Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ధూళిపాళ సీతారామశాస్త్రి - వికీపీడియా

ధూళిపాళ సీతారామశాస్త్రి

వికీపీడియా నుండి

ధూళిపాళ సీతారామ శాస్త్రి

నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ
జన్మ నామం ధూళిపాళ సీతారామ శాస్త్రి
జననం 24-9-1921
దాచేపల్లి
స్వస్థలం దాచేపల్లి
మరణం ఏప్రిల్ 13, 2007
గుంటూరు
ఊపిరితిత్తుల వ్యాధి
ఇతర పేర్లు ధూళిపాళ
వృత్తి నటుడు
సంతానం ఇద్దరు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు
తండ్రి శంకరయ్య
తల్లి రత్నమ్మ
వెబ్‌సైటు http://www.dhulipala.org/

ధూళిపాళ సీతారామ శాస్త్రి తెలుగు నాటక రంగంలో మరియు తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామసేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్‌.ఆర్‌, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు. ధూళిపాళగా పిలవబడే ఈయన గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1921 సెప్టెంబర్ 24 న జనించాడు. 2001లో సన్యాస ఆశ్రమం స్వీకరించి శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి గా మారిపొయాడు.

విషయ సూచిక

[మార్చు] నట జీవితం

చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లినప్పుడు ఆ పోటల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోదనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.ఆర్‌. ఆ తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణపాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు , ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు.

[మార్చు] పురస్కారాలు

నాటక, సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.

  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆత్మగౌరవ పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు.
  • బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది.
  • అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ వారు సైతం 2007 ప్రతిభా పురస్కారానికి ధూళిపాళను ఎంపిక చేసింది.
  • తమిళ పత్రికలు సైతం ఆయనను ‘నడిప్పిళ్‌ పులి నడత్తళ్‌ పసువు’ అని అభివర్ణించారు. అంటే... నటనలో పులి...నడతలో (నిజజీవితంలో) గోవు అని అర్ధం.

ఇంకా, సాంస్కృతిక సంఘాలు, సంఘాల సత్కారాలు ఎన్నో లభించాయి

[మార్చు] ఆధ్యాత్మిక జీవితం

నటరాజ సేవలో తరించిన ధూళిపాళ చనిపోవడానికి సుమారు పదేళ్ల క్రింతం సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, అయితే మానవ జన్మ విశిష్టత, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకుని తరిలించాలని భావించి మానవసేవే మాధవసేవ లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదను త్యజించారు. 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూరు మారుతీ నగర్‌లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి, రామాయణం, సుందరాకాండలను తెలుగు లొకి తిరిగి వ్రాశారు . ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ముడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శేషజీవాతాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ.

[మార్చు] మరణం

ధూళిపాళ కొద్దికాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్ 13 న మరణించారు.

[మార్చు] నటించిన సినిమాలు

[మార్చు] వనరులు

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com