Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
కంప్యూటర్ చరిత్ర - వికీపీడియా

కంప్యూటర్ చరిత్ర

వికీపీడియా నుండి

ఉపోద్గాతము

ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. కంప్యూటర్ లేని జీవనాన్ని ఊహించుకోవడమే కష్టం. ఇంతవరకూ మానవుడు నిర్మించిన మరే సాధనమూ కంప్యూటర్ చూపిన ప్రభావం చూపలేదంటే దాని శక్తిని అంచనా వెయ్యచ్చు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన కంప్యూటర్ రంగంలో మన దేశం కూడా ఎంతో పురోగతిని సాధంచింది. కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాదారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్, లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్ లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్ర్తత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి.

కంప్యూటర్ మరియు మల్టీమీడియా స్పీకర్స్,కీబోర్డ్,మౌస్.
కంప్యూటర్ మరియు మల్టీమీడియా స్పీకర్స్,కీబోర్డ్,మౌస్.

విషయ సూచిక

[మార్చు] కంప్యూటర్ అంటే ఏమిటి?

కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఇది మనం ఇచ్చిన సమస్య యొక్క డేటా (INPUT) స్వీకరించి ముందుగా ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం డేటాను విశ్లేషించి ఫలితాలు (OUTPUT) అందజేస్తుంది.

కంప్యూటర్ వివరణ
  • లెక్కలు చేయడం కోసం కాలుక్యులేటర్
  • ఉత్తరాలు టైప్ చేయడం కోసం టైపురైటర్
  • ఉత్తరాలు దాచుకోవడం కోసం అలమర
  • ఆటలు ఆడుకొనే వేడియోగేమ్ ప్లేయర్
  • సంగీతం వినే టేపురికార్డర్
  • సినిమాలు చూసే దూరదర్శిని ఇలా ఒకే సాధనం ద్వారా విస్త్రుత ఉపయోగాల సమ్మేళనం కంప్యూటర్. కేవలం ఇవేకాక ఫ్యాక్టరీలలో యంత్ర నిర్దేశకుడు, కార్యాలయలలో కాగితాల పని, సాటిలైట్ వ్యవస్థలలో నిపుణుడు, రోబోట్‌లను నడిపించే పనిమంతుడు ఇలా చాలా చాలా చేయగల సాధనం కంప్యూటర్.

మనిషి విషయం గ్రహిస్తాడు. ఆలోచిస్తాడు. దానికి అనుకూలంగా స్పందిస్తాడు. కాని! కంప్యూటర్ డేటాని ఇన్ పుట్ గా తీసుకొని ప్రొసెస్ చేస్తుంది. అవుట్ పుట్ ఇస్తుంది. ఈ రెండు విష్యాల ద్వారా మనిషి చేసే పనికి కంప్యూటర్ చేసే పనికి దగ్గర దగ్గర పోలికలున్నాయని చెప్పవచ్చు.

డేటా స్వీకరణ

కీబోర్డ్, మౌస్, స్కానర్ మొదలగు పరికరాలు డేటాను మననుంచి తీసుకొని కంప్యూటరుకు అందించుటకు ఉపయోగపడతాయి. వీటిని ఇన్ పుట్ డివైసెస్ అంటారు.వీటిని మనిషి యొక్క కళ్ళు, చెవులు తో పోల్చవచ్చు.

డేటా నియంత్రణ

మనిషి యొక్క శరీర భాగాలను మెదడు ఏవిధంగా నియంత్రిస్తుందో అలాగే కంప్యూటర్లలో మైక్రో ప్రొసెసర్ కంప్యూటరునందలి అన్ని బాగాలను నియంత్రిస్తుంది. ఇది ఇన్ పుట్ నుండి వచ్చిన డేటాను తీసుకొని ప్రోగ్రాముల సహాయంతో విశ్లేషించి పలితాలను తయారు చేస్తుంది.

పలితాలు

ప్రొసెసర్ నుండి సమాచారం గ్రహించి బయటకు అందించే ప్రింటరు మానిటరు మొదలగు బాగాలను అవుట్ పుట్ డివైసెస్ అంటారు. వీటిని మానవ శరీరంలోని మెదడు నుండి సామాచారం అందుకొని పని చేసే కాళ్ళు, చేతులు, నోరు లాంటి వాటితో పోల్చవచ్చు.

