రూబియేసి
వికీపీడియా నుండి
రూబియేసి | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Lady's Bedstraw (Galium verum)
|
|||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|||||||||||
Rubia L. |
|||||||||||
|
|||||||||||
See text For a full list, see: List of Rubiaceae genera |
రూబియేసి (Rubiaceae) పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.
విషయ సూచిక |
[మార్చు] కుటుంబ లక్షణాలు
- అభిముఖంగా అమరి ఉండే సరళపత్రాలు.
- వృంతంతర లేదా గ్రీవ పుచ్ఛాలు.
- డైఖేసియల్ సైమ్ పుష్పవిన్యాసము.
- పుష్పాలు ద్విలింగకము, చక్రీయము, అండకోశోపరిస్థితము, చతుర్బాగ లేదా పంచభాగయుతము.
- రక్షక పత్రాలు 4-5, సంయుక్తము.
- ఆకర్షణ పత్రాలు 4-5, సంయుక్తము, గరాట ఆకారము లేదా నాళికాకారము.
- కేసరము 4-5, మకుట దళోపరిస్థితము.
- ఫలదళాలు 2, సంయుక్తము, నిమ్న అండాశయము.
- స్తంభ అండాన్యాసము.
- విత్తనము అంకురచ్ఛదయుతము.
[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యత
- కాఫియా విత్తనాల నుండి కాఫీ పొడి లభిస్తుంది.
- సింకోనా బెరడులో క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీనిని మలేరియా వైద్యంలో ఉపయోగిస్తారు.
- ఇపికాక్ ఒక మందు మొక్క. దీని కొమ్ముల నుండి 'ఇపికాక్' మందు లబిస్తుంది. దీనిని దగ్గు, అతిసార వ్యాధుల వైద్యంలో ఉపయోగిస్తారు.
- బండారు నుండి కలప లభిస్తుంది.
- మొరిండ, రాండియా వేళ్ళ నుండి ఎరుపు అద్దకపు రంగు లభిస్తుంది.
- అనేక మొక్కలను అందం కొరకు తోటలలో పెంచుతారు.
[మార్చు] ముఖ్యమైన మొక్కలు
- రూబియా - మంజిష్ఠ
- కాఫియా - కాఫీ
- సింకోనా - క్వినైన్
- కదంబ
- హల్డినా - బండారు
- పాపిడి
- బలుసాకు
- రామబాణం
- మదన
- ఇపికాక్
- తొగరు
[మార్చు] మూలాలు
- బి.ఆర్.సి. మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.