త్రయంబకేశ్వరుడు
వికీపీడియా నుండి
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక'మంటే 'నేత్ర'మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
పురాతన త్రయంబకేశ్వరాలయం నాసిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉన్నది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం. ప్రఖ్యాత సినీతంగ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ఇక్కడానే జన్మించారు.