ఆదిత్య 369
వికీపీడియా నుండి
ఆదిత్య 369 (1991) | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
---|---|
నిర్మాణం | అనితాకృష్ణ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ, సుత్తివేలు, మోహిని, సిల్క్ స్మిత |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | శ్రీదేవీ మూవీస్ |
భాష | తెలుగు |
ఆదిత్య 369
ఇది 1991లో విడుదలైన తెలుగు సినిమా. బాక్ టు ఫ్యూచర్ అనె ఆంగ్ల చిత్రం , ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్పూర్తి పొంది తీసిన చిత్రం.
[మార్చు] చిత్రకథ
కృష్ణ మోహన్ కు టి.వి. లు తయారు చేసే కంపెనీ ఉంది. అతను మోహిని ని ప్రేమిస్తాడు. మోహిని తండ్రి ఒక సైంటిస్టు. అతను కాలయంత్రాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అమ్రిష్ పురి కి పురాతన వస్తువులు సేకరించడం హాబీ. అందుకు అవరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. వయొలిన్ ను వయలెన్స్ ను సమంగా ప్రేమిస్తాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో విలువైన పురాతన వస్తువుకోసం మనుషుల్ని పంపుతాడు. వారిని మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన ఓ కుర్రాడు (మాస్టర్ తరుణ్) చూస్తాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని కృష్ణమోహన్ కాపాడతాడు. మోహిని ఇంట్లో ఒకసారి ప్రయోగ దశలో ఉన్న కాలయంత్రంలో కృష్ణ మోహన్ మోహిని, ఒక పోలీసు ఎక్కి వెనుక కాలానికి (కృష్ణదేవరాయ కాలానికి హంపీ విజయనగర ప్రాంతానికి) వెళ్ళి పోతారు. కృష్ణదేవరాయలి కొలువు అక్కడ రాజనర్తకి తో పోటీ , వజ్రం అపహరణ వణ్టి సంఘటనల తరువాత కృష్ణదేవరాయల సహకారంతో మళ్ళీ కాలయంత్రంలో ఎక్కి , ప్రస్తుత కాలానికి కాక భవిష్యత్ లోనికి వెళ్ళిపోతారు. అక్కడినుండి మళ్ళీ వర్తమానంలోనికి రావడం , అమ్రిష్ పురి తో తలపడటం మిగతాకథ.
[మార్చు] పాటలు
- సెంచురీలు కొట్టే వయస్సు మాది
- రాసలీల వేళ రాయబారమేలా
- జాణవులే నెరజాణవులే