కోణార్క్
వికీపీడియా నుండి
కోణార్క్ (Konark) భారతదేశములో పేరెన్నికగన్న సందర్శనా ప్రదేశములలో ఒకటి. ఈ క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి ఎనభై ఐదు (85) కిలోమీటర్ల దూరంలో కలదు.
విషయ సూచిక |
[మార్చు] సూర్యదేవాలయము
కోణార్కలో సముద్రతీరమున నిర్మించిన సూర్య దేవాలయము కలదు. సూర్య గమనమునకు అనుగుణంగా ఈ ఆలయ నిర్మాణం జరగటం అద్భుతాలలోకెల్లా అద్భుతంగా కనిపిస్తుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంటుంది.
- ప్రత్యేకతలు
ఈ సూర్యదేవాలయములో ఎన్నో విచిత్రాలు కలవు.
- ఆలయం రధాకారము కలిగి ఉంటుంది.
- ఆలయాన పన్నెండు జతల చక్రాలు కలిగి ఉంటుంది.
- దేవాలయముపైన పద్మము మరియు కలశము ఆకర్షణీయముగా చెక్కబడి ఉన్నాయి.
- ఖుజరహొ మాదిరి ఇక్కడకూడా శృంగార రసభరిత శిల్పాలు విషేషంగా కలవు.
- ఇక్కడి సముద్రతీర ఇసుక బంగారపు వర్ణములో ఉండి తీర ప్రాంతము అందాలు చిందుతూ ఉల్లాసం కలిగిస్తుంది.
[మార్చు] ఇతర దేవాలయములు,ప్రదేశాలు
కోణార్కలో శ్రీ పరమేశ్వరస్వామివారి దేవస్థానము కలదు. 1951లో నిర్మించినట్లుగా చెప్పే అరుణ స్థంభము కలదు.
[మార్చు] తీర్దాలు
మంగళాదేవి తీర్ధము. పాల్మిలిబాంగ్ తీర్ధము. చంద్రబాగ్ మరియు చాయాదేవి తీర్ధములు కలవు.
[మార్చు] ఉత్సవాలు
కోణార్కలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమికి {రథసప్తమి} బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ప్రపంచ నలుమూలల నుండి వేలాదిగా తరలి వస్తారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- అరసవిల్లి: మరో సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా లొని అరసవిల్లిలో ఉంది.