Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
తెలుగు లిపి - వికీపీడియా

తెలుగు లిపి

వికీపీడియా నుండి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది[1].

అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపి లో వ్రాసిన అక్షరములు మొదట భట్టిప్రోలు లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి[2]. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి[3].

తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా
తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా
3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం
3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం
1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం
1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం
1747 నాటి క్రైస్తవ రచన
1747 నాటి క్రైస్తవ రచన
1817లో బ్రౌను దొర వెలువరచిన తెలుగు పుస్తకం
1817లో బ్రౌను దొర వెలువరచిన తెలుగు పుస్తకం

విషయ సూచిక

[మార్చు] ఆవిర్భావము

తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరమున ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ.పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది [4]. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడ అచటకు చేరినది[5]. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవులనుండి తూర్పు ఆసియా లోని బర్మా, థాయిల్యాండ్, లావోస్ మొదలగు దేశాలకు కూడ చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది[6][7][8]. క్రీ.శ. ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది[9][10][11][12][13][14].

మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడినది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.

[మార్చు] తెలుగు శాసనములు

[మార్చు] శాతవాహనుల శాసనములు

శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది.

[మార్చు] ఇక్ష్వాకుల శాసనములు

క్రీ.శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు.

[మార్చు] శాలంకాయన నందివర్మ శాసనము

ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత మరియు ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు.

[మార్చు] విష్ణుకుండిన శాసనములు

విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతములో దొరికిన క్రీ. శ 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.

[మార్చు] పల్లవ నరసింహవర్మ శాసనము

శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.

[మార్చు] పరిణామము

భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. వరుసలు 9, 10 మరియు 11 చాళుక్యుల కాలము (7, 10 మరియు 11వ శతాబ్దములు) నాటి లిపులను సూచిస్తునాయి. 10, 11 వరుసలలోని లిపిని వేంగీలిపి అనికూడ అంటారు. 12వ వరుసలో కాకతీయుల కాలమునాటి లిపిచూడవచ్చు. ఈ కాలములో తెలుగు భాష, సాహిత్యములు ప్రజ్వరిల్లాయి. 13, 14 వరుసలలో మహాకవి శ్రీనాథుని కాలము నాటి లిపి, చివరి వరుసలో విజయనగరకాలము నాటి తెలుగు-కన్నడ ఉమ్మడి లిపి చూడవచ్చు. అధునిక తెలుగు లిపికిది చివరి పరిణామదశ.


బెంజమిన్ షుల్జ్ అను మతప్రచారకుని మూలముగ క్రైస్తవ సాహిత్యము జర్మనీ దేశమందు తెలుగులిపిలో ప్రచురించబడింది. బ్రౌను దొర తెలుగు పుస్తకముల ప్రచురణకు చాల కృషిచేశాడు. 20వ శతాబ్ది మధ్యలో తెలుగు గొలుసుకట్టు పద్ధతిలో(ఆంగ్లమువలె)కూడ వ్రాయబడింది. కాని అది ప్రాచుర్యము చెందలేదు.

[మార్చు] Vowels

Telugu uses fourteen vowels, each of which has both a singular form and a diacritic form used with consonants to create syllables. It is important to note that this language does make a distinction between short and long vowels.

Vowel (singular form)
Vowel (diacritic form) ి
Pronunciation [a] [aː] [i] [iː] [u] [uː] [ri/ru] [riː/ruː] [e] [eː] [aj] [o] [oː] [aw]

The singular form is used when the vowel occurs at the beginning of a word or syllable, or is a complete syllable in itself (example: a, u, o). The diacritic form is added to consonants (represented by the dotted circle) to form a consonant-vowel syllable (example: ka, kru, mo). It should be noted that అ does not have a diacritic form, because this vowel is already inherent in all of the consonants. The other diacritic vowels are added to consonants to change their pronunciation to that of the vowel.

Examples:

ఖ + ఈ (ీ) → ఖీ [kʰa] + [iː] → [kʰiː]
జ + ఉ (ు) → జు [dʒa] + [u] → [dʒu]

There are also several other diacritics used in the Telugu script. mutes the vowel of a consonant, so that only the consonant is pronounced. and nasalize the vowels or syllables to which they are attached. adds a voiceless breath after the vowel or syllable it is attached to.

Examples:

క + → క్ మూస:Nbsp [ka] + [Ø] → [k]
క + → కఁ [ka] + [n] → [kan]
క + → కం [ka] + [m] → [kam]
క + → కః [ka] + [h] → [kah]

[మార్చు] Telugu in Unicode

The Unicode range for Telugu is U+0C00–U+0C7F. Grey areas indicate non-assigned code points.

మూస:Unicode chart Telugu

In contrast to a syllabic script such as katakana, where one Unicode code point represents the glyph for one syllable, Telugu combines multiple code points to generate the glyph for one syllable, using complex font rendering rules. [15] [16]




[మార్చు] తెలుగు లిపి గురించి కొన్ని అభిప్రాయాలు

  • శ్రీశ్రీ: ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను. --ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196.

[మార్చు] మూలాలు

  1. తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf
  2. ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm
  3. The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm
  4. The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf
  5. Ananda Buddha Vihara
  6. [1]
  7. [2]
  8. [3]
  9. The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228
  10. Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf
  11. Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0195099842
  12. Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 8120811666
  13. The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0521771110
  14. K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm
  15. Developing OpenType Fonts for Telugu Script.
  16. Unicode 4.0.0: South Asian Scripts.

[మార్చు] వనరులు

  • ఇవల్యూషన్ ఆఫ్ తెలుగు కారక్టర్ గ్రాఫ్స్: http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html
  • తిరుమల రామచంద్ర (1916-1997). "మన లిపి పుట్టు పూర్వోత్తరాలు"
  • పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890-1951). "ఆంధ్ర లిపి పరిణామం"
  • ఏటుకూరు బలరామమూర్తి, 1953, "ఆంధ్ర సంక్షిప్త చరిత్ర," ప్రచురణ: విశాలాంధ్ర.

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com