రుచి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
రుచి (Taste) మనం భుజించే ఆహారపదార్ధాల ముఖ్య లక్షణం. ఇది పంచేంద్రియాలలో ఒకటి. దీనిని నాలుక గుర్తిస్తుంది. ఇది కేంద్రీయ నాడీవ్యవస్థ యొక్క పని.
అందరికీ పరిచయమైనవి ఆరు రుచులు; వీటిని షడ్రుచులు అంటారు. అవి మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు మరియు కషాయం అనగా వగరు. అయితే వైద్యశాస్త్రంలో నాలుగు ప్రాధమిక రుచులు చెప్పబడ్డాయి. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు. ప్రపంచంలో భారతీయ ఆహారం చాలా రుచికరమైనదిగా పేర్కొంటారు.
కొందరిలో రుచి పూర్తిగా గాని, పాక్షికంగాని తెలియకుండా పోతుంది. ఇవి కొన్ని వ్యాధుల లక్షణము.