తపతీ నది
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
తపతీనది తూర్పున సాత్పురా పర్వతశ్రేణిలో ఉద్బవించిన జీవనది. దీని నిడివి 720 కి.మీ. తపతీనది ' తాపీ ' తాప్తి అని కూడా అంటారు. ఖాన్ ప్రాంతంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించి సూరత్ దగ్గిర అరేబియా సముద్రంలో ఈ నది సంగమిస్తూంది. ఈ నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో ఉత్సవాలు జరుగుతాయి. సూరత్ కు ఎగువను తపతీనది మీద ' కాకరపారా" వద్ద ఒక డామును నిర్మించి దాదాపు ఆరు లక్షల ఎకరాల పంటనేలకు సాగునీటిని అందిస్తున్నారు. యూకై గ్రామం వద్ద మరొక డామును నిర్మించడం వల్ల గుజరాత్లో దాదాపు నాలుగు లక్షల ఎకారాల భూమికి పంటనీరు అందుతూంది. ఈ రెండు డాములను నిర్మించడంవల్ల సూరత్ కు తరచు సంభవించే వరద ప్రమాదం అరికట్టబడింది. దీనివల్ల జలవిద్యుచ్చక్తి కూడా ఉత్పత్తి అవుతూంది. తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతం లో కలిసే జలప్రవహాన్ని ' నది' అని, పడమటి దిక్కుగా ప్రవహించి అరేబియా సముద్రములో కలిసేదాన్ని ' నదం' అని సంస్కృతంలో అంటారు. ఆ అర్థంలో పశ్చిమాన అరేబియా సముద్రంలో కలిసే ' తపతి' నీ ' నర్మద' నీ నిజానికి ' నదులు అనడం కంటె ' నదాలు అనడం ఉచితం.
|
---|
సింధు · బ్రహ్మపుత్ర · గంగ · యమున · సరస్వతి · నర్మద · తపతి · మహానది · వంశధార · గోదావరి · కృష్ణ · తుంగభద్ర · కావేరి · పెన్న (పినాకిని) |