ఫిరాఖ్
వికీపీడియా నుండి
రఘుపతి సహాయ్ 'ఫిరాఖ్' గోరఖ్ పూరి (1896 - 1982), ప్రముఖ ఉర్దూ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ప్రామాణిక ఉర్దూ సాహిత్య జగతులో ప్రముఖంగా ప్రస్తావించవలసిన కవి.
ఫిరాఖ్ గోరఖ్ పూర్లోని కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ప్రభుత్వోద్యోగిగా పనిచేసి రాజీనామా చేశాడు. అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషా ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఉర్దూ భాషా మణిబాల 'గుల్-ఎ-నగ్మా' రచించాడు. ఈ రచన ఆయనకు జ్ఞానపీఠ అవార్డును తెచ్చిపెట్టింది.
ఫిరాఖ్ ఉర్దూ భాషలో ప్రప్రధమంగా జ్ఞానపీఠ అవార్డును పొందిన ఘనుడు.