[మార్చు] కంప్యూటర్ నిర్మాణము

కంప్యూటర్లలో రకాలు ఉన్నప్పటికీ సాధారణంగా అందరూ వాడే 'పర్సనల్ కంప్యూటర్' నిర్మాణం ప్రకారం టైపురైటరు లాంటి కీ బోర్డ్ కలిగి ఉంటుంది. కీబోర్డ్ ద్వారా కంప్యూటరుకు అవసరమైన డేటా అందిస్తాము. అందుకొన్న డేటాను విశ్లేషించేందుకు సి పి యు (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్) అనేది ఒక బాక్సులో మదర్ బోర్డ్, పవర్ సప్లై బాక్స్, చిన్నప్యాన్స్, ప్లాపీ డిస్క్, డేటా డిస్క్(హార్డ్ డ్రైవ్) అనే వాటితో కలసి ఉంటుంది. సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ నుండి విశ్లేషించబడిన సమాచారమును చూడడం కోసం టెలివిజన్ మాదిరిగా ఉండే మానిటర్ అను సాధనం ఉండును. వీటన్నిటి కలయికనూ కంప్యూటర్ అనవచ్చు. దీనికి ప్రింటర్, స్కానర్ మొదలగువాటిని కలపవచ్చు.

[మార్చు] డేటా

కంప్యూటరులో ప్రోగ్రాము వ్రాయుటకు Cobol, Basic, Fortran, Pascal, C, C++ లు కలవు.ప్రోగ్రాము రాయుటకు కొన్ని నియమ నిభంధనలు, ఆబాషకు అనుకూలమైన డేటా రకాలను ఎన్నుకొని ప్రోగ్రాము వ్రాస్తారు. డేటాలో రెండురకములు కలవు.

నుమరిక్ డేటా(Numaric Data)

నుమరిక్ డేటా అంటే 0,1,2,3,4,5,6,7,8,9, నంబర్లతో ఏర్పాటవుతుంది. నుమరిక్ డేటాను మరలా పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు గా వర్గీకరిస్తారు.

  • పూర్ణ సంఖ్యలు(Integers)

వీటిలో కేవలం Integer నంబర్స్ మాత్రమే ఉంటాయి. వీటిని వోల్ నంబర్స్(Whol numbers)అని కూడా అంటారు. ఉదాహరణ- 0,+16,+32,+24.

  • సహజ సంఖ్యలు(Real numbers)

వీటిలో అన్ని సంఖ్యలూ ఉంటాయి. ఉదాహరణకు-0,+5,1/4,-9, ఇలా. న్యూమరిక్ డేటాను కంప్యూటర్ గుర్తించినపుడు ఆ అంకె ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ ఉంటుంది.

ఆల్ఫా నుమరిక్ డేటా(Alpha Numaric Data)

[మార్చు] కంప్యూటర్ చేయు పనులు

లెక్కలు(CALCULATOIN)
విష్లేషణ(ANALYSIS)
పోలిక(COMPARISION)


జ్ఞాపకం(MEMORISATION)
(RETRIVING)
(UPDATING)
(EDITING)
(PRINTING)
(TRANSFER)
(PLAYER)


[మార్చు] హార్డ్ వేర్

[మార్చు] సాప్ట్ వేర్

[మార్చు] కంప్యూటర్ పనిచేయు విధానం

[మార్చు] కంప్యూటర్ అభివృద్దిక్రమం

కంప్యూటర్ ముఖ్యంగా లెక్కలు చేసేందుకు ఉపయోగించుట కొరకు తయారు చేయబడినది. క్రీస్తు పూర్వం చైనీయులు అబాకస్ అనే సాధనాన్ని లెక్కలు చేసేందుకు వినియోగించేవారు. జాన్ నేపియర్ అను స్కాట్‌లాండ్ దేశ గణిత శాస్త్రజ్ఞుడు గుణకారములను సులభముగా చేయుటకు నేపియర్ బోన్స్ అనే ఎముకలతో తయారు చేయబడిన సాధనమును ఉపయోగించాడు. అదే జాన్ పియర్ తరువాత 1617లో లూగరిధమిక్ టేబుల్స్ ను గుణకారములను భాగహారములను చేసేందుకు తయారు చేసి ఉపయోగించాడు. 1620వ సంవత్సరంలో లూగరిధమ్స్ టేబుల్ ద్వారా కొంత అభివృద్ది చేసి స్లైడ్ రూల్ కనుగొన్నాడు. అయితే ఇవన్నీ మానవ శక్తితో పనిచేసేవే.

