ఫాబేసి
వికీపీడియా నుండి
Legumes | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Kudzu
|
|||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||
|
|||||||||||
|
|||||||||||
సిసాల్పినాయిడే మైమోసాయిడే ఫాబోయిడే
|
ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7200 జాతులు ఉన్నాయి.ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.
విషయ సూచిక |
[మార్చు] కుటుంబ లక్షణాలు
- వేరు బుడిపెలు ఉంటాయి.
- పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
- పల్వైనస్ పత్రపీఠము.
- ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
- పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
- పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
- అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
- ఉపాంత అండాన్యాసము.
- ఫలము ద్వివిదారకము లేదా పాడ్.
[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యం
- నత్రజని స్థాపనశక్తి అధికంగా ఉండడం వల్ల చాలా పంటలను పంటల మార్పిడికి ఉపయోగిస్తారు.
- కందులు, శనగలు మొదలైనవి మన ఆహారంలోని నవధాన్యాలు మాంసకృత్తులు అధికంగా ఉంటాయి.
- బఠానీ, చిక్కుడు ఫలాలు కూరగాయలుగా వాడతారు.
- వేరుశనగ, సోయా చిక్కుడు నుంచి నూనె తీసి ఆహారంగా వాడతారు.
- గురివింద విత్తనాలను కంసాలి తూకానికి వాడతారు.
[మార్చు] ముఖ్యమైన మొక్కలు
[మార్చు] సిసాల్పినాయిడే
[మార్చు] మైమోసాయిడే
- అకేసియా అరాబికా - (నల్ల తుమ్మ)
- అకేసియా కెటాచ్యూ - (కాచు)
- ఎంటిరోలోబియమ్ - (నిద్ర గన్నేరు)
- మైమోసా పుడికా - (అత్తిపత్తి)
- శీకాయ
- శమి
- సీమ చింత
[మార్చు] ఫాబోయిడే
- అరాఖిస్ హైపోజియా (వేరుశనగ)
- ఇండిగోఫోరా టింక్టోరియా (నీలిమందు మొక్క)
- ఏబ్రస్ ప్రికటోరియస్ (గురివింద)
- కజానస్ కజాన్ (కందులు)
- గ్లైసీన్ మాక్స్ (సోయా చిక్కుడు)
- పైసమ్ సటైవమ్ (బఠానీ)
- మాక్రోటిలోమా యూనిఫ్లోరమ్ (ఉలవలు)
- విగ్నా ఆరియస్ (పెసలు)
- విగ్నా ముంగో (మినుములు)
- సైసర్ అరైటినమ్ (శనగలు)
- బుటియా (మోదుగ)
- (అవిశ)
- (అతిమధురము)
- (ఎర్రచందనం)
- (దూలగొండి)
[మార్చు] మూలాలు
- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.