ఉణుకూరు
వికీపీడియా నుండి
ఉనుకూరు, శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామము.
[మార్చు] ఉణుకూరు నియోజక వర్గం
1955 లో ఉణుకూరు నియోజకవర్గము ఏర్పాటైనది. రాజాం కి చెందిన సి. ఎస్. రంగనాయకులు మొట్టమొదటి ఎమ్.ఎల్.ఎ. గా ప్రాతినిధ్యము వహించారు. ఉణుకూరు చరిత్రలో రాజాం పట్నం నుండి ఎన్నికైన ఏకైక శాసనసభ్యునిగా ఆయనిప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు. అనంతరము 1962 లో పాలకొండ ప్రాంతానికి చెందిన పాలవలస సంగంనాయుడు, 1967 లో విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం లక్కనాపురం గ్రామానికి చెందిన ఎం.బి.పరాంకుశం, 1972 లో పాలవలస రుక్మిణమ్మ, 1978లో మరల పరాంకుశం ప్రాతినిధ్యం వహించారు. వీరందరూ కూడా స్థానికేతరులు కావడం విశేషం. 1983 లో కిమిడి కళా వెంకటరావు, 1985, 1989, ఎన్నికల్లో సహితం ఆయనే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1994 లో స్థానికేతరుడైన పాలవలస రాజశేఖరం, 1999లో డా.కిమిడి గణపతిరావు, 2004 లో మరలా కిమిడి కళావెంకటరావు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఒక కుగ్రామమైన ఉణుకూరు నియోజకవర్గ కేంద్రముగా రాస్ట్రస్థాయిలో, జిల్లాలో మంచి ప్రాధాన్యత సంతరించుకుంది.
వోటర్లు = 112990
అభ్యర్ది | పార్టీ | ఓట్లు | ఓట్ల నిష్పత్తి |
కిమిడి కళావెంకటరావు | టి.డి.పి | 61762 | 54.66 |
పాలవలస రాజశేఖరం | కాంగ్రెస్ | 48876 | 49.25 |
బొచ్చ తమ్మినాయుడు | ఇండిపెండెంట్ | 2552 | 2.08 |
[మార్చు] మూలము
- జిల్లా పరిషత్ - శ్రీకాకుళము /సేకరణ:డా.శేషగిరిరావు
|
|
---|---|
సరసన పల్లి · కొండ వలస · జొడు బందల · కొడిస · కందిస · తునివాడ · వెంకం పేట · చెలి గని వలస · రంగ రాయపురం · అముదాలవలస · రేగిడి · బొడ్డవలస · సంకిలి · అప్పాపురం · దేవుదల · పుర్లి · కొమెర · కండ్యం · ఆదవరం · లక్ష్మిపురం · గోపెం పేట · కొండల మామిడి వలస · వందనపేట · ఉంగరాడ · గుల్లపాడు · లింగాల వలస · లక్క రాయపురం · వెంకట రంగరాయ పురం · నేరెళ్ళ వలస · అంబద · వెంకటాపురం · పోరం · పెద సిర్లం · ఉనుకూరు · వొప్పంగి · పరంపేట · పనసల వలస · బాలకవి వలస · ములకల వలస · కొర్ల వలస · బురద · చిన సిర్లం · లచ్చన్న వలస · తాటిపాడు · సొమరాజుపేట · అంబకంది · వవిల వలస · చాతయ్య వలస · అక్కన్న అగ్రహారం · ఉప్పర నాయుడువలస · వన్నెలి |