Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
సి.హెచ్. నారాయణరావు - వికీపీడియా

సి.హెచ్. నారాయణరావు

వికీపీడియా నుండి

సి.హెచ్.నారాయణరావు

జననం 1937
మరణం ఫిబ్రవరి 14, 1984
వృత్తి నటుడు

చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య, కన్నాంబ, ఋష్యేంద్రమణి, సురభి బాలసరస్వతి వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం , సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్‌.నారాయణరావు. వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం ‘భక్తపోతన’ (1944) ను విడుదల చేసారు. అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు. ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు. అంతకుముందు అంత అందమైన, ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు. ‘సాక్షాత్తు రాముడే’ అన్నారు ప్రజ, పోతన పక్షమై. ఆ శ్రీరామ పాత్రధారి చదలవాడ నారాయణరావు.

1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’ లో మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు. నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు, పొడుగైన ముక్కు, నవ్వితే నవరత్నాలు రాలినట్టు కనిపించే పెదవులు, పలువరసతోఅందర్నీ ఆకర్షించాడు. ఆ హీరో నారాయణరావు. నాగయ్య, సి.ఎస్‌.ఆర్‌., జి.వి.రావు., ఉమామహేశ్వరరావులు ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు ఆ రోజుల్లో పర్సనాల్టీలో వీరికి భిన్నంగా కనిపిస్తూ నారాయణరావు రాగానే, ‘ హీరో అంటే ఇలా అందంగా ఉండాలన్న మాట... హీరోయిన్‌ లాగానే’ అనుకున్నారు ప్రేక్షకులు. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న నారాయణరావూని చూసి , ద్రోణంరాజు చినకామేశ్వరరావు (‘జీవనజ్యోతి’ దర్శకుడు) చిత్రాల్లో ప్రవేశ పెట్టారు. కృష్ణవేణి ఆ చిత్రంలో కథనాయిక. నారాయణరావు నటన చాలా సహజంగా ఉంటుందని, అవలీలగ నటించేస్తాడనీ పత్రికలు రాసేవి.

అయితే ఆయన కేవలం హీరో పాత్రలే ధరించలేదు. హీరోగా ఎష్టాబ్లిష్‌ అయిన తర్వాత విలన్‌ పాత్రలు కూడా ధరించారు. తర్వాత కారెక్టర్‌ యాక్టర్‌. ‘చెంచులక్ష్మి’, ‘తాసిల్దార్‌ ’, ‘మొదటిరాత్రి ’, ‘ మనదేశం’ , ‘ తిరుగుబాటు’, మొదలైన చిత్రాల్లో హీరో అయితే, ‘ జీవితం’ లో విలన్‌. ‘దేవత’, ‘స్వర్గసీమ’ చిత్రాల్లో విలన్‌ కాదుగాని, అదో తరహా పాత్రలు. ‘ గంగ గౌరీ సంవాదం’ లో శివుడు, సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు... అన్నింటిలో కూడా నారాయణరావు నటించారు.

విషయ సూచిక

[మార్చు] సినీరంగ ప్రవేశం

1939 సంవత్సరంలో నారాయణరావు చిన్న ఉద్యోగం చేసుకుంటూ తరచు చెన్నపట్నం వెళ్ళి వస్తుండేవారు. ఒకసారి హోటల్‌ లో ఆయన భోజనం చేస్తుండగా ప్రముఖ దర్శకుడు ద్రోణంరాజు కామేశ్వరరావు గారితో పరిచయం అయింది. మొదట ద్రోణంరాజు గారు నారాయణరావుని చూసి బెంగాలీ అనుకొన్నారట. తరువాత నారాయణరావు తెలుగువాడే అని తెలిసిన మీదట తన దర్శకత్వంలో శోభనాచల సంస్థ నిర్మించబోయే జీవన జ్యోతి అనే చిత్రానికి స్క్రీన్‌ టెస్ట్‌ కు రమ్మని చెప్పారు. స్క్రీన్‌ టెస్ట్‌లో భాగంగా నారాయణరావుకు కొన్ని సంభాషణలు ఇచ్చి చిత్రీకరించారు. ఆ టెస్ట్‌ పీస్‌ ను థియేటర్లో ప్రొజెక్ట్‌ చేసే తతంగం సాగర్‌ టాకీస్‌ లో మొదలైంది. దర్శకుడు రాజు గారు, నిర్మాతలు, కెమెరామెన్‌ కొట్నీస్‌ , సౌండ్‌ ఇంజనీర్‌ రంగయ్య తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. తరువాత ఆ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ వచ్చి నారాయణరావు జీవన జ్యోతి సినిమాకు హీరోగా నారాయణరావు ఎంపికయ్యారు అన్న వార్తను చేరవేశారు. ఈ సినిమాకోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా వంద రూపాయలు. అప్పట్లో వంద రూపాయల జీతగాడంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫారసు లేకుండా నటుడైన నారాయణ రావు మనదేశం, ముగ్గురు మరాఠీలు, లక్ష్మమ్మ, వీలునామా, రహస్యం వంటి 50కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడుగా నటించారు.

