దేవదాసు (1974 సినిమా)
వికీపీడియా నుండి
దేవదాసు (1974 సినిమా) (1974) | |
దర్శకత్వం | విజయనిర్మల |
---|---|
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | పద్మాలయా |
భాష | తెలుగు |
ఇదే పేరుతో తెలుగులో మూడు చిత్రాలు వచ్చాయి.
- దేవదాసు (1953 సినిమా) (అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి)
- దేవదాసు (1974 సినిమా) (కృష్ణ, విజయనిర్మల)
- దేవదాసు (2006 సినిమా) (రామ్, ఇలియానా)
ఇది 1974 లో విడుదలైన తెలుగు చిత్రం. వినోదా వారి దెవదాసు వచ్చిన రెండు దశాబ్దాల తరువాత కృష్ణ ,విజయనిర్మల ద్వయం ఈ చిత్ర కల్పన కు పూనుకున్నారు. చిత్రకథ శరత్ సృష్టి అప్పటికే అనేక పర్యాయాలు భారత తెర(ఇండియన్ స్క్రీన్) మీద కనిపించింది.(సైగాల్, దిలీప్ ,ఎ ఎన్నార్ వంటి ఉద్దండులతో). కృష్ణ ఎంతో సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించినా విజయం దక్కలెదు. దీనితో పాటే విడుదలైన ఎ ఎన్నార్ దేవదాసు తిరిగి విజయవంతంగా నడిచింది. ఐతె కొత్త(కృష్ణ) దేవదాసు నిశ్చయంగా కొన్ని విషయాలలో ఉన్నతంగా తయారయ్యింది. ఆరుద్ర సంభాషణలు, గీతాలలో సాహితీవిలువలు, ఆ గీతాలను రమేష్ నాయుడు స్వరపరచిన విధానం చిత్రానికి విలువను సంతరించాయి. పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ, మేఘాలమీద సాగాలి, కల చెదిరింది కథ మారింది, ఇది నిశీధి సమయం మొదలైన పాటలు పాత (ఎ ఎన్నార్) దేవదాసు లో కన్న ఎక్కువ తెలుగు దనంతో (సంగీత సాహిత్య పరంగా) గబాళించాయి.(వి.ఎ.కె రంగారావు గారి అభిప్రాయం).