వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 7
వికీపీడియా నుండి
- 632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలొ పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
- 1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
- 1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
- 1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.
- 1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యారు.
- 1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలొనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
- 1968: హత్యచేయబడిన అమెరికా సెనెటరు, రాబర్టు ఎఫ్. కెన్నడీ దేహాన్ని న్యూ యార్క్‌లోని సెయింట్ పాట్రిక్ చర్చిలో ఉంచారు.
- 1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
- 1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
- 1981: ఒపెరా పేరుతో ఇరాక్‌లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
- 1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.