హేమంత్ కనిత్కర్
వికీపీడియా నుండి
1942, డిసెంబర్ 8న మహారాష్ట్రలోని అమ్రావతిలో జన్మించిన హేమంత్ కనిత్కర్ (Hemant Kanitkar) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1974లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 2 టెస్టులు ఆడినాడు. హేమంత్ కుమారుడు హృషికేశ్ కనిత్కర్ కూడా 1990లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1974, నవంబర్ 22న. మలి టెస్ట్ డిసెంబర్ 11న ఆడినాడు. 2 టెస్టులలో కలిపి 27.75 సగటుతో 111 పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 65 పరుగులు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హేమంత్ 87 మ్యాచ్‌లు ఆడి 42.78 సగటుతో 5006 పరుగులు చేశాడు. అందులో 13 సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 250 పరుగులు.