తిరువనంతపురం
వికీపీడియా నుండి
?తిరువనంతపురం కేరళ • భారతదేశం |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
141.74 కి.మీ² (55 sq mi) • 5 మీ (16 అడుగులు) |
వాతావరణం • అవపాతం |
Am (Köppen) • 1,700 mm (66.9 in) |
జిల్లా(లు) | తిరువనంతపురం |
జనాభా • జనసాంద్రత |
744,739 (2001) • 5,284/కి.మీ² (13,685/చ.మై) |
మేయర్ | సి.జయన్ బాబు |
కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • UN/LOCODE • వాహనం |
• 695 xxx • +91 (0)471 • INTRV • KL-01, KL-16, KL-19, KL-20, KL-21, KL-22 |
వెబ్‌సైటు: trivandrum.nic.in |
అక్షాంశరేఖాంశాలు: తిరువనంతపురం, కేరళ రాష్ట్రానికి రాజధాని. దీనిని బ్రిటీషు పరిపాలనా కాలములో ట్రివేండ్రం అని పిలిచేవారు. ఇది ఒక రేవు పట్టణము. అనంతపద్మనాభస్వామి కొలువైవున్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలొనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్ళు పంచలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కుడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరు సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి.
విషయ సూచిక |
[మార్చు] శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం
[మార్చు] స్థలపురాణం
తాళపత్ర గ్రంధాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ట, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు రెండు సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్ష్మమయ్యాడు. ఆ బాలుని ముఖవర్చస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ, బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒక రోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా, క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు, అనంతరం ఒక మహా వృక్షరూపంలో నేలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కి.మీ. దూరం వ్యాపించి, శిరస్సు 'తిరువళ్ళం' అన్న గ్రామం వద్ద, పాదములు 'త్రిప్పాపూర్' వద్ద కన్పించాయి. అంతటి భారీ విగ్రహన్ని మానవమాత్రులు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవరతించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కన్పించగా, ఆ విగ్రహాన్ని తెచ్చి 'తిరువనంతపురం'లో ప్రతిష్టించినట్లు కథాంశం.
[మార్చు] ఆలయ నిర్మాణం
ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది. సుమారు 5వ శతాబ్దకాలంలో 'చేరమాన్ పెరుమాళ్' అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం క్రీ.శ.1050 వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తున్నది. తరువాత క్రీ.శ.1335-1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన 'వీరమార్తాండ వర్మ' అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈయన హయాంలో క్రీ.శ.1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి ఆరు మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. పదిరోజులపాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉన్నది. క్రీ.శ.1459-60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. క్రీ.శ.1461లో ఒక రాతిపై 'ఓట్టకల్ మండపం' నిర్మాణం జరిగింది. అనంతరం క్రీ.శ.1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు 'రాజా మార్తాండ వర్మ' కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి.
[మార్చు] ఆలయ సౌందర్యం
ప్రధానాలయం మళయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకొని చుట్టూ ప్రహారి నాలుగు ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వమి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. నాలుగు మూలల నాలుగు ఉయ్యాల మండపాలతో, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో 'పుష్కరిణి' చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త (అయ్యప్ప), పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది.
[మార్చు] ప్రధాన ఉత్సవాలు
ప్రతి సంవత్సరం ఆరు మాసాలకు ఒకసారి తులా మాసం (సెప్టెంబరు / అక్టోబరు)లో, ఫాల్గుణ మాసం (మార్చి / ఏప్రిల్) లో 'అల్పిసి ఉత్సవాలు' జరుగుతాయి. తులా మాసంలో జరిగే ఉత్సవాలాలో 'ఆరాట్టు' ఊరేగింపు ప్రధానమైనది. శ్రీ పద్మనాభ, శ్రీనారసింహ, శ్రీకృష్ణ దేవతా విగ్రహాలను గరుడవాహనంపై ఊరేగించి సముద్ర స్నానాలకు తీసుకొని వెళతారు. ఈ ఊరేగింపు అధికార లాంఛనాలతో రాజు కరవాళం చేతబట్టి ముందు నడవాల్సి ఉంది.
[మార్చు] మూలాలు
- కావటూరి సుగుణమ్మ: శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురం. సప్తగిరి సచిత్ర మాస పత్రిక జనవరి 2008 సంచిక నుంచి.