నారాయణరావు శోభనాచల స్టూడియోకి దగ్గర్లోనే అళ్వారుపేటలో ఉండేవారు. సినిమాల్లో ప్రవేశిస్తూ మొదట ఏ ఇంట్లో ప్రవేశించారోస్టార్‌ అయిన తరువాత కూడా అదే ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఆర్భాటం లేక పోయినా, ఆత్మాభిమానం హెచ్చు. ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు. పనీ ఉండేది కాదు ఆ టైములో...

1953 లో వై.వి.రావు దర్శకత్వంలో వరుణ అండ్‌ మహత్మా అనే కంపెనీ ‘మంజరి’ (జానపదం) నిర్మించింది. నారాయణరావు దాదాపు నిర్మాత. తను సంపాదించుకున్నది ఆ చిత్రానికి ధారపోసారు. చిత్రంవిజయవంతం కాలేదు. అప్పులు మిగిలాయి. అప్పట్నుంచి నారాయణరావు ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. చిత్రాలూ లేవు. జరుగుబాటుకీ, పిల్లల చదువులకీ ఎదురీత మొదలైంది. అయినా, ఆయన గుండె నిబ్బరం తగ్గలేదు. చాలా మంది తారలు, కళాకారులు ఉచ్ఛస్థితికి వెళ్ళీ, కిందికి పడిపోవడం సామాన్యంగా చూస్తూనే ఉంటాం. అదే జరిగింది నారాయణరావు జీవితంలోనూ. ఎంతటి ప్రసిద్దుడికైనా, గొప్పవాడికైనా ఒక దశ దాటిన తరువాత పరిస్థితి, స్థితీ మారడం విధాత శాపం కాబోలు.

[మార్చు] అభిప్రాయాలు

ఆంగ్ల చిత్రాలు, ఆ స్థాయి, ఆ నటనా మనకీ రావాలని, మనది బాగా ఓవర్‌ యాక్టింగ్‌లా కనిపిస్తుందనీ నారాయణరావు చెప్పేవారు. ‘ఆ చిత్రాల్లోని నటులు ఎక్కువగా హావభావాలు చూపించరు. మామూలుగా, మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు. సజీవమైన పాత్రలు అంటే అలాగే ఉంటాయి. నటించాలి కాబట్టి, మనం రెండాకులు ఎక్కువగా తగిలిస్తాం. పూర్వం రోజుల్లో నాటక నటన అయితే మరీ ఓవర్‌గా ఉండేది. మామూలుగా మనం ఎలా మాట్లాడతామో, ఎలా ప్రదర్శిస్తామో అలా... జీవితానికి దగ్గరగానే నటనా ఉండాలని నా ఉద్దేశం. ఎంతమంది నాతో ఏకీభవిస్తారో నాకు తెలియదు. అయితే చిత్రాల్లో నటిస్తున్నప్పుడు నేనోక్కడినే అలా నటిస్తే అతకదు. పైగా ఆ విధానాన్ని మన దర్శకులు అంగీకరించే స్తాయిలో లేరు. చిత్రంలోని పాత్రలన్నీ ఒకే రీతిలో నటించ గలగాలి’ అని నారాయణరవు చెప్పేవారు. అందుకే ఆయన నటనలో చేతులు ఎక్కువగా తిప్పడమూ, గట్టిగా అరవడమూ, కళ్ళూ కనుబొమలూ ఎగరవేయడమూ కనిపించేది కాదు. ఆయనదొక స్టడీ.

