కావ్యహేతువులు
వికీపీడియా నుండి
కావ్య హేతువులు:
"వాక్యం రసాత్మకం కావ్యం" అని నిర్వచనం.. రసవంతమైన వాక్యమే కావ్యము.. రసాత్మకత కావ్యానికి ప్రాణభూతమైన అంశం. రసభావాలు కవి ఆలోచనాలోకం నుండి ప్రవహించేవి. ఇవి అలవోకగా ఒక ప్రవాహం లా కవిలో పొంగి పొర్లుతాయి. దీన్నే వర్డ్స్ వర్త్ స్పాంటేనిటీ అన్నాడు.. “ Poetry is the spanteneous overflow of powerful feelings”… కావ్యనిర్మాణానికి హేతుభూతమైన అంశాలు ఉన్నాయి. ఇవి లేనిదే కావ్య రచన సాధ్యం కాదు.. వీటినే కావ్య హేతువులు అని ప్రాచీనులు అన్నారు.. అవి.. 1. ప్రతిభ 2. వ్యుత్పత్తి 3. అభ్యాసము..
- ప్రతిభ: ఇది దైవదత్తమైనది. ఆజన్మాంత ఫలము. ప్రతిభనే ప్రఙ్ఞ అని కూడా అంటారు. నవనవోన్మేష శాలిని అయిన ప్రఙ్ఞయే ప్రతిభ. " ప్రఙ్ఞా నవనవోన్మేష శాలినీ ప్రతిభా మత" అని అర్యోక్తి. ఉన్మేష మనగ వికాసము. ఇది నవనవోన్మేషము.. అనగా నిత్య నూతన వికాసము.. భావుకతలో, అలోచనలో నిత్యనూతనత్వము ప్రఙ్ఞ. దీనినే ప్రతిభ అన్నారు..