వీటి తదనంతరం రూపుదిద్దుకొన్నదే పాస్కల్ ఇది గేర్లు ఇనుప చక్రములు వినియోగించి చేసిన మొదటి యంత్రమనవచ్చు. 1671వ సంవత్సరంలో గాట్ఫ్రెడ్ లైబెంజ్ అను అతడు పాస్కల్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి కూడికలు తీసివేతలతోపాటు గుణకారములు, బాగహారములు కూడా సులభముగా చేయగల్గే లీబ్ నిడ్జ్ అనే యంత్రమును తయారు చేసాడు. 1823వ సంవత్సరంలో కంప్యూటర్ పితామహుడుగా పిలవబడే చార్లెస్ బాబేజ్ అను గణిత శాస్త్రజ్ఞుడు ఆల్జీబ్రా ఈక్వేషన్స్ కూడా చేయగల డిఫరెన్సియల్ ఇంజన్ అనే యంత్రపరికరాన్ని తయారు చేసాడు.

ఇతని కాలంలోనే కావలసిన విడి బాగాలు లబించి ఉంటే కంప్యూటర్ తయారయ్యి ఉండేదని అంటారు. ఎందువలనంటే డిఫెన్సియల్ ఇంజనుపై గడించిన అనుభవంతో నిముషానికి అరవై కూడికలు చేయగలిగి విలువలను మెమొరీలో దాయగల అవకాసం కల ఎనలిటికల్ ఇంజన్ రూపకల్పన చేయగలిగాడు. కాని అతని అవసరానికి సరిపడు క్వాలిటీ గల విడిభాగాలు తయారుచేయగల సామర్ధ్యం కలిగిన పరిశ్రమలు ఆనాడు లేకపోవుటచే ఎనలిటికల్ ఇంజన్ తయారు చేయలేక పోయాడు. తరువాత కంప్యూటర్ అభివృద్దికి హార్మన్ హోల్ రీత్ కృషిచేసి తను తయారు చేసిన కంప్యూటర్లను అవసరం కలిగిన కొన్ని కంపెనీలకు విక్రయించగలిగాడు. ప్రసిద్ది గాంచిన కంప్యూటర్ల సంస్థ ఐ.బి.యమ్(I.B.M) హోల్ రీత్ స్థాపించినదే. మొదటి ఎన్లాగ్ కంప్యూటర్ రకానికి చెందిన లార్డ్ కెల్విన్ అభివృద్ది చేసాడు. దీనితరువాత మార్క్-1 (MARK-1) అనే కంప్యూటర్ 1948 లో ఐ.బి.యమ్. సంస్థ సహకారంతో రూపొందించాడు. ఈ కంప్యూటరునే అస్లైన కంప్యూటరుగా పేర్కొంటారు. దీని తరువాత వాల్వులు ఉపయోగించి కంప్యూటర్లు తయారు చేయబడినాయి.

[మార్చు] కంప్యూటర్ల వర్గీకరణ

కంప్యూటర్లు అవి పనిచేసే సూత్రము బట్టి కొన్ని వర్గాలుగా విభజించారు.

ఎన్లాగ్ కంప్యూటర్స్

ఇందులో బౌతికంగా మారుతుండే విలువలయిన ఉష్ణోగ్రత మరియు పీడనము ల విలువలను తెసుకొని అందుకు అనుగుణమైన విద్యుత్ రంగాలను విశ్లేషించుట ద్వారా మానిటరుపై పలితము తెలియచేయబడుతుంది.

