ఇంటర్నెట్టు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఇంటర్నెట్ (Internet) అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్త. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్వర్క్ లను కలిపే నెట్వర్కు. ఈ వ్యవస్తలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. ఆంగ్లంలో Internet అని రాస్తున్నప్పుడు మొదటి అక్షరం అయిన "I"ని ఎల్లప్పుడు కేపిటల్ లెటర్ గానే రాయవలెను. Internet అన్న మాటని తెలుగులో అంతర్జాలం అంటున్నారు.
Internet అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్ధం అవతానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రోడ్లు ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపు లో చూస్తే ఈ చిన్నవీధులు, రోడ్లు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటలు అన్నీ కూడ చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలల్ లాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు. ఈ అంతర్జాలాన్నే ఇంగ్లీషులో Internet అంటారు.
[మార్చు] చరిత్ర
1969లో అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(ARPA)(ఆర్పా)"లో సృస్టించబడినది. తరువాత 1990లో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన "టిం బెర్నెర్స్ లీ" స్విట్జర్ల్యాండ్ లోని CERN వద్ద "వరల్డ్ వైడ్ వెబ్(www)"ను సృస్టించాడు. ప్రస్తుతం మనము ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ISP)లకు కొంత రుసుము చెల్లించి మన కంప్యూటర్లను ఇంటర్నెట్టుకు అనుసంధానించవచ్చు.
[మార్చు] ఇంటర్నెట్ లో మనకు లభించే సేవలు
రోడ్ల ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు (services) లభిస్తున్నాయి. రోడ్ల వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో Electronic అనే మాటకి సంక్షిప్తం. కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు.
రోడ్లు ఉండబట్టే మనం ఇరుగు పొరుగులకి వెళ్ళి బాతాకానీ కొట్టి రాటానికి వీలయింది. అలాగే ఈ విద్యుత్ రహదారిని ఉపయోగించి, ఇల్లు వదలి బయటక్లి వెళ్ళకుండా బాతాకానీ కొట్టొచ్చు. ఈ బాతాకానీనే ఇంగ్లీషులో చాటింగ్ () అంటారు.
రోడ్లు ఉండబట్టే ఆ రోడ్డు వెంబడి గ్రంధాలయానికి వెళ్ళి పుస్తకాలు, పత్రికలు చదవటానికి సానుకూలం అయింది. అదే విధంగా ఈ విద్యుత్ రహదారి వెంబడి మనం ప్రపంచం అంతా తిరిగి బహిరంగంగా ఉన్న గ్రంధాలయాలే కాకుండా ఇంటింటా ఉన్న సొంత గ్రంధాలయాలని కూడ దర్శించి విషతయ సేకరణ చెయ్యవచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జ్ఞాన సంపదనే 'వరల్డ్ వైడ్ వెబ్' అంటారు.
వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా ఉపయోగించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. అంతెందుకు మీరు ఇప్పుడు చదువుతున్న వికీపిడియా కూడా వరల్డ్ వైడ్ వెబ్ లో బాగమే. వరల్డ్ వైడ్ వెబ్ ను పలకటానికి సులువుగా ఉంటుందని వెబ్ అని పిలుస్తుంటారు.
వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.
అయితే కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇంటర్నెటు ఒక్క చెడ్డ వ్యవస్థ అనే అభిప్రాయం కలిగి ఉన్నాయి. అవి ఇంటనెటులోని కొన్ని భాగాలను తమ దేశాలలో ప్రజలు వాడుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు, చైనాలో ప్రజలు ఎవరు కూడా మీరు చదువుతున్న ఈ వికీపిడియాను చదవలేరు, మార్పులు కూడా చేయలేరు. అంతేకాదు కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఇంటర్నెటు చాలా కీడు చేస్తుందని భావిస్తుంటారు.
[మార్చు] ఇంటర్నెటులో జాగ్రత్తగా ఉండండి
ఇంటర్నెటు వలన నష్టాలు కూడా ఉన్నాయి:
- మీరు చెడ్డ సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు వైరసు సోకి చెడిపోయే ప్రమాదం ఉంది.
- తెలియని వారి నుండి వచ్చిన ఈమెయిలుని తెరిచినట్లయితే, మీ కంప్యూటరుకు వైరసు సోకి చెడిపోయే ప్రమాదం ఉంది.
- మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు మనస్తాపం కలిగించే చిత్రాలను చూడవలసి వస్తుంది.
మీరు సరయిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పైన పేర్కొన్నవి అసలు నష్టాలే కావు.