చేమూరు
వికీపీడియా నుండి
చేమూరు, చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలానికి చెందిన గ్రామము. ఇది శ్రీకాళహస్తికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శ్రీకాళహస్తి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులలో గ్రామానికి చేరుకోవచ్చును.
చేమూరు గ్రామంలో సుమారు వంద ఇళ్ళు దాకా ఉంటాయి. కొద్ది మంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ 99 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. సేద్యపు నీటికి ఎక్కువగా వర్షం, గొట్టపు బావులే ఆధారం. అక్షరాస్యతా శాతం సుమారు 50%. గ్రామం నడిబొడ్డులో ఉన్న రాములవారి మందిరం ప్రముఖ దేవాలయం.
- పండుగలు
ప్రతి యేటా మార్చి నెలలో పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. మూడవ రోజు అతి ముఖ్యమైన రోజు. రాత్రి 7-8 గంటల సమయంలో గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అగ్ని ప్రవేశం చేస్తారు. ఇవి కాక గ్రామ దేవతలైన చేమూరమ్మ, అంకమ్మలకు సంవత్సరానికి ఒకసారి పొంగళ్ళు పెడతారు. జంతు బలులు కూడా సాధారణం.
|
|
---|---|
గొట్టిపూడి · రాంభట్లపల్లె · కాసారం · మామిడిగుంట · పిల్లమేడు · దాయినాడు · చేమూరు · చియ్యవరం · సిద్ధిగుంట ఉమామహేశ్వరపురం · చోడవరం · పెద్దగుంట అగ్రహారం · పెద్దకనపర్తి · కొన్నలి · కొణతనేరి · పెన్నలపాడు · విరూపాక్షపురం · గుంతెలిగుంట ఎల్.ఎన్.పురం · పూడి · ఇలగనూరు · గురుకులపాలెం · పొయ్య · గుమ్మడిగుంట · రౌతుసురమల · గౌడమల · తంగెళ్లపాలెం · తాటిపర్తి · కల్లిపూడి · చిన్న సింగమల · చిన్నకన్నలి · పెద్ద కన్నలి · బసవయ్యపాలెం · సాంబయ్యపాలెం · చెరుకు రాగప్పనాయుడు ఖండ్రిగ · ఏదులగుంట · తొట్టంబేడు · శివానందపాలెం · దొంగలమూడూరు · చిత్తతూరు · శ్రీకృష్ణాపురం · కాంచనపల్లె · బోనుపల్లె |