‘మనదేశం’ చిత్రం ఎన్‌.టి.రామారావు తొలి చిత్రం. అందులో నారాయణరావు హీరో, రామారావుది ఇన్స్పెక్టర్‌ పాత్ర. తనకి షూటింగులేని ఓ రోజున రామారావు తెల్లని పంచె, జుబ్బాతో కుడిచేత్తో పంచెకొంగుని పైకి పట్టుకుని నడుస్తూ వచ్చి, మేకప్పులో ఉన్న నారాయణరావుకు నమస్కరించి కూచున్నారు. ఆయన్ని చూడగానే ‘అరె..మీరా! ఇన్స్పెక్టర్‌ డ్రస్‌ లో చూసి, మాములుగా చూచేసరికి ఎవరో అనుకున్నాను. చాలా అందంగా ఉన్నారు. ఎప్పుడూ ఇలాగే వేసుకుంటారా డ్రెస్సు?’ అని అడిగారు నారాయణరావు.

‘సాధారణంగా ఇదే డ్రెస్సు.’

‘చాలా సహజంగా ఉంది. మన సినిమాల్లో ఇంత సహజంగా, తెలుగుదనంతో పాత్రలు కనిపించవు. మీది మంచి కంఠం. మంచి రూపం. ఇలాంటి అందమైన హీరోలు రావాలి. మీరు తప్పకుండా మంచి హీరో పత్రలు ధరిస్తారు. అన్నారు నారాయణరావు... ఆయన భవిష్యత్తు తనకి ’బాగా తెలుసు‘ అన్నట్టు.

[మార్చు] నాటకాలు

ఎక్కువగా నాటకానుభవం లేకపోయినా, సినిమాలకి వచ్చిన తర్వాత నాటకాల్లో నటించారు. మల్లాది కృష్ణ శర్మ రాసిన ‘మిస్‌ ప్రేమ బి.ఏ.’ (తిమ్మరాజు శివరావు దర్శకత్వం) లో నారాయణరావు హీరోగా నటించి, చాలా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పకడ్బందీగా, క్రమశిక్షణతో రిహార్సల్సు జరిపి ఆ నాటకంలో నటించారు.


[మార్చు] వ్యక్తిత్వం

ఎంతమందిలో ఉన్నా నారాయణరావు మీదనే అందరి కళ్ళూ ఉండేవి. ఆ తరం ప్రేక్షకులకి నిరంతరం ఆయన బాగా గుర్తుంటారు. వ్యక్తిగా చూస్తే మృదువైన సంభాషణ. సౌమ్యుడు. ఆత్మాభిమానం గలవాడు. బాగా చదువుకున్నారు. ఆంగ్లభాషలో చక్కగా మాట్లాడేవారు. ఆంగ్లభాషలోని గొప్ప గొప్ప పుస్తకాలమీద నిత్యమూ మిత్రులతో చర్చించేవారు. తరచూ రేడియో నాటకాల్లో కూడా పాల్గొనేవారు.

‘నేను చిత్రాల్లో నటించడం మానేసానని ఎవరో అన్నారు. అలానెనేం చెప్పలేదు. నటుడిని నేను. ఎందుకు నటించను? అయితే నేనెవర్నీ వెళ్ళి అడాగను. ఏభై చిత్రాల్లో నటించిన వాడిని... నన్నెరగరా ? అయినా నేను వెళ్ళి అడగడానికి ఆత్మాభిమానం అడ్డం వస్తుంది. అంతకంటె, ఇలా పుస్తకాలు చదువుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ, (ఆయన ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారు) ఇంట్లో కూచోవడం నయం. ఈ మధ్య ఒక నిర్మాత వేషం వెయ్యమని అడిగారు. తప్పకుండా వేస్తానన్నాను. అయితే పారితోషికం చాలా తక్కువగా మాట్లాడాడు. ఎంచేతనంటే... నాకు సినిమాలు లేవుట. డిమాండ్‌ లేదుట.’ హీరో పాత్రధారణకి తీసుకున్నంత పారితోషికం అడగడం లేదు గాని, రీజనబుల్‌గా ఇవ్వండి.‘ అన్నాను ప్రాధేయపడలేదు. మరీ నన్ను తక్కువగా అంచనా వెయ్యడం నాకు నచ్చలేదు. నాకు డబ్బు కావాలి...నిజమే. కాని, ఎంతో కొంతకి కక్కుర్తి పడి ఎలావెయ్యను? దానివల్ల నాకు అహంకారం అన్నారు. డిమాండ్‌ చేస్తాడన్నారు. అదేం కాదు...నా కున్న పేరునీ, ఒకనాటి నా అనిభవాన్నీ చవగ్గా వాడుకోవాలని చూస్తే సహించవలసిన అవసరంలేదు. ’అదీ ఆయన ధోరణి !

[మార్చు] నటించిన సినిమాల జాబితా

[మార్చు] వనరులు

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com