దక్షుడు
వికీపీడియా నుండి
దక్షుడు బ్రహ్మ కుడి బొటనవేలు నుండి పుట్టాడు. అశిక్ని/వీరణి/ధరణిని పెండ్లాడాడు. ఇరవై ఏడు నక్షత్రాలు ఈతని కుమార్తెలు. వీరందరినీ చంద్రుడు పెండ్లాడాడు. బ్బృహస్పతీ యజ్ఞం చేసి తన కూతురు సతీదేవిని, అల్లుడు శివుడినీ ఆహ్వానించడు. పిలువకుండానే యజ్ఞానికి వచ్చిన సతీదేవిని దక్షుడు అవమానించగా, ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. దానికి కోపించి, శివుడు వీరభద్రుని పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. దక్షుడు శివుడిచేత సంహరింపబడతాడు. తరువాత దేవతలు మేక తలకాయ తెచ్చి దక్షుణ్ణి బ్రతికిస్తారు. అందుకే ఇతన్ని 'అజముఖుడు' అనికూడా అంటారు.
[మార్చు] మూలాలు
- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ).