లతా మంగేష్కర్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
లతా మంగేష్కర్ | |
---|---|
జననం | సెప్టెంబర్ 28 1929 (వయసు 78) ఇండోర్, మధ్యప్రదేశ్ |
సంగీత రీతి | హిందీ సినిమా రంగం హిందీ సినీ సంగీతం (నేపథ్య గాయని), భారతీయ శాస్త్రీయ సంగీతము |
వృత్తి | గాయని |
వాయిద్యం | నేపథ్యగాయిని |
క్రియాశీలక సంవత్సరాలు | 1942 - ప్రస్తుతము |
లతా మంగేష్కర్ (మరాఠీ భాష : लता मंगेशकर ), జననం సెప్టెంబరు 28, 1929) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయిని. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమయినది(మహల్ సినిమాలో 'ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా' పాటతో), అది నేటికినీ సచేతనంగా వున్నది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీపాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.
- ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయినిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది.
- ఈమె గానకోకిల అనే బిరుదునూ సొంతం చేసుకొంది.
- ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), అఖరి పోరాటం(తెల్లచీరకు, ఇళయరాజా) మొదలైన పాటలు పాడారు.
ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు:
- అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేఁ భర్ లో పానీ, జో షహీద్ హువే హైఁ ఉన్కీ, జరా యాద్ కరో ఖుర్బానీ
- ఛోడ్ దే సారీ దునియా కిసీ కే లియే, యే మునాసిబ్ నహీఁ ఆద్మీ కే లియే
- నా కొఈ ఉమంగ్ హై, నా కొఈ తరంగ్ హై, మెరీ జిందగీ హై క్యా, ఏ కటీ పతంగ్ హై
- జబ్ భీ జీ చాహే నయీ దునియా, బసాలేతే హైఁ లోగ్, ఏక్ చెహ్రే పే కయీ చెహ్రే లగాలేతె హైఁ లోగ్