ఫిఖహ్
వికీపీడియా నుండి
ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాం లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్ మరియు సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.
ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్థంభాలను మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్) లు గలవు. [1]
విషయ సూచిక |
[మార్చు] పుట్టు పూర్వోత్తరాలు
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.
[మార్చు] ఇస్లామీయ చట్టం
ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.
చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('అమలియ్య — عملية ) : ఇందులో :
- కర్తవ్యం (Obligation) (పర్జ్)
- సిఫారసు (Recommendation) (మన్‌దూబ్)
- స్వీకారం (Permissibility) (ముబాహ్)
- అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (మక్రూహ్)
- నిషేధితం (Prohibition) (హరామ్)
చట్టాలు, స్థితి-సంబంధాల ఆధారంగా (వదీయ') : ఇందులో :
- షరతు (Condition) (షర్త్)
- కారణం (Cause) (సబబ్)
- వారించడం (Preventor) (మనా)
- స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (రుఖ్సాహ్, అజీమాహ్)
- స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (సహీహ్, ఫసద్, బాతిల్)
- తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (అదా, అల్-ఖజా, ఇయాదా)
[మార్చు] ముస్లిం న్యాయపండితులు : ఉలేమా
- ప్రధాన వ్యాసం: ఉలేమా
ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.
[మార్చు] ఇవీ చూడండి
|
|
---|---|
ఇస్లాం · అల్లాహ్ · ముహమ్మద్ · ఖోరాన్ · మలాయిక · ప్రవక్తలు · మక్కా · మదీనా · రాషిదూన్ ఖలీఫాలు · ఖిలాఫత్ · ఖలీఫా · మస్జిద్-అల్-హరామ్ · మస్జిద్-ఎ-నబవి · బైతుల్-ముఖద్దస్ · ఇస్లామీయ స్వర్ణయుగం · ముస్లింల పవిత్ర స్థలాలు · కాబా · మస్జిద్ · హిజ్రత్ · ముస్లింల పండుగలు · ఇస్లామీయ కేలండర్ · · సున్నీ ఇస్లాం · షరియా · హదీసులు · సున్నహ్ · ఈద్గాహ్ · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్ల జాబితా · ముస్లిం పండితులు · ఇస్లామిక్ దేశాలు · ముస్లిం శాస్త్రవేత్తలు · ముస్లింల సాంప్రదాయాలు · యౌమ్-అల్-ఖియామ · కాఫిర్ · మోమిన్ · ఖిబ్లా · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా · భారతదేశంలో ఇస్లాం సూఫీ తత్వము · ఔలియాలు · సూఫీలు · |
[మార్చు] నోట్స్
- ↑ Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141
[మార్చు] మూలాలు
- Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1842000878 (hardback)
- Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0521091824.