సీతారామయ్యగారి మనవరాలు
వికీపీడియా నుండి
సీతారామయ్యగారి మనవరాలు (1991) | |
దర్శకత్వం | క్రాంతికుమార్ |
---|---|
తారాగణం | మీనా , అక్కినేని నాగేశ్వరరావు, రోహిణి హట్టంగడి |
సంగీతం | కీరవాణి |
నిర్మాణ సంస్థ | వి.ఎమ్.సి. పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఇది 1991లో విడుదలైన తెలుగు సినిమా.
[మార్చు] చిత్రకథ
సీతారామయ్య గారి ఇంట్లో పెళ్ళి జరుగుతున్నపుడు ఒక అమ్మాయి ఆ పెళ్ళికి వస్తుంది. చాలా ఏళ్ళ క్రితం ఇండియా వదిలివెళ్ళిపోయిన సీతారామయ్య గారి కొడుకు కుమార్తె ఆఅమ్మాయి. తండ్రీకొడుకుల మధ్య వచ్చిన అభిప్రాయ బేధం వల్ల తండ్రి కొడుకుతో మాట్లాడతం మానివేశాడు. చదువుకొనే రొజుల్లో కూడా తండ్రి సాంగత్యాన్నివదులుకోలేని కొడుకు , తండ్రి మౌనాన్ని భరించలేక దూరంగా వెళ్ళిపోయాడు. రాకపోకలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. ఐనా మనవరాలు పెళ్ళి కి వచ్చి , తన తల్లి తండ్రులు పని వత్తిడి వల్ల రాలేక పోయారని చెప్పింది. మనవరాలి పేరు సీత అని తెలిసి తాత పరోక్షంలో మురిసిపోయాడు. తన ఎదురుగా పెరిగే వారు అలవరచుకోని సంగీత సంప్రదాయాలు మనవరాలిలో చూసి గర్వించాడు. మనవరాలు , కుటుంబసభ్యులమధ్య సంబంధాలు పెంపొందించింది. ఆమె తల్లి తండ్రులకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సీతారామయ్య తన మనసులో ఎంతో ప్రేమించే కొడుకును తిరిగి ఆలింగనం చేసుకోగలిగాడా?
[మార్చు] చిత్ర విశేషాలు
- ఎ.ఎన్నార్ చిత్రం ఆద్యంతం విగ్గు లేకుండా పంచె కట్టు తో సహజంగా కనిపిస్తారు
- సీతారామయ్య స్నేహితునిగా దాసరి గోదావరి యాస తో మాట్లాడే పెద్దమనిషిగా నటించారు
[మార్చు] పాటలు
- పూచింది పూచింది పున్నాగా, కూసింత నవ్వింది నీలాగ
- భద్రాద్రి రామయ్యా పాదాలు కడగంగా పరవళ్ళూ -సమయానికి తగిన