూరు(4 కి.మీ.)
బుచ్చిరెడ్ది పాళెం(8 కి.మీ.),గండవరం(6 కి.మీ.), రాజుపాళెం(5 కి.మీ.), కోవూరు(8 కి.మీ.), దామర మడుగు(6 కి.మీ.), రేబాల (5 కి.మీ.)
[మార్చు] ముఖ్యమైన ఫోన్ నంబర్లు
- టెలిఫోను ఎక్స్చేంజి : +91-8622-277798
- పంచాయితి కార్యాలయం : +91-8622-277702
- సహకారసంఘం (వ్యవసాయం) : +91-8622-277778
- ఆంధ్రాబ్యాంక్ : +91-8622-278734
[మార్చు] ముఖ్య ఘటనలు
- 1933, డిసెంబర్ 30 : మహాత్మా గాంధీ సందర్శన
- 1935, నవంబర్ 12 : బాబూ రాజేంద్ర ప్రసాద్ సందర్శన
[మార్చు] Search Tags
Yellayapalem, Yellaya palem, yallayapalem, yallaya palem, ellayapalem, ellaya palem, yellapalem, yella palem
|
|
---|---|
ఆలూరుపాడు · బసవాయపాలెం · బొడ్డువారిపాలెం · దామెగుంట · గండవరం · గొట్లపాలెం (నిర్జన గ్రామము) · గుండాలమ్మపాలెం · కొడవలూరు · కొత్తవంగల్లు · మానెగుంటపాడు · నాయుడుపాలెం · ఉత్తర రాజుపాలెం · రామన్నపాలెం · తలమంచి · వెంకన్నపురం · యల్లాయపాళెం |