వికీపీడియా:ఈ వారపు వ్యాసం
వికీపీడియా నుండి
తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు వ్యాసాల" లక్ష్యం.
[మార్చు] ఈ వారపు వ్యాసంగా పరిగణించటానికి వ్యాసాలను ఎంపిక చేయటం
తెలుగు వికీపీడియాలో ఏదయినా వ్యాసాలు మీకు నచ్చితే వాటి చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అని చేర్చటం ద్వారా ఇతర సభ్యులు కూడా ఈ వ్యాసాలను చూసి వాటిని మెరుగుపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ వ్యాసాలను ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలో చూసుకోవచ్చు. ఆ వర్గములో మొదటి పేజీలోని ఈ వారం వ్యాసం శీర్షికలో మున్ముందు ప్రదర్శించటానికి పరిగణింపబడుతున్న వ్యాసాలు. వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.
- వ్యాసం కనీసం పది కిలోబైట్లకు మించి ఉండాలి. 15-20 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
- వ్యాసము శీర్షిక కు సంబంధించిన విషయాలు స్పృశించి ఉండాలి.
- వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసం యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసలుబాటు ఇవ్వవచ్చు).
- వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదము చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
- వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
- తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.
[మార్చు] ఈ వారం వ్యాసంగా ఎంపిక చేయటం
కొన్ని రోజుల తరువాత వ్యాసానికి మంచి రూపు వచ్చిందని అనుకున్నప్పుడు, ఆ వ్యాసాన్ని ఏ వారం రోజులు ప్రదర్శించాలో నిర్ణయించాలి.
అలా నిర్ణయించిన తరువాత, వ్యాస చర్చా పేజీలలో {{ఈ వారం వ్యాసం|వారం=ప్రదర్శించేవారం|సంవత్సరం=ప్రదర్శించేసంవత్సరం}}
అనే మూసను చేర్చాలి.
మూసను చేర్చిన తరువాత, వ్యాసాలు వాటి తేదీ వచ్చిన వెంటనే, ఈ వారం వ్యాసాలు అనే వర్గంలోకి వచ్చి చేరిపోతాయి. వాటి సమయం రానంత వరకూ మాత్రం ఈ వారం వ్యాసం పరిగణనలు అనే వర్గంలోనే ఉంటాయి.