జెర్మనీ
వికీపీడియా నుండి
|
|||
మధ్య ఐరోపాలోని ఒక ముఖ్య దేశం జర్మనీ. ఐరోపా సమాఖ్య (యూరోపియన్ యూనియన్) లోని సభ్యదేశం. దీని అధికారిక నామం బుండెస్ రిపబ్లిక్ దొయిశ్చ్‌లాండ్ (ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ).
జర్మనీ, 16 రాజ్యాల గణతంత్ర ప్రజాస్వామ్య కేంద్రీయ సమాఖ్య. రాజధాని మరియు ప్రభుత్వ కేంద్రము బెర్లిన్ లో ఉన్నాయి. 1871లో ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం జరుగుతుండగా జర్మనీ ఐక్యమై నేషన్-స్టేట్ ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత రెండుగా చీలిన జర్మనీ, తిరిగి 1990లో ఏకమైనది. జర్మనీ ఐరోపా సమాఖ్య యొక్క వ్యవస్థాపక సభ్యురాలు. 8.2 కోట్ల జనాభాతో ఐరోపా సమాఖ్య సభ్య దేశాలలో అత్యధిక జనాభా గల దేశము జర్మనీ.[1]
[మార్చు] భౌగోళికాంశాలు
జర్మనీకి ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రం, నెదర్లాండ్స్, పోలాండ్, డెన్మార్క్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. 2,389 కి.మీ. కోస్తా తీరాన్ని కలిగిఉంది. పూర్తి విస్తీర్ణం: 356,910 చ.కి.మీ. భూ విస్తీర్ణం: 349,520 చ.కి.మీ.
[మార్చు] జనాభా
మొత్తం జనాభా: 82, 400, 996 (జూలై 2007 లెక్కల ప్రకారం) ఇందులో 95.1% జర్మన్లు, 2.3% తుర్కిష్ లు, 0.7% ఇటాలియన్లు, 0.4% గ్రీకులు, 0.4% పోలులు, ఇతరులు 1.1%.
[మార్చు] మతం
మొత్తం జనాభాలో 45% మంది ప్రొటెస్టెంట్లు, 37% రోమన్ కాథలిక్ లు, 18% ఇతర మతాలవారు ఉన్నారు.
|
---|
క్రొవేషియా · చెక్ రిపబ్లిక్ · డెన్మార్క్ · ఎస్టొనియా · ఫిన్లాండ్ · ఫ్రాన్స్ · జర్మనీ · జార్జియా1 · గ్రీస్ · హంగరీ · ఐస్లాండ్ · ఐర్లాండ్ · ఇటలీ · లాట్వియా · లైచెన్స్టెయిన్ · లిథువేనియా · లక్సెంబర్గ్ · మాల్టా · మోల్డోవా · మొనాకో · నెదర్లాండ్స్ · నార్వే · పోలాండ్ · పోర్చుగల్ · మాసిడోనియా · రుమేనియా · రష్యా1 · సాన్మారినో · సెర్బియా,మాంటినెగ్రో · స్లొవేకియా · స్లొవేనియా · స్పెయిన్ · స్వీడన్ · స్విట్జర్లాండ్ · టర్కీ1 · సైప్రస్2 · ఉక్రెయిన్ · యునైటెడ్ కింగ్డమ్ · వాటికన్ నగరం |