డిజిటల్ కంప్యూటర్స్

డిజిటల్ కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాదారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్, లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్ లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్ర్తత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి. మనం నిత్యం ఉపయోగించు సాదారణమైన కంప్యూటర్లను డిజిటల్ కంప్యూటర్లంటారు. డిజిట్ అంటే అంకె అనే అర్ధంతో వీటిని అలా పిలుస్తున్నారు. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్య లకు సంభందించినవి. ఇన్ పుట్ ఏరూపముగా ఇవ్వబడిననూ దానిని సంఖ్యారూపములోకి మార్చుకొంటాయి. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్యలను ఒక మానం నుండీ వేరొక మానంలోకి (బ్రైనరీ కోడ్) గా మార్చుకొంటూ కేవలం కూడికలు తీసివేతల ద్వారా ఇన్ పుట్ను విశ్లేషిస్తూ తమ పనులను నిర్వర్తించి పలితాలను తెలియపరుస్తూఉంటాయి. ఇవి ఒక గది అంత విస్తీర్ణము నుండి అరచేతిలో ఇమిడిపోయేంత(పామ్ టాప్ కంప్యూటర్) చిన్నగా కూడా ఉంటాయి. ఇవి ఎన్లాగ్ కంప్యూటర్లతో పోలిస్తే ఖర్చు తక్కువ మరియు వేగం కూడా ఎక్కువగా ఉంటాయి.

హైబ్రీడ్ కంప్యూటర్స్

కొన్ని ప్రత్యేక అవసరాలకు ఎన్లాగ్ మరియు డిజిటల్ కంప్యూటర్లను కలిపి తయారు చెస్తారు. వీటిలో కొన్ని లెక్కలు ఎన్లాగ్ కంప్యూటర్ విభాగంలోనూ మరికొన్ని డిజిటల్ విభాగంలొనూ జరుగుతాయి. ఉదాహరణకు హాస్పిటల్లలో ఐసియు విభాగాలలో వీటిని వాడుతుంటారు. ఇవి రోగియొక్క గుండె కొట్టుకొనే రేటును ఎన్లాగ్ ద్వారా తీసుకొని మారుతూ ఉండే విలువలను డిజిటల్ సిగ్నల్స్ రూపంలో విశ్లేషించి రోగికి అపాయమేర్పడినపుడు హెచ్చరిస్తుంది.

కంప్యూటర్ల సామర్ధ్యమును బట్టి మూడు రకాలుగానూ, వాడకమును బట్టీ మూడు రకములుగనూ విడగొట్టవచ్చు వాటిలో

మొదటి రకం.
  • మైక్రో కంప్యూటర్స్
  • మెయిన్ ప్రేమ్ కంప్యూటర్స్
  • సూపర్ కంప్యూటర్స్
రెండవరకం
  • హోమ్ కంప్యూటర్లు
  • మల్టీ మీడియా కంప్యూటర్లు
  • ఎడ్యుకేషనల్ కంప్యూటర్లు

[మార్చు] కంప్యూటర్ తరాలు

[మార్చు] మొదటి తరం కంప్యూటర్స్ (1945-1960)

మొదటి తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులను వాడి తయారు చేసేవారు. వీటిని వాడి తయారు చేసిన మొట్ట మొదటి ఎలెక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాక్ (ENIAC). ఇది రిలేలతో తయారయిన కంప్యూటర్ల కంటే వేగంగా పనిచేయగలదు. సెకనుకు 5000 కూడికలు చేయగలదు. 1946 లో తయారయిన ఎనియాక్లో కంప్యూటర్లో మెమొరీ ఉండేదికాదు. దీని తయారీలో 18.000 వాక్యూం ట్యూబులు, 70.000 రెసిస్టర్లు, 1000 కెపాసిటర్లు, 6000 స్విచ్చులు వాడారు. దీనిని ఉంచేందుకు చాలా ఎక్కువ స్థలము అవసరమవడమే కాక దీనిని నడిపించేందుకు 150 కె,డబ్ల్యు ల విధ్యుత్ అవసరమయ్యేది. అధిక శక్తి వినియోగించుట వలన ఎక్కువ వేడి పుడుతుండేది. 1946 లో జాన్ వాన్ న్యూమన్ కంప్యూటరులో ప్రోగ్రాములను దాచే విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ విధానంలో ఎడ్సాక్ (EDSAC), ఎడ్వాక్ (EDVAC), యునివాక్ (UNIVAC) అనే కంప్యూటర్లు తయారయినవి. మొదటి తరం కంప్యూటర్లు పంచ్ కార్డు ద్వారా డేటాను తీసుకొనేవి. ఐ,బి,యం - 650 (I B M - 650), మరియు ఐ,బి,యం - 701 (I B M - 701) మొదలగునవి మొదటి తరం కంప్యూటర్లు. "

[మార్చు] రెండవతరం కంప్యూటర్స్(1960-1965)

రెండవ తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులకు బదులు ట్రాన్సిస్టర్స్ వాడడం మొదలెట్టారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాక వేగంగా పని చేస్తూ తక్కువ వేడిని విడుదల చేస్తుండేది. ఈ కంప్యూటర్లను సాంకేతిక రంగాలలోనే కాక వ్యాపార అవసరములకు కూడా వినియోగించేవారు. ఈ కంప్యూటర్లను వాడుకొనుటకై ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గాల్, స్కోబాల్ అను బాషలు ప్రత్యేకంగా అభివృద్ది చేయబడినవి. ఇవి ఇంగ్లీషు బాషమాదిరిగా ఉపయోగించుటకు తేలికగా ఉండే బాషలు.

[మార్చు] మూడవతరం కంప్యూటర్స్(1965-1975)

మూడవ తరం కంప్యూటర్స్ చిప్ ఆధారంగా పనిచేయు కంప్యూటర్స్. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ద్వార 1000 కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లను, రెసిస్టర్లను, కెపాసిటర్లను కాప్స్యూల్ సైజుకు లేదా అంతకంటే చిన్నగా చిప్ లేదా ఐ సి(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) గా తయరు చేయవచ్చు. ఇలాంటి చిప్పులను వాడడం ద్వారా కంప్యూటర్స్ పరిమాణం తగ్గించి మినీ కంప్యూటర్లుగా తయారు చేయడం మొదలైంది.

ఈ చిప్పులను ఉపయోగించి తయారైన మెయిన్ ప్రేమ్ కంప్యూటర్లు మరింత శక్తివంతముగా మరాయి. వీటిని విద్యాసంస్థలలో, ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించుట మెదలెట్టారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన ప్రొసెసింగ్ యూనిట్లు, శక్తివంతమైన మెమొరీ, అధిక సామర్ధ్యం కలిగిన చిప్స్ అభివృద్ది చేయబడ్డాయి. ఈ కాలంలోనే అయస్కాంతత్వ టేపుల స్థానంలో డిస్కులు వినియోగంలోకి వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో చెప్పదగిన అభివృద్ది కలిగిన శక్తివంతమైన కంప్యూటర్లు రావడంతో వాటికి అనుసంధానంగా పి,యల్-1, ఫోర్ట్రాన్-4 మొదలగు బాషలు వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో కొన్ని ఐబియమ్ 360 (IBM-360), ఐబియమ్ 370 (IBM-370), ఐసిఎల్ 2900 (ICL-2900) మొదలగునవి.

[మార్చు] నాలగవ తరం కంప్యూటర్స్(1976- ప్రస్తుతం)

మైక్రో ప్రొసెసరునుపయోగించి తయారు చేయబడిన వాఅటిని నాల్గవ తరం కంప్యూటర్లు అనవచ్చు. కంప్యూటరుకు అవసరమైన సర్క్యూట్ మొత్తమును ఒకే సిలికాన్ చిప్ మీద "పరీలార్జ్ ఇంటిగ్రేషన్ " టెక్నాలజీ సహాయంతో సూక్ష్మీకరించి తయారు చేసిన వీటిని చిప్ లేదా 'ఐసిపి' మైక్రో ప్రొసెసరు అంటారు. ఇంటెల్ సంస్థవారిచే తయారు కాబడిన 8080 మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి ఎడ్వర్డ్ రాబర్ట్ మొదటి మైక్రో కంప్యూటరు తయారు చేసాడు. దీని పేరు ఆల్ టెయిరీ. ఐబియమ్ సంస్థ వారూ మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి 1981 లో పర్సనల్ కంప్యూటర్ తయారు చేసారు. వీటి దరలు తక్కువగా ఉండటంతో ఇవి ఎక్కువ ప్రజాధరణ పొందుతున్నాయి. వీటికి ఉదాహరణలు- జెడ్ ఎక్ష్ స్పెక్ట్రం, పిసి ఎట్ పెంటియం.

[మార్చు] ఐదవతరం రాబోవు కంప్యూటర్స్

[మార్చు] ఆపరేటింగ్ సిస్టమ్స్

ఎమ్.ఎస్,డాస్(M S-DOS)


యునిక్స్(UNIX)
విండోస్(WINDOS)

[మార్చు] లాంగ్వేజీలు

మనుషుల మద్య సమచార ప్రసారానికి ఒక మాద్యమం అవసరం. బాష లేకపోతే సమాచర వ్యవస్థ స్థంభించిపోతుంది. అలాగే కంప్యూటర్లతో మాట్లాడలన్నా ఒక బాష అవసరం . కంప్యూటరు కోసం వాడే బాషలను ప్రోగ్రామింగ్ బాష అంటారు. అలాంటి బాషలలో కొన్ని.


బేసిక్

"బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్" అనేదానికి సంక్షిప్త రూపమే బేసిక్. 1960 లో డార్ట్ మౌత్ దీనిని సృష్టించాడు. 1975 లో రొపొందించిన అల్టయిర్ కంప్యూటరు యొక్క ప్రోగ్రామింగ్ బాష ఇదే. ఐబియమ్ వారు పర్సనల్ కంప్యూటర్లలో సైతం ఇదే బాషను వాడారు. కొత్తగా నేర్చుకొనే వారికి సులభంగా అర్ధమయ్యేలా దీనిలో సూచనలు దాదాపు ఆంగ్ల బాష మాదిరిగానే ఉంటాయి.

ఫోర్ట్రాన్

"ఫార్ములా ట్రాన్సులేషన్" కు సంక్షిప్త రూపమే ఫోర్ట్రాన్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ బాషలలో అతి పురాతనమైన బాష. క్లిష్టతరమైన గణిత సంభద సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. 1954 వ సంవత్సరంలో జాన్ బాకస్ తదితరులు దీనిని అభివృద్ది చేసారు. అనేక మార్పులు జరిగిన తరువాత 1977 లో ఫోర్ట్రాన్-77 గానూ 1991 లో ఫోర్ట్రాన్-90 గానూ 1995 లో ఫోర్ట్రాన్-95 గానూ మార్కెటులో విడుదల చేయబడినది.


కోబాల్

"కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి" అనేదానికి సంక్షిప్తరూపం కోబాల్. వాణిజ్య అవసరాలకు ఉపయొగపడే దీనిని 1964 లో రూపొందించారు. 1964 లో అమెరికాలోని అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూట్ వారిచే ఆమోదించబడినది. దీనిని డేటా ప్రొసెసింగ్ కొరకు వాడతారు.

పాస్కల్

జూరిచ్ దేశానికి చెందిన నికొలస్ విర్త్ రూపొందించిన లాంగ్వేజ్ ఇది. దీనిని ఆదునిక పర్సనల్ కంప్యూటర్ల కొరకు మార్పులు చేసి టర్బో పాస్కల్ రూపొందించారు. బోర్లాండ్ కంపెనీ పాస్కల్ బాషకు రకరకాల అభివృద్ది చేస్తూ పాస్కల్ బాషను చరిత్రలో కలసిపోకుండా చేస్తుంది. వీటిలో కొత్తది డెల్ఫీ ఇది విజువల్ బేసిక్ తో పోటీ పడుతున్నది.

సీ(C)
సీ ప్లస్ ప్లస్(C++)
జావా


మరికొంత సమాచారం కోసం చూడండి ప్రోగ్రామింగు భాష

[మార్చు] ప్యాకేజీలు

వర్డ్ స్టార్
డి బేస్
లోటస్
ఒరాకిల్
విజువల్ బేసిక్
పవర్ బిల్డర్
ఎమ్,ఎస్,అఫీస్
ఇ ఆర్ పి
కాడ్


[మార్చు] నెట్ వర్క్

లోకల్ ఏరియా నెట్ వర్క్
మెట్రో పాలిటన్ ఏరియా నెట్వర్క్(లాన్)
వైడ్ ఏరియా నెట్వర్క్(వాన్)
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com