వీధి
వికీపీడియా నుండి
వీధులు (Streets) పెద్ద నగరాల ప్రణాలికలో ఒక ముఖ్యమైన భాగము.
వివిధ నిర్మాణాల మధ్య ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటుచేసిన ప్రదేశాల్ని వీధులు అంటారు. ఇవి ఏ ఒక్కరికి చెందినవి కావు. వీనిలో ముఖ్యంగా ఇల్లు, పార్కులు, రహదార్లు, దుకాణాలు మొదలైనవి ఉంటాయి. కొన్ని వీధులలో నడిచేవారి కోసం ప్రత్యేకంగా నడక దారి వేరుగా ఉంటుంది. రహదారి ముఖ్యంగా రవాణాకు సంబంధించినది అయితే వీధి పరస్పర ప్రయోజనం కోసం ఏర్పాటుచేసినది.[1][2]